Arjun vs Vishwak Sen: ‘జరిగినదానికి హిమాలయాలకు వెళ్దామనుకున్నా’.. అర్జున్ కామెంట్స్‌కు విశ్వక్ రిప్లై

ప్రెజంట్ టాలీవుడ్ హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే.. అది అర్జున్ సర్జా వర్సెస్ విశ్వక్ సేన్ ఇష్యూ. హీ ఈజ్ నాట్ ప్రొఫెషనల్ అని అర్జున్. నేను పక్కా ప్రొఫెషనల్ అని విశ్వక్ మధ్య... వాదోపవాదాలు ఒక రేంజ్ లో జరుగుతున్నాయ్. ఇంతకీ ఇదే ఇష్యూపై సేన్ రియాక్షన్ ఎలా ఉంది?

Arjun vs Vishwak Sen: 'జరిగినదానికి హిమాలయాలకు వెళ్దామనుకున్నా'.. అర్జున్ కామెంట్స్‌కు విశ్వక్ రిప్లై
Arjun Sarja Vs Vishwak Sen
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 07, 2022 | 8:40 AM

అర్జున్ ఆరోపణలకు విశ్వక్ నోటి నుంచి రెస్పాన్స్ వచ్చింది.  తానెంతో కష్టపడి.. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి.. సినిమా చేస్తుంటే.. అందులో హీరోగా విశ్వక్ సేన్ ను పెట్టుకుంటే.. అతడు షూటింగ్ రోజు తాను రావట్లేదంటూ.. మెసేజ్ చేయడం ఎంత వరకూ కరెక్ట్? ఇదీ అర్జున్ చేసిన కంప్లయింట్.. ఇట్స్ టూ అన్ ప్రొఫెషనల్ అంటూ.. ఆయన ఈ యంగ్ హీరోపై ఫైర్ అవ్వడం  ప్రెజంట్ ఇండస్ట్రీ- బిగ్ డిబేట్ గా మారింది. కానీ ఇందుకు విశ్వక్ సేన్ సీరియస్ గానే రియాక్టయ్యారు.. ఆ సినిమాకు తాను మేలు చేద్దామనే.. ఆ మెసేజ్ పెట్టాననీ.. అందరూ రెండ్రోజుల ముందుగా చెప్పాల్సిందని అంటున్నారు…. కానీ ఆ రోజు పొద్దున్న అయినా చెప్పాల్సింది కదా? అని అడుగుతారనే తానీ మెసేజ్ పెట్టాననీ చెబుతున్నాడు విశ్వక్.  ఇందులో ఇతరులను అవమానపరచాలనే ఉద్దేశమే లేదంటున్నారీ యంగ్ హీరో.. జరిగిన అలజడికి రెండు మూడు రోజులు హిమాలయాలకు వెళ్దాం అనుకున్నట్లు తెలిపాడు. తమ మధ్య సరైన అవగాహన లేదని క్లారిటీ ఇచ్చాడు.

నిజానికి అవమానం ఏదైనా జరిగిందంటే అది తనకేననీ.. తనకూ ఇండస్ట్రీలో జరగాల్సిన అవమానాలు జరిగాయనీ.. తానేం ఊరకే ఈ స్థాయికి రాలేదనీ.. తన సినిమా జర్నీలోనూ ఎన్నో ఇన్సల్టింగ్ చాప్టర్లను ఫేస్ చేశాననీ.. ఈ ఇష్యూతో తనపై చాలా మంది బ్యాడ్ కామెంటింగ్ చేస్తున్నారనీ.. ఇవన్నీ చూసి తన బంధుమిత్రులు ఆందోళన చెందుతున్నారనీ చెప్పుకొస్తున్నారు విశ్వక్. అంతే కాదు.. తనకు కూడా ఒక ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ గా చేసిన అనుభవం ఉందనీ.. అలాంటి తాను ఇతర దర్శక- నిర్మాతలను ఇబ్బంది పెట్టాలని ఎందుకనుకుంటాను? ఇక్కడెవరూ పెద్దా చిన్నా లేరు. మనందరికంటే సినిమాయే గొప్పదంటూ.. కామెంట్ చేశారు విశ్వక్ సేన్.

ఒక సినిమా టీజర్ రిలీజ్ ఫంక్షన్ కి వచ్చిన మాస్ కా దాస్.. ఈ డయాస్ తనది కాకున్నా ఇక్కడ మీరడిగారు కాబట్టి చెబుతున్నానంటూ.. ఇదంతా చెప్పుకొచ్చారు. ఈ టాపిక్ ఇక్కడితో వదిలేయడం కరెక్టనీ.. ఎన్నెన్నో కారణాలతో షూటింగులు ఆగిపోతుంటాయ్. అంత మాత్రానికి తనను అన్ ప్రొఫెషనల్ అని తిట్టడం ఎంతో బాధేసిందని. నిజమైన అవమానం నాకే జరిగిందన్నాడు. నేనేం కావాలని- పనిగట్టుకుని.. అర్జున్ ను అవమానించాలనుకోలేదని చెప్పుకొచ్చాడు. అర్జున్ గారు మంచి సినిమా చెయ్యాలి అయన బాగుండాలని పనిలో పనిగా ఆల్ ది బెస్ట్ చెప్పాడు.  ఈ విషయంలో తన వెర్షన్ చెబుతూనే, ఒక వేళ అర్జున్ అవమానంగా భావిస్తే క్షమించాలని అన్నారు. తాను నిర్మాతల్ని ఇబ్బంది పెట్టే నటుణ్ణి కాదని… ఒక వేళ ఏ ఒక్కరైనా అలా అని నిరూపిస్తే ఇండస్ట్రీ వదిలివెళ్లిపోతానని ఆవేశంగా అన్నారు విశ్వక్. మరి ఈ ఎపిసోడ్ ఇక్కడితో ముగుస్తుందా? లేక మరేదైనా మలుపు తీసుకుంటుందా చూడాలి.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.