AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adipurush: ప్రభాస్ అభిమానులకు బ్యాడ్‏న్యూస్.. ఆదిపురుష్ వాయిదా.. న్యూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన డైరెక్టర్..

ఆదిపురుష్ అనేది సినిమా కాదు. శ్రీరాముడిపై భక్తి, సంస్కృతి, చరిత్రలపై మనకున్న నిబద్ధతకు నిదర్శనం. ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్ అనుభూతిని

Adipurush: ప్రభాస్ అభిమానులకు బ్యాడ్‏న్యూస్.. ఆదిపురుష్ వాయిదా.. న్యూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన డైరెక్టర్..
Adipurush Release Date
Rajitha Chanti
|

Updated on: Nov 07, 2022 | 8:38 AM

Share

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. కొద్ది రోజులుగా ఆదిపురుష్ సినిమాపై వినిపిస్తున్న రూమర్స్ నిజమయ్యాయి. ఎన్నో అంచనాలతో డార్లింగ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆదిపురుష్ సినిమా వాయిదా పడింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కావాల్సిన ఈ మూవీ ఇప్పుడు మరింత ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ డైరెక్టర్ ఓంరౌత్ సోమవారం ఉదయం ట్వీట్ చేశారు.” ఆదిపురుష్ అనేది సినిమా కాదు. శ్రీరాముడిపై భక్తి, సంస్కృతి, చరిత్రలపై మనకున్న నిబద్ధతకు నిదర్శనం. ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్ అనుభూతిని అందించడం కోసం మరికొంత సమయం తీసుకోవాల్సి వస్తుంది. వచ్చే ఏడాది జూన్ 16న ఆదిపురుష్ సినిమాను విడుదల చేయనున్నాం. భారతదేశం గ్వరించే సినిమాగా మీ ముందుకు ఈ చిత్రాన్ని తీసుకురావాలని మేము నిర్ణయించుకున్నాం. మీ ప్రేమాభిమానాలే మమ్మల్ని నడిపిస్తున్నాయి” అంటూ ట్వీట్ చేశారు. దీంతో ప్రభాస్ అభిమానులు తీవ్ర నిరాశ చెందుతూ కామెంట్స్ చేస్తున్నారు.

బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ రామాయణాన్ని ఆధారంగా చేసుకుని ఆదిపురుష్ చిత్రాన్ని రూపొందించారు. దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్‏తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో నిర్మించారు. ఇందులో ప్రభాస్ రాముడిగా.. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీతగా.. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా కనిపించనున్నారు. అయితే ఎన్నో అంచనాలు నెలకొన్న ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్ చూసి ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ముఖ్యంగా వీఎప్ఎక్స్ ఎక్కువైందని.. ప్రభాస్ లుక్ అస్సలు బాలేదని.. యానిమేషన్ చిత్రంగా ఉందంటూ ట్రోల్ చేశారు. అంతేకాకుండా .. ఈ సినిమాలో రావణుడి పాత్రను పూర్తిగా మార్చారని.. హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ ఈ చిత్రయూనిట్ పై ఢిల్లీలో ఫిర్యాదు కూడా చేశారు. దీంతో ప్రభాస్‏తోపాటు చిత్రబృందానికి నోటీసులు జారీ చేసింది కోర్టు.

ఇవి కూడా చదవండి

ఈ క్రమంలోనే టీజర్ పై వచ్చిన నెగిటివిటిని దృష్టిలో పెట్టుకుని ఆదిపురుష్ సినిమాలోని పలు సన్నివేశాలను మార్చాలని డిసైడ్ అయ్యారట మేకర్స్. రావణాసురుడికి చెందిన కొన్ని సన్నివేశాలను తిరిగి రీషూట్ చేయనున్నారని కొద్ది రోజులుగా టాక్ వినిపిస్తుంది. దీంతో సినిమా మరింత ఆలస్యం కానుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.