Samantha: ఆకట్టుకుంటున్న యశోద బీటీఎస్ క్లిక్స్.. సెట్‎లో సమంత ఎంత కష్టపడిందో చూశారా ?..

కొద్ది రోజులుగా మయోసైటిస్ సమస్యతో బాధపడుతున్న సామ్.. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గోనడం లేదు. సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు యశోద అప్డేట్స్ షేర్ చేస్తూ

Samantha: ఆకట్టుకుంటున్న యశోద బీటీఎస్ క్లిక్స్.. సెట్‎లో సమంత ఎంత కష్టపడిందో చూశారా ?..
Samantha
Follow us

|

Updated on: Nov 08, 2022 | 8:35 AM

సరోగసి నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటిస్తోన్న చిత్రం యశోద. ఈ చిత్రాన్ని డైరెక్టర్స్ హరి, హరీష్ తెరకెక్కిస్తుండగా.. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో సామ్ యశోద అనే గర్భవతి స్త్రీగా కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ట్రైలర్ సినిమా పై మరింత ఆసక్తిని క్రియేట్ చేశాయి. లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా రాబోతున్న యశోద సినిమాను తెలుగుతోపాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో నవంబర్ 11న రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్ వేగం పెంచింది చిత్రయూనిట్. అయితే కొద్ది రోజులుగా మయోసైటిస్ సమస్యతో బాధపడుతున్న సామ్.. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గోనడం లేదు. సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు యశోద అప్డేట్స్ షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటుంది. తాజాగా ఈ సినిమా నుంచి కొన్ని బ్యాగ్రౌండ్ స్టిల్స్ రిలీజ్ చేశారు మేకర్స్.

ఈ సినిమా కోసం సమంత శారీరకంగా ఎంతో శ్రమపడ్డారన..దర్శకులతోపాటు.. టీమ్ మొత్తం మంచి ఎఫర్ట్స్ పెట్టారని.. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా ఈమూవీ నుంచి విడుదల చేసిన బీటీఎస్ స్టిల్స్ లో సమంత ఎంతో ఎమోషనల్ గా కనిపిస్తున్నారు. అలాగే సామ్ పక్కనే వరలక్ష్మి శరత్ కుమార్ కూడా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

అయితే సామ్ హెల్త్ గురించి తమకు సినిమా కంప్లీట్ అయిన తర్వాత డబ్బింగ్ సమయంలోనే తెలిసిందన్నారు నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్. తెలుగుతోపాటు.. తమిళంలోనూ సామ్ స్వయంగా చెప్పారని.. ఆ తర్వాత ఎనర్జీ లెవల్స్ తగ్గడంతో హిందీలో చిన్మయి చెప్పిందన్నారు. మూడు నాలుగు రోజులు డాక్టర్‌ను దగ్గర పెట్టుకుని డబ్బింగ్ చెప్పారు. ఆవిడ డిడికేషన్‌కు హ్యాట్సాఫ్ అన్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి