Anushka: ఒక్క ఫోటోతో ఆ రూమర్స్‏కు చెక్ పెట్టిన అనుష్క.. ఎంత అందంగా ఉందో చూశారా ?..

తాజాగా విడుదలైన ఫోటోలో మాత్రం స్వీటీ చాలా సన్నగా.. మరింత అందంగా కనిపిస్తుంది. ఇక అనుష్క వెయిట్ పెరిగిందనే వార్తలకు ఒక్క ఫోటోతో చెక్ పెట్టారు మేకర్స్.

Anushka: ఒక్క ఫోటోతో ఆ రూమర్స్‏కు చెక్ పెట్టిన అనుష్క.. ఎంత అందంగా ఉందో చూశారా ?..
Anushka
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 08, 2022 | 7:21 AM

తెలుగు చిత్రపరిశ్రమలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అనుష్క. అరుందతి సినిమాతో ప్రేక్షకుల హృదయాల్లో జేజమ్మగా స్థానం సంపాదించుకుంది. వరుస అవకాశాలతో ఫుల్ బిజీగా అండే స్వీటీ.. బాహుబలి సినిమా తర్వాత సైలెంట్ అయ్యింది. జక్కన్న తెరకెక్కించిన ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ మూవీతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేశాడు జక్కన్న. అయితే ఈ సినిమా తర్వాత హీరో ప్రభాస్ వరుస చిత్రాలతో బిజీ కాగా.. అనుష్క మాత్రం మరే ప్రాజెక్ట్ ప్రకటించలేదు. కొద్ది రోజులుగా నెట్టింట్లోనూ సైలెంట్‏గా ఉంటుంది.. ఇక ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి సరసన నటిస్తోంది. యంగ్ టాలెంట్ నవీన్ పోలిశెట్టి, అందాల తార అనుష్క శెట్టి హీరోహీరోయిన్లుగా యూవీ క్రియేషన్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు పి మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమాలో అనుష్క చెఫ్ పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉందీ సినిమా. సోమవారం అనుష్క శెట్టి పుట్టినరోజు సందర్భంగా ఆమె ఈ చిత్రంలో పోషిస్తున్న అన్విత రవళి శెట్టి క్యారెక్టర్ లుక్ పోస్టర్‏ను చిత్రబృందం విడుదల చేశారు. ఈ లుక్‏లో ఆమె కిచెన్‎లో డెలిషియస్ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నట్లు ఉందీ లుక్. అంతేకాదు.. బాహుబలి సినిమాలో చాలా లావుగా కనిపించింది అనుష్క. ఆ తర్వాత ఈ సినిమా కోసం ఆమె భారీగా వెయిట్ పెరిగిందని.. అందుకే సోషల్ మీడియాలో ఫోటోస్ అప్లోడ్ అయ్యాయని రూమర్స్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొట్టాయి.

ఇవి కూడా చదవండి

కానీ తాజాగా విడుదలైన ఫోటోలో మాత్రం స్వీటీ చాలా సన్నగా.. మరింత అందంగా కనిపిస్తుంది. ఇక అనుష్క వెయిట్ పెరిగిందనే వార్తలకు ఒక్క ఫోటోతో చెక్ పెట్టారు మేకర్స్. ఈ స్పెషల్ పోస్టర్‏లో అనుష్కకు బర్త్ డే విశెస్ తెలిపారు. వచ్చే ఏడాది తెరపైకి రానున్న ఈ మూవీపై ఫిల్మ్ లవర్స్‏లో మంచి అంచనాలున్నాయి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.