Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: అల్లు అర్జున్‏ను ఏడిపించేసిన శిరీష్.. తమ్ముడి మాటలకు బన్నీ ఎమోషనల్.. వీడియో వైరల్..

హైదరాబాద్‏లో చిత్ర యూనిట్ గ్రాండ్‏గా సక్సెస్ సెలెబ్రేషన్స్ నిర్వహించింది ఉర్వశివో రాక్షసివో చిత్రయూనిట్. ఈ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నిర్మాత దిల్‏రాజు‏లు ముఖ్య అతిధిలుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా అల్లు శిరీష్ మాట్లాడుతున్న సమయంలో బన్నీ ఎమోషనల్ అయ్యాడు.

Allu Arjun: అల్లు అర్జున్‏ను ఏడిపించేసిన శిరీష్.. తమ్ముడి మాటలకు బన్నీ ఎమోషనల్.. వీడియో వైరల్..
Allu Arjun, Sirish
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 08, 2022 | 7:00 AM

విజేత సినిమా దర్శకుడు రాకేష్ శశి దర్శకత్వం వహించిన లేటేస్ట్ చిత్రం ఉర్వశివో రాక్షసివో. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో అల్లు శిరీష్, అను ఇమ్మాన్యూల్ జంటగా ఈ చిత్రాన్ని జీఏ-2 పిక్చర్స్‌ ధీరజ్ మొగిలినేని నిర్మించారు. అచ్చు రాజమణి సంగీతం అందించిన ఈ చిత్రానికి విజయ్ ఎం సహనిర్మాతగా వ్యవహారించారు. నవంబర్‌ 4న థియేటర్లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని సక్సెస్ ఫుల్‏గా రన్ అవుతోంది.ఈ నేపధ్యంలో హైదరాబాద్‏లో చిత్ర యూనిట్ గ్రాండ్‏గా సక్సెస్ సెలెబ్రేషన్స్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నిర్మాత దిల్‏రాజు‏లు ముఖ్య అతిధిలుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా అల్లు శిరీష్ మాట్లాడుతున్న సమయంలో బన్నీ ఎమోషనల్ అయ్యాడు.

అల్లు శిరీష్ మాట్లాడుతూ.. అరవింద్ గారి అబ్బాయిగా పుట్టడం నా అదృష్టం. బన్నీ అన్న. నన్ను ఓ తమ్ముడిలా కాకుండా కొడుకులా చూస్తాడు. సోషల్ మీడియాలో విషెస్ చెబుతున్నప్పుడు మై బేబీ శిరిఅంటూ రాస్తుంటాడు. చాలా రోజుల తర్వాత తనను నేను కలిస్తే చిన్నపిల్లాడిలా బుగ్గలు గిల్లి ముద్దు చేస్తుంటాడు. మా అన్నయ్యకు నేనంటే అంత ప్రేమ. తనకు తమ్ముడిగా పుట్టడం నా అదృష్టం. నేను ఏదైన జీవితంలో సాధించాలకునుంటే అవేవి మిగల్చకుండా పెట్టాడు. అందుకు కూడా తనకు థాంక్స్. వచ్చే ఏడాది పుష్ప 2తో బాక్సాఫీస్ బద్దలైపోతుంది.

ఇవి కూడా చదవండి

మరోసారి తెలుగు సినిమా స్థాయేంటో దేశానికి చూపిస్తున్నారు అన్నారు శిరీష్. అయితే తన తమ్ముడు తన గురించి అలా మాట్లాడుతుంటే బన్నీ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.