Rashmika Mandanna: నన్ను ఇంతలా ఎందుకు బాధపెడుతున్నారు.. నాపై అంత ద్వేషం ఎందుకు ?.. రష్మిక మందన్న ఎమోషనల్..

తాను ప్రస్తుతం ప్రేక్షకులను అలరించేందుకు ఎంత కష్టపడుతున్న కొందరు తన గురించి సోషల్ మీడియాలో చేసే నెగిటివ్ ప్రచారం తన హృదయాన్ని ఎంతగానో గాయపరుస్తున్నాయని అన్నారు రష్మిక..

Rashmika Mandanna: నన్ను ఇంతలా ఎందుకు బాధపెడుతున్నారు.. నాపై అంత ద్వేషం ఎందుకు ?.. రష్మిక మందన్న ఎమోషనల్..
Rashmika Mandanna
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 09, 2022 | 8:32 AM

పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉంది. పుష్ప చిత్రంతో దేశవ్యాప్తంగా మరింత క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. అటు బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ రాణిస్తోంది. ఇటీవలే గుడ్ బై చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేషనల్ క్రష్.. త్వరలోనే పుష్ప 2 చిత్రీకరణలో పాల్గొననుంది. బ్యా్క్ టూ బ్యాక్ సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా తన ఇన్ స్టాలో ఎమోషనల్ నోట్ షేర్ చేసింది. సోషల్ మీడియాలో తనపై వస్తున్న ట్రోల్స్.. రూమర్స్ గురించి ఆవేదన వ్యక్తం చేసింది. తాను ప్రస్తుతం ప్రేక్షకులను అలరించేందుకు ఎంత కష్టపడుతున్న కొందరు తన గురించి సోషల్ మీడియాలో చేసే నెగిటివ్ ప్రచారం తన హృదయాన్ని ఎంతగానో గాయపరుస్తున్నాయని అన్నారు. ఇప్పటివరకు ట్రోల్స్ భరించిన రష్మిక.. తాజాగా తన మనసులోని బాధను సుధీర్ఘ నోట్ ద్వారా అభిమానులతో పంచుకుంది.

“గత కొన్ని రోజులుగా.. లేదా నెలలుగా వస్తున్న కొన్ని విషయాలు నన్ను ఇబ్బందిపెడుతున్నాయి. ఇప్పుడు వాటిని పరిష్కరించే సమయం వచ్చిందనుకుంటున్నాను. ఇప్పుడు నేను నా కోసం మాత్రమే మాట్లాడుతున్నాను. నేను ఈ పని చాలా సంవత్సరాల కిందే చేయాల్సి ఉంది. నేను నా కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి అనేకసార్లు ద్వేషానికి గురవుతున్నాను. చాలా ట్రోల్స్.. నెగిటివిటి.. నా గురించి మాట్లాడటం.. చాలా బాధిస్తుంది. నాకు తెలుసు నేను ఎంచుకున్న జీవితం చాలా కష్టతరమైనదని. ప్రతి ఒక్కరు నన్ను ప్రేమిస్తారు అని అనుకోను. మీకు నేను నచ్చకపోతే.. నా మీద నెగిటివిటి చేయాలని లేదు. రోజుకు రోజుకు నేను చేసే పని ప్రాముఖ్యత నాకు తెలుసు. నా పని చూసి మీరు ఆనందించడమే నేను ఎక్కువగా పట్టించుకుంటాను… మీరు.. నేను గర్వించదగిన విషయాలను బయటపెట్టడానికి నేను నా శక్తి మేరకు ప్రయత్నిస్తున్నాను.

ఇవి కూడా చదవండి

కానీ సోషల్ మీడియాలో నన్ను ట్రోల్ చేయడం.. నాపై నెగిటివిటిని వ్యాప్తి చేయడం హృదయాన్ని బాధిస్తుంది. అవి నన్ను నిరుత్సాహపరుస్తుంది. ముఖ్యంగా కొన్ని ఇంటర్వ్యూలలో నేను చెప్పని విషయాలు నాకు వ్యతిరేకంగా మారుతున్నాయి. నాకు.. ఇండస్ట్రీలో.. బయట ఉన్న సంబంధాలు..నాకు వ్యతిరేకంగా అనేక కథనాలు నెట్టింట్లో వైరలవుతున్నాయి. నేను కేవలం నిర్మాణత్మక విమర్శలను మాత్రమే స్వాగతిస్తాను. ఎందుకంటే నన్ను నేను మరింత మెరుగుపరచడానికి ప్రయత్ని్స్తాను. కానీ నాపై ఇంత నీచమైన నెగిటివిటి.. ద్వేషం ఎందుకు ?.. చాలా రోజులుగా ఈ కథనాలను వదిలేశాను. నాపై మీరు చూపించే ఈ ద్వేషంతో నేను మరింత బలంగా మారతానని అనుకోవడం లేదు. అభిమానులు.. ప్రియమైన వారి ప్రేమ నన్ను ముందుకు నడిపిస్తున్నాయి.

మీలో కొందరు నాపై చూపిస్తున్న ప్రేమకు రుణపడిపోయాను. వారి ప్రేమే ఎల్లప్పుడు నన్ను మరింత ముందుకు నడిపిస్తుంది. ఆ ప్రేమే ఇప్పుడు ఇలా నా మనసులోని మాటలను చెప్పేందుకు దైర్యాన్ని ఇచ్చింది. నా చుట్టూ ఉండే వారు నన్ను ప్రేమిస్తున్నారు. ఇప్పటివరకు నేను కలిసి పనిచేసిన వ్యక్తులు నన్ను మెచ్చుకున్నారు. నేను మీ కోసం కష్టపడి పనిచేస్తూనే ఉంటారు. మిమ్మల్ని అలరించేందుకు మరింత కష్టపడతాను. మీ సంతోషం.. నాకు సంతోషాన్నిస్తుంది. మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేందుకు నా వంతు ప్రయత్నం నేను చేస్తాను.. ధన్యవాదాలు ” అంటూ రాసుకొచ్చింది రష్మిక..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.