AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Janhvi Kapoor: ఈఎంఐలు కట్టడానికి జాన్వీ కపూర్ ఎంచుకున్న దారి తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

సినిమాలో కంటెంట్ ప్రాధాన్యత ఉన్న పాత్రలలో.. ఎన్నో సవాళ్లతో కూడిన రోల్స్ ఎంచుకుంటూ నటనపై దృష్టి పెట్టిన జాన్వీ సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోస్ మాత్రం గ్లామరస్ గా ఉంటాయి. ఇప్పటివరకు జాన్వీ కనిపించిన

Janhvi Kapoor: ఈఎంఐలు కట్టడానికి జాన్వీ కపూర్ ఎంచుకున్న దారి తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
Jahnvi Kapoor
Rajitha Chanti
|

Updated on: Nov 09, 2022 | 1:02 PM

Share

బాలీవుడ్ జాన్వీ కపూర్ ఇటీవల మిలి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీతోపాటు తెలుగలోనూ విడుదలైన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా జాన్వీ నటనపై సినీ విమర్శకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. బడా ప్రొడ్యూసర్ బోనీ కపూర్.. దివంగత హీరోయిన్ శ్రీదేవి దంపతుల నటవారసురాలిగా ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసి అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఓవైపు వెండితెరపై సందడి చేస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టి్వ్‏గా ఉంటుంది. నెట్టింట ఈ ముద్దుగుమ్మకు లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. కేవలం ఇన్ స్టాలోనే దాదాపు 2.3 కోట్లు (20.3 మిలియన్స్) ఫాలోవర్స్ ఉన్నారు. అయితే సినిమాలో కంటెంట్ ప్రాధాన్యత ఉన్న పాత్రలలో.. ఎన్నో సవాళ్లతో కూడిన రోల్స్ ఎంచుకుంటూ నటనపై దృష్టి పెట్టిన జాన్వీ సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోస్ మాత్రం గ్లామరస్ గా ఉంటాయి. ఇప్పటివరకు జాన్వీ కనిపించిన చిత్రాల్లో సాధారణ మధ్య తరగతి అమ్మాయిగా కనిపించగా.. నెట్టింట మాత్రం గ్లామర్ షో చేస్తుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె ఇంటర్నెట్ ఫోటోస్ గురించి అడగ్గా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

ఇన్ స్టాలో మీరు పోస్ట్ చేసే అల్ట్రా గ్లామరస్ ఫోటోలను చూసిన ప్రేక్షకులు.. వెండితెరపై మీ డి గ్లామరస్ పాత్రలను అంగీకరించలేకపోతున్నారు అంటూ యాంకర్ ప్రశ్నించగా.. జాన్వీ మాట్లాడుతూ.. “వాస్తవానికి నేను నా నిజ జీవితంలో తెరపై కనిపించే దానికి పూర్తిగా భిన్నంగా ఉంటాను. నేను సోషల్ మీడియాలో సరదాగా గడపాలనుకుంటానని తెలిపింది. ఇలా చేస్తే తన ఈఎంఐలను చెల్లించడంలో సహాయపడుతుంది. నేను దీనిని అంత సీరియస్ గా తీసుకోను. నేను క్యూట్ గా కనిపిస్తే మరో ఐదుగురు వ్యక్తులు నాఫోటోలను ఇష్టపడితే నేను అదనంగా మరొక బ్రాండ్ ను పొందుతాను. ప్రకటనల్లో నటించి నా ఈఎంఐలు చెల్లించగలనని ఆశిస్తున్నాను. ఇంతకుముందు కంటే చాలా సులభంగా ఇప్పుడు ఈఎంఐలు చెల్లిస్తున్నాను ” అంటూ చెప్పుకొచ్చింది జాన్వీ.

ఇవి కూడా చదవండి

ఇక ఇటీవల మిలి చిత్రంతో థియేటర్లలో సందడి చేసిన జాన్వీ త్వరలోనే మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమాలో నటిస్తోంది. అలాగే రొమాంటిక్ కామెడీ బవాల్ చిత్రంలో కనిపించనుంది. ఇదిలా ఉంటే.. త్వరలోనే జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రానున్న ఎన్టీఆర్ 30 ప్రాజెక్టులో జాన్వీ నటించనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.