Optical Illusion: కాఫీ గింజల మధ్య చాటుగా దాగున్న మనిషి ముఖాలు.. 15 సెకన్లలో కనిపెడితే మీవి డేగ కళ్లే
ప్రస్తుతానికి అలాంటి ఫొటో పజిల్ ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇందులో కాఫీ గింజల మధ్య మనిషి ముఖాలు కూడా ఉన్నాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా కనిపించని విధంగా కాఫీ గింజల మధ్య మనుషుల ముఖాలను అమర్చాడు ఈ ఫొటోను డిజైన్ చేసిన కళాకారుడు.
ఈ రోజుల్లో సోషల్ మీడియా యూజర్లు ఎక్కువగా ఇష్టపడే విషయం ఏదైనా ఉందంటే అది ఆప్టికల్ ఇల్యూషన్. నెట్టింట్లో ట్రెండ్ అవుతున్న ఫొటో పజిల్స్‌ని పరిష్కరించేందుకు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇవి మన కళ్లతో పాటు మన మెదడుకు పదును పెడతాయి.పరిశీలనా నైపుణ్యాలను మెరుగుపరుస్తాయి. అలాగే చిన్న చిన్న విషయాలను చూడటం పట్ల మన వైఖరిని పరీక్షిస్తాయి. ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఫొటో చాలా క్లియర్‌గా ఉన్నప్పటికీ అందులో మన కళ్లకు కనిపించని ఓ మర్మం దాగుంటుంది. అది కనుక్కోవడమే అసలు పని. ప్రస్తుతానికి అలాంటి ఫొటో పజిల్ ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇందులో కాఫీ గింజల మధ్య మనిషి ముఖాలు కూడా ఉన్నాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా కనిపించని విధంగా కాఫీ గింజల మధ్య మనుషుల ముఖాలను అమర్చాడు ఈ ఫొటోను డిజైన్ చేసిన కళాకారుడు. మీకు పదునైన కన్ను ఉంటేనే ఈ ఛాలెంజ్‌ని స్వీకరించండి. ఇందుకు మీరు ఇస్తున్న సమయం ఎంతో తెలుసా 15 సెకెన్లు. మరి ఇతరుల కంటే భిన్నంగా ఆలోచిస్తున్నారా? మీవి డేగ కళ్లకు ఉన్నంత పదును ఉందా? మరెందుకు ఆలస్యం? ఈ ఫొటో పజిల్‌ను సాల్వ్ చేయండి.
కొంచెం గందరగోళం, తికమకతో కూడుకున్న ఈ ఫొటో పజిల్‌ను సాల్వ్ చేయడం కొంచెం కష్టమే. అయితే కాస్తా ఓపిక తెచ్చుకుంటే అసాధ్యమేమీకాదు. కాస్త కళ్లను పెద్దవిగా చేసుకుని చూస్తే ఈజీగా ఈ ఫొటో పజిల్‌ను సాల్వ్ చేయవచ్చు. అన్నట్లు దీని కోసం క్లూ కూడా ఇస్తున్నామండోయ్.. అదేంటంటే కాఫీ ఫొటోను రూపొందించిన డిజైనర్ మనిషి ముఖాలను అడుగు భాగంలో పొందు పరిచాడు. ఇప్పటికీ మీరూ ఈ పజిల్‌ను సాల్వ్ చేయలేకపోతే సమాధానం కోసం కింది ఫొటో చూడండి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..