Drunk Man Video: చేపలు పట్టేందుకు వెళ్లి మద్యం మత్తులో కొండచిలువను కౌగిలించుకుని విన్యాసాలు.. నెక్స్ట్ ఏమి జరిగిందంటే
ఓ వృద్ధుడు మద్యం సేవించి.. ఆ మత్తులో చేపలకు బదులు కొండచిలువతో పరాచికాలాడుతూ ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడు. చివరకు గంటల తరబడి ఎంతో శ్రమపడి గ్రామస్థులు ఆ వృద్ధుడి ప్రాణాలను కొండచిలువ నుంచి రక్షించారు.
మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అన్న సంగతి తెలిసిందే.. అంతేకాదు మద్యం మత్తులో చేసే పనులు కూడా ప్రాణాల మీదకు తెస్తాయి. ఇందుకు సంబంధించిన అనేక ఉదాహరణలు మనం చాలా చూస్తూనే ఉన్నాం. అయితే ఓ వృద్ధుడు మద్యం సేవించి.. ఆ మత్తులో చేపలకు బదులు కొండచిలువతో పరాచికాలాడుతూ ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడు. చివరకు గంటల తరబడి ఎంతో శ్రమపడి గ్రామస్థులు ఆ వృద్ధుడి ప్రాణాలను కొండచిలువ నుంచి రక్షించారు. ఈ దారుణ ఘటన జార్ఖండ్‌లో చోటు చేసుకుంది.
జార్ఖండ్‌లోని గర్వా జిల్లాలోని పరిహారా పంచాయితీకి చెందిన కితాసోటి ఖుర్ద్ గ్రామానికి చెందిన 55 ఏళ్ల బిర్జలాల్ రామ్ భుయాన్ అనే వ్యక్తి కొండచిలువను పట్టుకుని ఆటలాడడం ప్రారంభించాడు. మద్యం మత్తుతో కొండచిలువతో తన చుట్టూ ఉన్న ప్రజలకు వినోదం పేరుతో గారడీ చేయడం ప్రారంభించాడు. ఈ సమయంలో కొండచిలువ బిర్జాలాల్ రామ్ భుయాన్ మెడను చుట్టుకుంది. వృద్ధుడికి ఊపిరి ఆడకుండా చేయడం ప్రారంభించింది.. దీంతో వృద్ధుడు తన ప్రాణాలను రక్షించమని వేడుకున్నాడు. గ్రామస్థులు బిర్జాలాల్ పరిస్థితి చూసి.. వెంటనే అతడి కొడుకుకు తెలియజేశారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మరికొందరి సహాయంతో గంటల తరబడి శ్రమించి కొండచిలువ పాము బారి నుండి బీర్జలాల్‌ను రక్షించాడు. ఈ సంఘటన తర్వాత వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్సనందించారు.
తాగుబోతు గారడీ:
Jharkhand : अजगर के साथ होशियारी पड़ी भारी…
नशे की हालत में मछली मारने गए व्यक्ति को अजगर ने पकड़ा, Video Viral#Jharkhand | #ViralVideo pic.twitter.com/bMVziJho4I
— TV9 Bharatvarsh (@TV9Bharatvarsh) November 10, 2022
అంరాజ్ డ్యాం నుంచి కాలువ తమ గ్రామం గుండా వెళుతుందని.. అయితే ప్రస్తుతం కాలువలో నీరు తక్కువగా ఉందని గ్రామస్తులు తెలిపారు. దీంతో చాలా మంది గ్రామస్తులు కాలువలో చేపల వేటకు వెళుతుండడంతో బీర్జాలాల్ కూడా చేపల వేటకు వెళ్లాడు. అయితే మద్యం మత్తులో నీటిలోకి దిగి చేపలతో పాటు.. ఓ కొండచిలువను కూడా పట్టుకున్నాడు. దానితో గారడీ చేస్తుండడంతో.. వద్దని గ్రామస్థులు నివారించినా..మద్యం మత్తులో కొండచిలువతో వికృత చేష్టలు చేస్తుండగా కొండచిలువ బిర్జలాల్ రామ్ భుయాన్ మెడకు చుట్టుకుందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ప్రాణాల మీదకు రావడంతో.. ప్రాణ భయంతో అరవడం ప్రారంభించాడు. చివరకు ఎంతో కష్టపడి కొండచిలువ బారి నుంచి ఆ వృద్ధుడి ప్రాణాలను కాపాడారు.
కొండచిలువలు విషపూరితం కానప్పటికీ.. అది తన ఆహారంగా జంతువులతో పాటు.. మనుషులను కూడా తినేస్తుందన్న సంగతి తెలిసిందే.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..