AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sukumar: పెద్ద మనసు చాటుకున్న డైరెక్టర్‌ సుకుమార్‌.. క్యాన్సర్‌ బాధితుడికి ఆర్థిక సాయం

స్నేహితులు ఆనంద్‌ చికిత్స కోసం డబ్బులు ఎవరైనా సాయం చేయగలరంటూ ఫేస్‌బుక్‌ లో ఒక పోస్ట్‌ పెట్టారు. దీనిని చూసిన డైరెక్టర్‌ సుకుమార్‌ అతనికి రూ.50వేల ఆర్థికకసాయం చేశారు.

Sukumar: పెద్ద మనసు చాటుకున్న డైరెక్టర్‌ సుకుమార్‌.. క్యాన్సర్‌ బాధితుడికి ఆర్థిక సాయం
Director Sukumar
Basha Shek
|

Updated on: Nov 10, 2022 | 1:49 PM

Share

ప్రముఖ సినీ దర్శకుడు సుకుమార్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఓ వ్యక్తి చికిత్స కోసం తనవంతు సాయం అందించారు. వివరాల్లోకి వెళితే అంబేద్కర్ కోనసీమ జిల్లా జనుపల్లెకు చెందిన ఆనంద్ గత కొంతకాలంగా కాన్సర్‌తో బాధపడుతున్నాడు. అతని స్నేహితులు ఆనంద్‌ చికిత్స కోసం డబ్బులు ఎవరైనా సాయం చేయగలరంటూ ఫేస్‌బుక్‌ లో ఒక పోస్ట్‌ పెట్టారు. దీనిని చూసిన డైరెక్టర్‌ సుకుమార్‌ అతనికి రూ.50వేల ఆర్థికకసాయం చేశారు. సినిమాల్లోనే కాదు సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటాడు సుకుమార్‌. ఇప్పుడే కాదు గతంలోనూ పలు సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారాయన. తన స్వస్థలం మట్టపర్రు గ్రామంలో తన సొంత నిధులతో పాఠశాలను ఏర్పాటు చేశాడు. చుట్టు పక్కల గ్రామాల్లోనూ తన తండ్రి పేరుతో పలు స్కూల్స్‌, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక కరోనా కాలంలోనూ రూ.లక్షలు ఖర్చు చేసి బాధితులకు ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, ఆహార సదుపాయాలు సమకూర్చారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. అల్లు అర్జున్‌ పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయారు సుకుమార్‌. గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ఈచిత్రం దేశవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. బన్నీ యాక్టింగ్‌కు తోడు సుకుమార్‌ టేకింగ్‌పై సర్వత్రా ప్రశంసలు వచ్చాయి. ప్రస్తుతం ఇదే సినిమాకు పుష్ప 2.. దిరూల్‌ పేరుతో సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు. మొదటి పార్ట్‌కు మించిన కథా కథనాలు, గ్రాండ్‌నెస్‌తో పుష్ప2 సినిమాను తెరకెక్కించనునట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి