Alia Bhatt: నెట్టింట వైరలవుతోన్న అలియా భట్‌ బేబీ ఫొటోలు, వీడియోలు.. వీటిలో నిజమెంతంటే?

అలియా దంపతులు కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ పాప ముఖాన్ని ఎక్కడా చూపించలేదు. దీంతో ఈ ఫొటోలు, వీడియోలు మార్ఫింగేనని తెలుస్తోంది. ముఖ్యంగా ఓ వీడియోలో అలియా తన బేబీని ముద్దాడుతూ కనిపిస్తోంది. ఆ వీడియో ఆలియా ఉన్న ఆసుపత్రి నుంచి లీక్ అయిందని పలువురు నెటిజన్లు భావిస్తున్నారు.

Alia Bhatt: నెట్టింట వైరలవుతోన్న అలియా భట్‌ బేబీ ఫొటోలు, వీడియోలు.. వీటిలో నిజమెంతంటే?
Alia Bhatt, Ranbir Kapoor
Follow us
Basha Shek

|

Updated on: Nov 10, 2022 | 8:42 AM

బాలీవుడ్‌ రొమాంటిక్‌ కపుల్‌ అలియా భట్‌, రణ్‌బీర్ కపూర్ అమ్మానాన్నలుగా ప్రమోషన్‌ పొందారు. ముంబైలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఆదివారం అలియా పండంటి ఆడ బిడ్డకి జన్మనిచ్చింది. మహాలక్ష్మీ అడుగుపెట్టడంతో కపూర్‌ కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. సోషల్‌ మీడియా వేదికగా పలువురు సినిమా తారలు అలియా దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సమయంలో కొందరు నెటిజన్లు అలియా భట్‌ బేబీ అంటూ కొన్ని ఫొటోలు, వీడియోలు నెట్టింట షేర్‌ చేస్తున్నారు. దీంతో అవి ప్రస్తుతం వైరల్‌గా మారాయి. అయితే అలియా దంపతులు కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ పాప ముఖాన్ని ఎక్కడా చూపించలేదు. దీంతో ఈ ఫొటోలు, వీడియోలు మార్ఫింగేనని తెలుస్తోంది. ముఖ్యంగా ఓ వీడియోలో అలియా తన బేబీని ముద్దాడుతూ కనిపిస్తోంది. ఆ వీడియో అలియా ఉన్న ఆసుపత్రి నుంచి లీక్ అయిందని పలువురు నెటిజన్లు భావిస్తున్నారు. అయితే ఆ వీడియో మార్ఫింగ్ చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

కాగా పాప పుట్టిన వెంటనే సామాజిక మాధ్యమాల వేదికగా ఒక ప్రకటనను విడుదల చేశారు అలియా దంపతులు. ‘మా జీవితంలో ఇవి అత్యంత మధుర క్షణాలు. మా పాప కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టింది. తనొక మ్యాజికల్‌ గాళ్‌. మేం తల్లిదండ్రుల హోదా అందుకున్నాం అని ప్రకటిస్తూ ఆనందంలో మునిగిపోతున్నాం’ అని తమ ఆనందానికి అక్షర రూపమిచ్చారీ లవ్లీ కపుల్‌.

ఇవి కూడా చదవండి

పాప పేరు అదేనా?

కాగా డెలివరీకి ముందు ఓ టీవీ షోకు వెళ్లిన ఆలియా భట్.. ఓ చిన్న అబ్బాయిని తన పేరు స్పెల్లింగ్ చెప్పమని అడిగింది. దానికి ఆ చిన్నారి.. ALMAA అని చెప్పాడు. దీంతో అలియా గట్టిగా నవ్వతూ ‘ అల్మా.. అందమైన పేరు. నాకు కూతురు పుడితే ఇదే పేరు పెడతాను’ అని చెప్పింది. దీంతో అలియాకు ఇప్పుడు కూతురు పుట్టడంతో .. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన పాపకు అల్మా లేదా మరేపేరు పెడుతుందోనని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

View this post on Instagram

A post shared by actor (@actorsss_0)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే