FIR on Rakhi Sawant: హద్దులు దాటిన బాలీవుడ్ భామల మటల యుద్ధం.. రాఖీ సావంత్‌పై షెర‍్లిన్ చోప్రా కేసు

బాలీవుడ్ హీరోయిన్స్ రాఖీ సావంత్, షెర్లిన్ చోప్రా మధ్య మాటల యుద్ధం పోలీస్ స్టేషన్‌కు చేరింది. షెర్లిన్ డబ్బు కోసం డబ్బున్నవారిని టార్గెట్ చేసుకుని బ్లాక్ మెయిల్ చేస్తుందని రాఖీ సావంత్ ఆరోపించింది.

FIR on Rakhi Sawant: హద్దులు దాటిన బాలీవుడ్ భామల మటల యుద్ధం.. రాఖీ సావంత్‌పై షెర‍్లిన్ చోప్రా కేసు
Sherlyn Chopra and Rakhi Sawant
Follow us
Sanjay Kasula

|

Updated on: Nov 10, 2022 | 7:39 AM

సినీ నటుల మధ్య గొడవలు జరగడం కామన్. ఇలాంటివి సోషల్ మీడియా వరకు మాత్రమే పరిమితం అవుతాయి. అయితే అది పోలీసు స్టేషన్ వరకు వెళ్లడం చాలా అరుదుగా జరుగుతుంది. అందులోనూ బాలీవుడ్‌ లాంటి బి టౌన్‌లో ఇది మరీ తక్కువ. సినీ నటి రాఖీ సావంత్‌, ఆమె అడ్వకేట్‌ స్నేహితుడు ఫల్గుణి బ్రహ్మభట్‌పై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. మీడియా సమావేశంలో ఓ మహిళపై అభ్యంతరకర వీడియో చూపించి వారిద్దరు కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని పోలీసులకు ఫిర్యాదు అందింది. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అంబోలి, ఓషివారా పోలీస్ స్టేషన్లలో రాఖీపై ఫిర్యాదు చేసినట్లు షెర్లిన్ చోప్రా ట్వీట్ ద్వారా వెల్లడించింది. నటి, మోడల్ షెర్లిన్ చోప్రా రాఖీ సావంత్‌పై ఈ ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసింది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం, రాఖీ సావంత్,  ఆమె న్యాయవాది ఫల్గుణి బ్రహ్మభట్‌పై IPC సెక్షన్లు 354A, 500, 504, 509, IT చట్టం 67A కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. మీడియా నివేదికల ప్రకారం, రాఖీ, ఫల్గుణి తన అసభ్యకరమైన వీడియోను మీడియా ముందు అనుచిత పదజాలంతో చూపించారని షెర్లిన్ చోప్రా ఆరోపించింది. దీంతో పోలీసులు అత్యాచారం, ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు.

ఈ రోజుల్లో షెర్లిన్ చోప్రా, రాఖీ సావంత్ మధ్య చాలా కాలంగా మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే షెర్లిన్ చోప్రా సినీ నిర్మాత సాజిద్ ఖాన్‌పై లైంగిక వేధింపులు, నేరపూరిత బెదిరింపు ఆరోపణలు చేసింది. గత నెలలో ఈ కేసులో సాజిద్ ఖాన్‌పై ఫిర్యాదు కూడా చేశాడు. సాజిద్ ఖాన్ ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నాడు. అతను షో 16వ సీజన్‌లో కొనసాగుతున్నాడు. బిగ్ బాస్‌లో సాజిద్ ఎంట్రీపై కూడా షెర్లిన్ ప్రశ్నలు లేవనెత్తింది. మీటూ నిందితులు షోలోకి ప్రవేశించకూడదని అన్నారు.

దీని తర్వాత, రాఖీ సావంత్ బహిరంగంగా సాజిద్ ఖాన్‌కు మద్దతు ఇచ్చింది. షెర్లిన్‌పై ఆరోపణలు చేసింది. అప్పటి నుంచి ఇద్దరు నటీమణులు ఒకరిపై ఒకరు తీవ్రంగా మాటల తూటాలు పేలుతున్నాయి. షెర్లిన్ ఒకరిపై లేదా మరొకరిపై తప్పుడు ఆరోపణలు చేస్తూనే ఉందని రాఖీ చెప్పింది. దీని తర్వాత, షెర్లిన్ ప్రతీకారం తీర్చుకుంది. రాఖీ తన బాయ్‌ఫ్రెండ్, భర్తను మార్చిందని ఆరోపించింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ న్యూస్ కోసం