Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmi Gautam: కొత్త యాంకర్‌గా సౌమ్య ఎంట్రీపై స్పందించిన రష్మీ.. మళ్లీ తానే వెళతానంటూ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్

తాజా జబర్దస్త్‌ ఎపిసోడ్‌లో సడెన్‌గా సౌమ్యా రావు యాంకర్‌గా కనిపించింది.​దీంతో జబర్దస్త్‌ నుంచి రష్మీని తీసేశారని రకరకాల పుకార్లు వచ్చాయి. అంతేకాదు ఈ విషయంలో మల్లెమాల సంస్థపై రష్మీ చాలా సీరియస్‌గా ఉందంటూ రూమర్లు వినిపించాయి.

Rashmi Gautam: కొత్త యాంకర్‌గా సౌమ్య ఎంట్రీపై స్పందించిన రష్మీ.. మళ్లీ తానే వెళతానంటూ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్
Rashmi
Follow us
Basha Shek

|

Updated on: Nov 10, 2022 | 11:10 AM

బుల్లితెరపై జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ కామెడీ షోలకి బోలెడు క్రేజ్‌ ఉంది. గతంలో జబర్దస్త్ షోను అనసూయ హోస్ట్‌ చేస్తుండగా, ఎక్స్‌ట్రా జబర్దస్త్‌కి రష్మీ గౌతమ్ యాంకర్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే సినిమాల్లో బిజీ కావడంతో పాటు వ్యక్తిగత కారణాలతో అనసూయ జబర్దస్త్‌ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో అప్పటి నుంచి రెండు షోలకు రష్మీనే యాంకర్‌గా చేస్తూ వస్తోంది. అయితే తాజా జబర్దస్త్‌ ఎపిసోడ్‌లో సడెన్‌గా సౌమ్యా రావు యాంకర్‌గా కనిపించింది.​దీంతో జబర్దస్త్‌ నుంచి రష్మీని తీసేశారని రకరకాల పుకార్లు వచ్చాయి. అంతేకాదు ఈ విషయంలో మల్లెమాల సంస్థపై రష్మీ చాలా సీరియస్‌గా ఉందంటూ రూమర్లు వినిపించాయి. తాజాగా ఈ వార్తలపై స్పష్టత ఇచ్చింది రష్మీ. ఆమె హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం బొమ్మ బ్లాక్‌ బస్టర్‌. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మాట్లాడుతూ సౌమ్య గురించి మల్లెమాల సంస్థ తనకు ముందుగానే చెప్పారని, ఈ విషయంలో ఎలాంటి నెగెటివిటీకి తావు లేదని తెలిపింది.

మళ్లీ ఆ షోకు వెళ్తా..

‘సౌమ్యా రావుపై నాకు ఎలాంటి నెగెటివ్‌ అభిప్రాయాలు లేవు. తను జబర్దస్త్‌కి యాంకర్‌గా రావడాన్ని మనసారా స్వాగతిస్తున్నా. ఆమె వస్తుందని మల్లెమాల వారు ముందుగానే చెప్పారు. అనసూయ జబర్దస్త్ నుంచి వెళ్లిపోవడంతో కొద్ది రోజుల వరకు మాత్రమే నన్ను జబర్దస్త్ షో చేయమని ముందుగానే చెప్పారు. ఆ తర్వాత వేరే యాంకర్ వస్తుందని కూడా చెప్పారు. మల్లెమాల సంస్థ నాకు హోమ్ ప్రొడక్షన్ లాంటిది. ఒకవేళ సౌమ్య వేరే షోస్‌తో బిజీగా ఉండి జబర్దస్త్‌ కు రాకపోయినా మళ్లీ నేనే వెళతాను. హ్యాపీగా షోస్‌ చేసుకుంటాను. సౌమ్య యాంకరింగ్‌ విషయంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మల్లెమాల సంస్థ ఎప్పుడు పిలిచినా నేను రెడీ ‘ అని క్లారిటీ ఇచ్చింది రష్మీ.

ఇవి కూడా చదవండి

కాగా రష్మీ సుధీర్‌తో కలిసి మళ్లీ శ్రీదేవి డ్రామా కంపెనీ షోలోకి అడుగుపెట్టింది. ఇలా బుల్లితెరపై బిజీ ఉంటూనే సినిమాల్లో కూడా నటిస్తోంది. ఇటీవల ఆమె నందుతో కలిసి నటించిన బొమ్మ బ్లాక్‌ బస్టర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిరంజీవి హీరోగా నటిస్తోన్న భోళా శంకర్‌లోనూ ఆమె ఓ కీలక పాత్రలో నటిస్తోంది. మెహర్‌ రమేశ్‌ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా, కీర్తి సురేశ్‌ చిరు చెల్లెలిగా నటిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

కొడుకు ఇక లేడని తెలిసి ఆ తల్లి గుండె ఆగిపోయింది...
కొడుకు ఇక లేడని తెలిసి ఆ తల్లి గుండె ఆగిపోయింది...
నడిరోడ్డుపై.. అన్నకు సవాల్.. దమ్ముంటే తేల్చుకుందాం..
నడిరోడ్డుపై.. అన్నకు సవాల్.. దమ్ముంటే తేల్చుకుందాం..
వెండి పాత్రల్లో ఆహారం తింటే ఏమౌతుందో తెలుసా..?
వెండి పాత్రల్లో ఆహారం తింటే ఏమౌతుందో తెలుసా..?
కోనసీమ స్పెషల్ పనసకాయ బిర్యానీ రెసిపీ మీ కోసం..సింపుల్ అండ్ ఈజీ
కోనసీమ స్పెషల్ పనసకాయ బిర్యానీ రెసిపీ మీ కోసం..సింపుల్ అండ్ ఈజీ
మార్కెట్‌ను షేక్ చేస్తున్న టాప్ ఫోన్స్..కెమెరా విషయంలో తగ్గేదేలే
మార్కెట్‌ను షేక్ చేస్తున్న టాప్ ఫోన్స్..కెమెరా విషయంలో తగ్గేదేలే
మట్టి‌కుండ కొంటున్నారా.. ఈ 6 విషయాలు గుర్తుపెట్టుకోండి..
మట్టి‌కుండ కొంటున్నారా.. ఈ 6 విషయాలు గుర్తుపెట్టుకోండి..
రచ్చ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ ఈ హాట్ బ్యూటీనే..
రచ్చ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ ఈ హాట్ బ్యూటీనే..
ఆ మారుతీ కారుపై బంపర్ ఆఫర్.. ఏకంగా రూ.లక్ష తగ్గింపు
ఆ మారుతీ కారుపై బంపర్ ఆఫర్.. ఏకంగా రూ.లక్ష తగ్గింపు
ట్రంప్‌ న్యూ రూల్..అలాంటి పోస్ట్‌లు పెడితే అమెరికాలోకి నో ఎంట్రీ!
ట్రంప్‌ న్యూ రూల్..అలాంటి పోస్ట్‌లు పెడితే అమెరికాలోకి నో ఎంట్రీ!
భారత రత్న, నిషాన్‌-ఎ-పాకిస్థాన్‌ అందుకున్న ఏకైక వ్యక్తి ఎవరో తెలు
భారత రత్న, నిషాన్‌-ఎ-పాకిస్థాన్‌ అందుకున్న ఏకైక వ్యక్తి ఎవరో తెలు