T20 World Cup: అలా జరిగితే.. ఫైనల్‌లో పాక్ కొంప మునిగినట్లే.. రూల్స్ ఏం చెబుతున్నాయంటే?
తొలి సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి పాకిస్తాన్ ఫైనల్ చేరుకోగా.. రెండో సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్.. టీమిండియాపై అద్భుత విజయాన్ని సాధించిన ఫైనల్ చేరుకుంది.
టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు సర్వం సిద్దమైంది. ఆదివారం(నవంబర్ 13)న మెల్‌బోర్న్ వేదికగా పాకిస్తాన్, ఇంగ్లాండ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. తొలి సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి పాకిస్తాన్ ఫైనల్ చేరుకోగా.. రెండో సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్.. టీమిండియాపై అద్భుత విజయాన్ని సాధించిన ఫైనల్ చేరుకుంది. ఇదిలా ఉంటే.. ఆదివారం జరగబోయే ఫైనల్ మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే.. ఫైనల్‌లో పాక్ కొంప మునిగినట్లే.. 1992 సీన్ రిపీట్ కానట్లేనని ఫ్యాన్స్ అంటున్నారు.
ప్రస్తుతం ఫైనల్ మ్యాచ్ జరిగే మెల్‌బోర్న్‌లో వర్షాలు కురుస్తున్నాయి. స్టేడియం వద్ద కూడా ఆదివారం 95 శాతం వర్షం పడే అవకాశం ఉందని, అలాగే 40 కిమీ వేగంగా ఆ రోజు ఉదయం గాలులు వీస్తాయని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. అటు రిజర్వ్ డే సోమవారం కూడా 95 శాతం మేరకు వాన కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక రిజర్వ్ డే అయిన సోమవారం కూడా వాన పడే అవకాశం 95 శాతం ఉందని పేర్కొంది. దీన్ని బట్టి చూస్తుంటే.. షెడ్యుల్ డే రోజు వర్షం కురిసి ఆట నిలిచిపోతే.. అలాగే రిజర్వ్ డే అనగా సోమవారం కూడా వర్షం పడి కనీసం 10 ఓవర్ల చొప్పున ఆట కూడా సాధ్యం కాకపోతే ఐసీసీ రూల్స్ ప్రకారం.. మ్యాచ్ రద్దు చేసి.. ఇరు జట్లకు ట్రోఫీని అందజేస్తారు.