AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శనివారం రోజు ఈ ఒక్క మొక్కను పూజిస్తే చాలు.. శని దోషాలతో పాటు డబ్బు కష్టాలు తొలగిపోతాయి..!

ఇలా చేయడం వల్ల శనిదేవుని అనుగ్రహం లభిస్తుంది. మీకు అప్పుల నుండి విముక్తి లభిస్తుంది. డబ్బు చేతిలో నిలుస్తుంది.. ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు.

శనివారం రోజు ఈ ఒక్క మొక్కను పూజిస్తే చాలు.. శని దోషాలతో పాటు డబ్బు కష్టాలు తొలగిపోతాయి..!
Shami Plant
Jyothi Gadda
|

Updated on: Nov 12, 2022 | 12:28 PM

Share

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. పూజించదగిన మొక్కలు, చెట్లు కొన్ని ఉన్నాయి. వాటిని పూజించడం వల్ల అనేక గ్రహాల స్థానం బలపడుతుంది. దీనితో పాటు దేవతలు కూడా సంతోషిస్తారు. మీ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు అభివృద్ధిచెందుతుంది. మీ జీవితంలో సంతోషం నిండుతుంది. ఈ మొక్కల్లో శమీ మొక్క ఒకటి. శమీ మొక్కను శని దేవుడి మొక్కగా పరిగణిస్తారు. దీనితో పాటు శివునికి శమీని సమర్పించడం ద్వారా..ఆ పరమేశ్వరుడు త్వరగా ప్రసన్నుడవుతాడు అని నమ్ముతారు. అంతే కాదు శమీ మొక్కను పూజించడం వల్ల జాతకంలో ఉన్న గ్రహ రాశుల స్థితి కూడా బలపడుతుంది. శనివారం నాడు శమీ చెట్టుకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకోండి.

శనివారం నాడు శని దేవుడిని పూజించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. దీనితో పాటు ఈ రోజున శమీ వృక్షానికి నీరుపోసిన పుణ్యఫలం దక్కుతుంది. ఇలా చేయడం వల్ల శనిదేవుని అనుగ్రహం లభిస్తుంది. శమీ వృక్షం శని దేవుడితో పాటు శివునికి సంబంధించినది. కాబట్టి మీరు కావాలంటే శనివారం నాడు ఇంటి దక్షిణ దిశలో ఈ చెట్టును నాటడం శుభప్రదం. ఈ దిశలో ఎక్కువ సూర్యకాంతి లేకపోతే, మీరు దానిని తూర్పు లేదా ఈశాన్య దిశలో ఉంచవచ్చు.

ఆర్థిక స్థితి మెరుగుపడాలంటే శనివారం నాడు శమీ మొక్కను నాటాలి. మీరు దానిని ప్రధాన తలుపు కుడి వైపున కూడా ఉంచవచ్చు. ఇలా చేయడం వల్ల ధనలాభం కలుగుతుంది. శనివారం నాడు శమీ వృక్షాన్ని పూజించాలి. దానితో పాటు ఐదు ఆకులను తీసి శివునికి సమర్పించాలి. ఆ తర్వాత వాటిని మీ పర్సులో ఉంచుకోండి. ఇలా చేయడం వల్ల పర్సులో డబ్బుకు ఎప్పటికీ కొరత ఉండదు అని నమ్మకం. శని దేవుడితో పాటు లక్ష్మీ దేవి అనుగ్రహం పొందడానికి శనివారం శమీ చెట్టు కింద ఆవాల నూనెతో దీపం వెలిగించండి.

ఇవి కూడా చదవండి

అనవసర ఖర్చుల వల్ల ఇబ్బంది పడుతుంటే, శనివారం ఉదయం నిద్రలేచి తలస్నానం చేయండి. దీని తరువాత, శమీ చెట్టు మూలానికి తమలపాకులు, ఒక రూపాయి నాణెం సమర్పించండి. ఇలా చేయడం వల్ల డబ్బు కష్టాల నుంచి కూడా బయటపడతారు. మీరు అప్పుల నుండి విముక్తి పొందాలనుకుంటే శమీ మొక్క వేరు దగ్గర కొద్దిగా నల్లటి మినపప్పు సమర్పించండి. ఇలా చేయడం వల్ల రుణ విముక్తితో పాటు శని అర్ధశతకం నుండి విముక్తి లభిస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి