Astro Tips: మీరు కూడా పిండిని తడిపేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా..? మీ కుటుంబం అనారోగ్యానికి గురికావచ్చు..!

కొందరు చపాతీలను తయారు చేసి హాట్‌బాక్సుల్లో నిల్వచేసుకుంటారు. వంట పని వారి సౌలభ్యం మేరకే జరుగుతుందన్నది నిజం. కానీ శాస్త్రం వీటన్నింటిని అంగీకరించదు. దీని వల్ల గ్రహ దోషం పడుతుందని జ్యోతిశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

Astro Tips: మీరు కూడా పిండిని తడిపేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా..?  మీ కుటుంబం అనారోగ్యానికి గురికావచ్చు..!
Dough
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 12, 2022 | 10:07 AM

చపాతీకి పిండిని పిసుకుతున్నప్పుడు పిండి సరిగ్గా ఉందా..? లేదా అనే చూస్తాము. దాని గురించి లేఖనాలు ఏం చెబుతున్నాయో ఎవరూ పట్టించుకోరు.. శాస్త్రం ప్రకారం పిండివంటలు చేస్తే ఆర్థికాభివృద్ధితో పాటు గౌరవం లభిస్తుందంటారు. ఇకపోతే, రోజుకు ఒక్కసారైనా చపాతీ, రోటీ కావాలని కోరుకునే వారు చాలా మంది ఉంటారు.. కాబట్టి ప్రతిరోజూ వంటగదిలో పిండి కలపడం తప్పనిసరిగా ఉంటునే ఉంటుంది. ఇంట్లో ఇంకా ఎన్నో పనులు లేక ఆఫీస్, ఇళ్లు రెండూ చూసుకోవాల్సిన మహిళలు ఎక్కువ చపాతీ పిండిని తయారు చేసి ఫ్రిజ్ లో పెట్టుకుంటారు. కొందరు చపాతీలను తయారు చేసి హాట్‌బాక్సుల్లో నిల్వచేసుకుంటారు. వంట పని వారి సౌలభ్యం మేరకే జరుగుతుందన్నది నిజం. కానీ శాస్త్రం వీటన్నింటిని అంగీకరించదు. దీని వల్ల గ్రహ దోషం పడుతుందని జ్యోతిశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ప్రతికూల శక్తి ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. పిండి తడపటం విషయంలో పలు కీలక సూచనలు చేస్తున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు..

అవసరానికి తగ్గట్టు పిండి కలపాలి : ఇంతకు ముందు చెప్పినట్లు అవసరానికి మించి పిండి కలపడం చాలా మందికి అలవాటు. శాస్త్రంలో దీన్ని తప్పుగా చెబుతున్నారు. అవసరానికి మించి పిండి కలపడం, ఆ పిండిని ఇంట్లో ఉంచుకోవడం వల్ల నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అలాగే పిండిని వండడానికి కొద్ది సేపటి ముందు పిండి తడుపుకోవాలి. ఒకరోజు ముందుగా తడిపి పెట్టుకుంటే నెగెటివ్ ఎనర్జీ పెరుగుతుంది. మీరు శాస్త్రాన్ని నమ్మకపోవచ్చు, కానీ శాస్త్రం మాత్రమే ఇలాంటివి చెప్పదు. ఆరోగ్యం దృష్ట్యా ఇది మంచిది కాదని వైద్యులు కూడా చెబుతున్నారు.

పిండిని ఫ్రిజ్‌లో ఉంచరాదు.. పిండిని తడిపి ఫ్రిజ్‌లో పెట్టుకునే వారు చాలా ఎక్కువ. చపాతీలు చేసి మిగిలిన పిండిని ఫ్రిజ్‌లో పెట్టుకుంటుంటారు. రెండూ లేఖనాధారంగా తప్పు. ఇది ఇంట్లో పేదరికానికి దారితీస్తుంది. కష్టాలు మొదలవుతాయి.

ఇవి కూడా చదవండి

పిండిపై చేతితో కలపడం: పిండిని పిసికిన తర్వాత మిశ్రమాన్ని ముద్దగా ఉంచడం సరికాదు. దానికి ఇంటి ఆడపిల్లలు లేదా కోడలు చేతులు వేయాలి. ఎందుకంటే ఇంట్లోని లక్ష్మి అంటే కూతురు లేదా కోడలు వేలిముద్ర పిండిపై పడితే ఇంట్లో డబ్బుకు లోటు ఉండదని నమ్ముతారు.

మెత్తగా తడిపిన తర్వాత మూతపెట్టి ఉంచాలి : చపాతీ పిండిని పిసికిన తర్వాత తెరిచి ఉంచకూడదు. దానిని కప్పి ఉంచాలి. తెరిచి ఉంచితే, అక్కడ దుమ్ము దూళి, పురుగులు పడే అవకాశం ఉంది. మూతపెట్టినప్పుడు పిండి సురక్షితంగా ఉంటుంది. శాస్త్రాల ప్రకారం, పిండిని కప్పి ఉంచడం కుటుంబ సభ్యుల గౌరవాన్ని కాపాడుతుంది. వారి గౌరవానికి ఎలాంటి హానీ ఉండదు.

పిండిని కలుపుతున్నప్పుడు ఇది గమనించండి : పిండిని పిసికినప్పుడు ఎల్లప్పుడూ రాగి పాత్రలో నీటిని తీసుకోండి. భగవంతునికి సమర్పించే ఆహారం ఎల్లప్పుడూ స్వచ్ఛంగా ఉండాలి. రాగిని పవిత్రమైన లోహంగా పరిగణిస్తారు. కాబట్టి పిండిని పిసికినప్పుడు రాగి పాత్రలో నీటిని తీసుకోవాలి. ఇది ఆరోగ్యానికి కూడా మంచిది. రాగిలోని నీటిని తాగడం వల్ల అనేక అనారోగ్యాలు నయమవుతాయి.

పిండి కలిపిన తర్వాత మిగిలిన నీళ్లను ఏం చేయాలో తెలుసా? : ఒక పాత్రలో పిండి, మరో గ్లాసులో నీళ్లు తీసుకుని, పిండిలో నీళ్లు పోసి కలపడం ప్రారంభించండి. తగినంత నీరు పోసిన తర్వాత, గ్లాసులో నీరు మిగిలిపోయి ఉంటుంది. ఆ నీటిని పారబోయకుండా మొక్కలకు పోస్తే శ్రేయస్కరం. ఇది ధర్మశాస్త్రాలలో పేర్కొనబడడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కూడా ఒక మంచి పద్ధతి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి