Bus Driver Video: బాలుడితో కలిసి నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకోబోతున్న మహిళ .. ఇంతలో అద్భుతం చేసిన బస్సు డ్రైవర్

వైరల్ క్లిప్‌లో , ఒక మహిళ తన బిడ్డతో కలిసి వంతెనపై నుండి నదిలోకి దూకబోతోంది. కానీ మరుసటి క్షణంలో ఒక అద్భుతం జరిగి ఇద్దరి ప్రాణాలు కాపాడబడ్డాయి.

Bus Driver Video: బాలుడితో కలిసి నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకోబోతున్న మహిళ .. ఇంతలో అద్భుతం చేసిన బస్సు డ్రైవర్
Bus Driver Saves Woman And
Follow us
Surya Kala

|

Updated on: Nov 17, 2022 | 4:24 PM

ప్రస్తుతం సోషల్ మీడియా ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో ఎక్కడ ఏ చిన్న విషయం తెలుగులోకి వచ్చినా వెంటనే అది సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతుంది. తమ నచ్చిన మనసు మెచ్చిన వీడియోలను నెటిజన్లు విపరీతంగా వీక్షిస్తున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న  15-సెకన్ల క్లిప్ కూడా మీ దృష్టిని ఆకర్షించగలదు. ఎందుకంటే ఈ వీడియో ఆత్మహత్యాయత్నానికి సంబంధించినది . వైరల్ క్లిప్‌లో , ఒక మహిళ తన బిడ్డతో కలిసి వంతెనపై నుండి నదిలోకి దూకబోతోంది. కానీ మరుసటి క్షణంలో ఒక అద్భుతం జరిగి ఇద్దరి ప్రాణాలు కాపాడబడ్డాయి. ఒక బస్సు డ్రైవర్, గొప్ప చురుకుదనం చూపిస్తూ, చివరి క్షణంలో మహిళను పట్టుకుని, ఆమెను దూకనివ్వలేదు. ఇప్పుడు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ బస్సు డ్రైవర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.

వైరల్ అవుతున్న క్లిప్‌లో, ఒక మహిళ తన బిడ్డ చేయి పట్టుకుని వంతెనపై నడుస్తున్నట్లు మీరు చూడవచ్చు. అక్కడ కింద నుంచి నది ప్రవహిస్తోంది. ఈ సమయంలో, మహిళ పదేపదే తన ముఖాన్ని తన చేతితో తుడుచుకుంటుంది. ఏదో బాధాకరమైన సంఘటన జరిగినట్లుంది..  బాధతో ఏడుస్తున్నట్టుంది. మహిళ వెనుక బస్సు కూడా వస్తున్నట్లు వీడియోలో చూడవచ్చు. అయితే ఇంతలో మహిళ వంతెనపై నుంచి నదిలోకి దూకబోతుండగా బస్సు డ్రైవర్ వెంటనే తన సీటు బెల్ట్ తీసుకుని తలుపులు తెరిచి ఆమెను పట్టుకున్నాడు. డ్రైవర్ బస్సును ఆపి.. వెంటనే తలుపు తెరచి .. ఆ మహిళ ఆత్మహత్య చేసుకోవడానికి నదిలోకి దూకకుండా మహిళ, బిడ్డను రక్షించాడు. ఇంతలో మరొకరు వచ్చి అతనికి సాయం చేశారు.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి

అయితే ఈ వీడియో చూసిన వారంతా బస్సు డ్రైవర్‌కు ఫ్యాన్‌గా మారారు. నెటిజన్లు అతడిని హీరో అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అదే సమయంలో, కొంతమంది.. ఈ వీడియో కూడా స్క్రిప్ట్‌గా కనిపిస్తుందని… దీని వెనుక ఉన్న  లాజిక్ కూడా చెబుతున్నారు. ఈ వీడియో పాతదే అయినా.. బస్సు డ్రైవర్‌ ఆ మహిళను, చిన్నారి ప్రాణాలను కాపాడిన తీరు చూడాల్సిందే.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి..