AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Python Video Viral: నాతో ఆటా..! నీతో వేట.. యువకుడికి సరికొత్త రీతిలో శిక్ష విధించిన కొండచిలువ.. వీడియో వైరల్

ఆ యువకుడు తన తలపై ఉన్న టోపీని తీసుకుని కొండచిలువ నోటిఫై కొట్టిన వెంటనే, అది  కోపంతో నోరు తెరచింది. అయితే ఆ యువకుడు భయపడకుండా దానిని ఇబ్బంది పెట్టడం ఆపలేదు. ఆడుకుంటూనే ఉన్నాడు.

Python Video Viral: నాతో ఆటా..! నీతో వేట.. యువకుడికి సరికొత్త రీతిలో శిక్ష విధించిన కొండచిలువ.. వీడియో వైరల్
Young Man Plays With Python
Surya Kala
|

Updated on: Nov 14, 2022 | 10:57 AM

Share

పాము అంటేనే చాలు మనిషి వీలైనంత దూరం పరిగెడతాడు. అది విషయం గల పామైనా, విషం లేని పాము అయినా సరే పాముకి దూరంగా ఉండాలని భావిస్తాడు. మన సనాతన ధర్మంలో పామును దేవతగా భావించి పూజిస్తారు. అదే సమయంలో తమ కంట పాము కనిపించకుండా చూడమని కోరుకుంటారు. విషం గల పాము కాటు వేస్తే మనిషి మాత్రమే కాదు. ఎంతటి భారీ జంతువు అయినా సరే మరణిస్తుంది. అందుకనే పాములకు మానవులే కాదు, అత్యంత క్రూరమైన జంతువులు కూడా దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తాయి. అయితే కొందమంది మాత్రం పాములంటే అసలు భయపడరు.. వాటిని చాకచక్యంగా పట్టుకుని అడవుల్లో సురక్షితంగా విడిచిపెడతారు కూడా.. మరికొందరు ఎదో కుక్కపిల్లనో, పిల్లి పిల్లనో పెంచుకున్నట్లు పాములను పెంచుకునేవారు కూడా ఉన్నారు. అయితే పాము స్వభారీత్యా దానితో స్నేహం ఎప్పుడూ మనిషిప్రాణాలకు ప్రమాదమే అని అంటారు. అయితే ఒక యువకుడు అత్యంత ప్రమాదకమైన కొండచిలువతో ఆటలాడుతున్నాడు. అయితే ఆ పాముకి కోపం వచ్చి యువకుడికి తగిన శిక్ష విధించింది.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వీడియోలో ఒక యువకుడు కొండచిలువను చేతితో పట్టుకుని ఉన్నాడు.. ఆ కొండచిలువ మెడకు చుట్టుకుని కనిపిస్తుంది. పాము కూడా చాలా పొడవుగా,  ప్రమాదకరంగా కనిపిస్తుంది. కానీ ఈ బాలుడు దానితో నిర్భయంగా ఆడుకుంటున్నాడు. ఆ వ్యక్తి చేసిన ఈ పనినితో కొండచిలువ చాలా కోపం వచ్చినట్లుంది.  అతనిపై దాడి చేయకుండా.. తన శరీరాన్ని అతని మెడకు బిగిస్తూ.. ఉక్కిరిబిక్కిరి చేసింది. కొండచిలువ ఆ యువకుడికి విచించిన శిక్షను చూస్తే..  అతను తన జీవితాంతం గుర్తుంచుకుంటాడని వ్యాఖ్యానించక మానరు ఎవరైనా.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న వీడియోలో ఒక యువకుడు కొండచిలువను మెడకు చుట్టుకుని ఆడుకుంటున్నట్లు చూడవచ్చు. అదే సమయంలో.. కొండచిలువ కూడా వ్యక్తిని గొంతు నులిమి చంపడానికి  ప్రయత్నిస్తూ కనిపిస్తుంది.. ఆ యువకుడు తన తలపై ఉన్న టోపీని తీసుకుని కొండచిలువ నోటిఫై కొట్టిన వెంటనే, అది  కోపంతో నోరు తెరచింది. అయితే ఆ యువకుడు భయపడకుండా దానిని ఇబ్బంది పెట్టడం ఆపలేదు. ఆడుకుంటూనే ఉన్నాడు. దీంతో కొండచిలువ ఆ యువకుడి గొంతు పిసికి చంపడానికి ప్రయత్నిస్తుంది. కొండచిలువ ఉరివేసినట్లు గొంతుని బిగించడంతో ఆ వ్యక్తి ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడినట్లు ఈ వీడియోలో కనిపిస్తోంది.

ఈ వీడియోను నిక్‌థ్యూరాంగ్లర్ అనే ఖాతా ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఎనిమిది వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేయగా, లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. ఇది పిచ్చికి పరాకాష్ట . పైథాన్‌కు ఎలా బిగించాలో తెలుసు.. అదే చేసింది. అదే సమయంలో యువకుడు కొండచిలువను అలా  చేయడం వల్ల ఏం లాభం అని మరో యూజర్ ఆశ్చర్యంగా ప్రశ్నించారు. ఎందుకు ఇలా చేస్తున్నావ్ అన్నయ్యా? అని కొందరు కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..