AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weird News: బాబా కలలో చెప్పాడు.. ఇప్పుడు నా కడుపున కుక్కరూపంలో పుట్టాడంటున్న 65 ఏళ్ల బామ్మ.. షాకింగ్ వీడియో వైరల్

బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్లు కలియుగంలో జరుగుతున్నాయి వ్యాఖ్యానించేవారు కూడా ఉన్నారు.. అయితే తాజాగా మరో వింత సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఇందులో ఓ 65 బామ్మ తాను  తాను కుక్కకు జన్మనిచ్చినట్లు పేర్కొంది.

Weird News: బాబా కలలో చెప్పాడు.. ఇప్పుడు నా కడుపున కుక్కరూపంలో పుట్టాడంటున్న 65 ఏళ్ల బామ్మ.. షాకింగ్ వీడియో వైరల్
Up Badaun Woman
Surya Kala
|

Updated on: Nov 14, 2022 | 9:32 AM

Share

ప్రపంచంలో నమ్మడానికి చాలా కష్టమైన అనేక వింత సంఘటలు తరచుగా తెరపైకి వస్తూనే ఉన్నాయి. కొన్ని సార్లు అటువంటి వింతలకు సంబంధించిన వార్తలను వింటే షాక్ తింటారం.. అది నిజంగా నిజమేనా అని ఆలోచిస్తాం కూడా.. భూమి కుంగి కాళ్ళు అందుకో కురుకుపోతున్నాయా అనే ఫీలింగ్ కూడా వస్తుంది ఒకొక్కసారి. అవును సాధారణంగా మహిళ.. మనిషికి జన్మనిస్తుంది. అయితే అప్పుడప్పుడు నాలుగు చేతులు, రెండు తలలు వంటి వింత శిశువులు జన్మిస్తారు. అయితే అప్పుడప్పుడు.. ఆవు కడుపునా పంది పిల్ల, కుక్క కడుపున పంది పుట్టడం వంటి వింత సంఘటనలు గురించి తరచుగా వింటున్నాం.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు చూసి.. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్లు కలియుగంలో జరుగుతున్నాయి వ్యాఖ్యానించేవారు కూడా ఉన్నారు.. అయితే తాజాగా మరో వింత సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఇందులో ఓ 65 బామ్మ తాను  తాను కుక్కకు జన్మనిచ్చినట్లు పేర్కొంది.

యూపీలోని బదౌన్ నుంచి ఈ ఆశ్చర్యకరమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. స్థానికంగా నివసిస్తున్న 65 ఏళ్ల వృద్ధురాలు కుక్కపిల్లకు జన్మనిచ్చానంటూ చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మీడియా నివేదికల ప్రకారం..  కుక్క పుట్టకముందే, భైరవ్ బాబా తన కలలో కనిపించాడని.. అతను తన గర్భం నుంచి కుక్కగా పుడతాడని చెప్పినట్లు ఆ మహిళ పేర్కొంది.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి

ఆ మహిళకు ఇప్పటికే ముగ్గురు కుమార్తెలు ఉన్నారని, వారందరికీ వివాహాలు అయ్యాయని చెబుతున్నారు. తన కడుపులో 17 ఏళ్ల పిండం ఉందని.. తాను నిద్రపోతున్నప్పుడు భైరవ్ బాబా తన కలలోకి వచ్చేవాడని.. ఒకరోజు తనగర్భం నుంచి తాను కుక్కపిల్లగా పుడతానని భైరవ్ బాబా చెప్పాడని వృద్ధురాలు చెబుతోంది. నవంబరు 7న ఈ బామ్మ కుక్కపిల్లకు జన్మనిచ్చిందని ఆమె భర్త పేర్కొన్నారు.

ఓ మహిళ కడుపులో నుంచి కుక్కపిల్ల పుట్టడం చూసి సామాన్యులే కాదు.. పశువైద్యులు సైతం ఆశ్చర్యపోతున్నారు. దీని తర్వాత, మహిళ ఇంటి వద్ద జనం గుమిగూడారు. ఈ వింత వాదన స్తానికంగా చక్కర్లు కొట్టడంతో వింత చూడడానికి మహిళ ఇంటి వద్ద బారులు తీరారు. అయితే ఇదంతా మూఢనమ్మకం అని వైద్యులు చెబుతున్నారు. మహిళ చెబుతున్న విషయంలో ఎంత నిజం ఉందో తేల్చడానికి ప్రభుత్వ అధికారాలు రంగంలోకి దిగారు. పరిపాలనాపరమైన విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇందులో ఓ కుక్క పిల్ల మహిళ ఒడిలో కూర్చున్నట్లు కనిపిస్తుంది.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..