Girl Driving Video: తగ్గేదే లే.. ఆగి ఉన్న బైక్ ని ఢీ కొట్టి అడ్డంగా దెబ్బలాడిన అమ్మాయి.. ఫన్నీ వీడియో వైరల్

ఓ యువతి డ్రైవింగ్ కు సంబంధించిన వీడియో కూడా అటువంటిదే..  ఓ యువతి స్కూటీ డ్రైవింగ్ సరిగ్గా నేర్చుకోకుండా.. స్కూటీని రోడ్డుపైకి తెచ్చి, సమీపంలో ఆగి ఉన్న బైక్‌ను ఢీకొట్టింది.

Girl Driving Video: తగ్గేదే లే.. ఆగి ఉన్న బైక్ ని ఢీ కొట్టి అడ్డంగా దెబ్బలాడిన అమ్మాయి.. ఫన్నీ వీడియో వైరల్
Girl Driving Funny Video
Follow us
Surya Kala

|

Updated on: Nov 14, 2022 | 8:40 AM

రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. చాలాసార్లు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు చూస్తే ఆశర్యం కలిగితే.. అదే సమయంలో అటువంటి ప్రమాద ఘటనలను చూసి భయంతో చెమటలు పడతాయి. అయితే కొన్ని సార్లు రోడ్డు ప్రమాదంకి చెందిన వీడియోలు చూస్తే పడి పడి నవ్వుకుంటాం.. కొన్ని ప్రమాదం జరిగిన వెంటనే ఇతరులను నిందిస్తూ ఉంటారు. తప్పు అవతలివారిది కాకపోయినా.. వెంటనే నోటికి పని చెబుతారు. ఓ యువతి స్కూటీని డ్రైవ్ చేస్తూ.. రోడ్డు పక్కన ఆగి ఉన్న బైక్‌ను ఢీకొట్టిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

మీరు రోడ్డుపై వివిధ రకాల డ్రైవర్ల.. చూస్తూ ఉంటాం. చాలా మంది వ్యక్తులు ప్రొఫెషనల్ డ్రైవర్లు అయితే.. మరొకొందరు కారు లేదా స్కూటీని ఎలా నడపాలో తెలియని వారు. అయితే  డ్రైవింగ్ రాకున్నా తమ వాహనాన్ని రోడ్డుపైకి తీసుకువస్తారు. రోడ్డుమీద అడ్డదిడ్డంగా డ్రైవ్ చేస్తూ.. ఇతరులను ఇబ్బందులకు గురి చేస్తారు. అటువంటి వారిని ఫన్నీ జోక్స్ కామెంట్ చేస్తూ ఉంటారు కూడా.. తాజాగా ఓ యువతి డ్రైవింగ్ కు సంబంధించిన వీడియో కూడా అటువంటిదే..  ఓ యువతి స్కూటీ డ్రైవింగ్ సరిగ్గా నేర్చుకోకుండా.. స్కూటీని రోడ్డుపైకి తెచ్చి, సమీపంలో ఆగి ఉన్న బైక్‌ను ఢీకొట్టింది.

ఇవి కూడా చదవండి

రోడ్డు పక్కన కుర్రాళ్ల గుంపు కూర్చుని ఉండటాన్ని వీడియోలో చూడవచ్చు. ఇంతలో అక్కడికి ఓ అమ్మాయి స్కూటీతో వచ్చి రోడ్డు పక్కన ఆగి ఉన్న ఓ యువకుడి బైక్ ను ఢీకొట్టింది. అయితే ఈ యాక్సిడెంట్ లో అసలు ఆ అబ్బాయి తప్పు లేదు. దీంతో ఆ యువకుడు యువతికి క్షమాపణ చెప్పాల్సింది పోయి.. తిరిగి అమ్మాయికి కోపం వస్తుంది. ఆ అమ్మాయి అబ్బాయిని చూసి, ‘చూసి డ్రైవింగ్ చేయలేవా.. నువ్వు గుడ్డివాడివా అంటూ నోటికి పని చెప్పింది. అమ్మాయి ఈ కోపాన్ని చూసిన జనాలు చాలా ఆశ్చర్యపోతున్నారు.

తగ్గేదే లే..

Instagramలో videonation.teb అనే ఖాతా ద్వారా ఈ వీడియో షేర్ చేశారు. వేలాది మందికి ఈ వీడియో నచ్చింది. వీడియోపై ఫన్నీ  కామెంట్స్ ను చేస్తున్నారు. ఒకరు ఇందులో ‘అతిపెద్ద తప్పు వారి చేతుల్లో స్కూటీని ఇచ్చే వారిది.’ అని అంటే.. మరోకరు ‘తప్పు చేసినప్పటికీ, ఈ అమ్మాయిలకు ఇంత విశ్వాసం ఎక్కడ నుండి వస్తుంది, నాకు అర్థం కాలేదని అంటే.. ఇంకొకరు  ‘అన్న, సార్, ఈ అమ్మాయి ఎవరు, ఎక్కడ నుండి వచ్చింది అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..