AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Driving Video: స్కూటీని ఇలా కూడా ఆపొచ్చని మీకు తెలుసా..! దేశీ స్టైల్ నుండి స్కూటీని ఆపాలనుకున్న మహిళ.. కట్ చేస్తే..

వైరల్ అవుతున్న వీడియోలో, రోడ్డుపై ఒక అమ్మాయి స్కూటీ నడుపుతున్నట్లు మీరు చూడవచ్చు. అయితే ఈ సమయంలో ఆమె కాళ్లు స్కూటీకి కిందకు  వేలాడుతున్నాయి. ఆ యువతి డ్రైవింగ్ చూస్తుంటే.. స్కూటీ హ్యాండ్ బ్రేక్ గురించి అస్సలు తెలియదని..

Driving Video: స్కూటీని ఇలా కూడా ఆపొచ్చని మీకు తెలుసా..!  దేశీ స్టైల్ నుండి స్కూటీని ఆపాలనుకున్న మహిళ.. కట్ చేస్తే..
Woman Driving Video
Surya Kala
|

Updated on: Nov 12, 2022 | 10:17 AM

Share

రోడ్డుపై వివిధ రకాలుగా డ్రైవింగ్ చేసేవారిని చూస్తూనే ఉన్నాం.. చాలా మంది తమ వాహనాలను డ్రైవ్ చేసే సమయంలో తమ ప్రాణాలను, కారుని కాపాడుకుంటూ డ్రైవ్ చేస్తారు. మరికొందరు సంతోషం కోసం ర్యాష్ డ్రైవింగ్ కూడా చేస్తుంటారు. వీటన్నింటికీ మించి తమ ప్రాణాలనే కాదు.. ఇతరుల ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రోడ్డుపై వాహనాలు నడిపే డ్రైవర్లు కూడా ఉన్నారు. ఇలాంటి వారి చూసి.. ఏమిటి తన ప్రాణం అంటే లెక్కలేదు.. కనీసం ఇతరుల ప్రాణాలకైనా విలువ ఇవ్వాలి కదా అంటూ వ్యాఖ్యానిస్తారు. తాజాగా ఓ మహిళా బైక్ నడుపుతోన్న వీడియో నెట్టింట్లో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. అందులో ఓ మహిళ డ్రైవింగ్ చేస్తూ.. చేసిన తప్పుతో కారును ఢీకొట్టినట్లు తెలుస్తోంది.

వాస్తవానికి రోడ్డుపై రోజూ వేల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలా ప్రమాదాలు .. మనుషుల అవయవాలను, ప్రాణాలను కోల్పోయినట్లు చేస్తే.. మరికొన్ని సంఘటనలు నవ్వు తెప్పిస్తాయి. ఇప్పుడు బయటపడిన ఈ వీడియోలో చూడండి.. ఒక యువతి తన పాదాలను రోడ్డుపై ఈడ్చుతూ వెళ్తోంది. అలా కాళ్ళను రోడ్డుమీద పెట్టి.. తన స్కూటీ నడుపుతోంది. అలా ఆ యువతి నాలుగు రోడ్ల కూడలికి చేరుకోగానే.. కారు వచ్చింది. దీంతో కారుని ఢీ కొట్టకుంటా తన స్కూటీని ఆపడానికి ఆమె బ్రేక్‌లకు బదులుగా తన పాదాలను ఉపయోగించింది. తన పాదాలతో స్కూటీని ఆపడానికి ప్రయత్నిస్తుంది. అప్పడు స్కూటీ అదుపులోకి రాకపోవడంతో ప్రమాదం కూడాజరిగింది.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి:

View this post on Instagram

A post shared by Asif Khan (@mr.khansab06)

వైరల్ అవుతున్న వీడియోలో, రోడ్డుపై ఒక అమ్మాయి స్కూటీ నడుపుతున్నట్లు మీరు చూడవచ్చు. అయితే ఈ సమయంలో ఆమె కాళ్లు స్కూటీకి కిందకు  వేలాడుతున్నాయి. ఆ యువతి డ్రైవింగ్ చూస్తుంటే.. స్కూటీ హ్యాండ్ బ్రేక్ గురించి అస్సలు తెలియదని.. అందుకే స్కూటీని కాళ్లతో ఆపివేయాలని ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ యువతి స్కూటీ నాలుగు రోడ్ల జంక్షన్ దగ్గరకు రాగానే అటు గా వస్తున్న కారుని స్కూటీతో ఢీ కొట్టింది. వెనుక నుంచి బైక్‌పై వెళ్తున్న కొందరు కుర్రాళ్లు ఈ వీడియోను రికార్డ్ చేయడంతో ఇప్పుడు వైరల్‌గా మారింది.

వీడియో క్లిప్‌ను mr.khansab06 అనే ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారు షేర్ చేశారు. కోటి మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. ‘పాప దేవదూత నేలపై పడింది..’ అని కామెంట్ చేయగా.. ఈ యువతి చాలా బాధ్యతారహితంగా స్కూటీని నడుపుతోందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..