AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anand Mahindra: టీమిండియా ఓటమిని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారా? అయితే ఈ వీడియో చూడండి..

భారత్ క్రికెట్ జట్టు ఓటమితో నిరాశావాదంలోకి కూరుకుపోయిన ఫ్యాన్స్  తమ ఫీలింగ్స్  ను వ్యక్తం  చేయడానికి సోషల్ మీడియాను ఎంచుకున్నారు. అలాంటి వారిలో పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఒకరు. మనదేశం ఓడిపోవడం బాధించే విషయం కాదు.. అయితే ఓడిపోయిన విధానం బాధిస్తుందని పేర్కొన్నారు.

Anand Mahindra: టీమిండియా ఓటమిని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారా? అయితే ఈ వీడియో చూడండి..
Anand Mahindra
Surya Kala
|

Updated on: Nov 11, 2022 | 12:22 PM

Share

భారత క్రికెట్ మ్యాచ్ అంటే కోట్లాదిమంది క్రికెట్ ప్రేమికులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. కోట్లాది క్రికెట్ ప్రేమికుల ఆశను నిరాశ చేస్తూ..   T20 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్ లో భారత్ క్రికెట్ జట్టు ఘోర పరాజయం పాలైంది. మన దేశం ఓటమి పాలవడం మిలియన్ల మంది అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. హృదయ విదారకంగా  విలపించిన క్రికెట్ ప్రేమికులు కూడా ఉన్నారంటే అతిశయోక్తికాదు. ఓటమితో నిరాశావాదంలోకి కూరుకుపోయిన ఫ్యాన్స్  తమ ఫీలింగ్స్  ను వ్యక్తం  చేయడానికి సోషల్ మీడియాను ఎంచుకున్నారు. అలాంటి వారిలో పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఒకరు. మనదేశం ఓడిపోవడం బాధించే విషయం కాదు.. అయితే ఓడిపోయిన విధానం బాధిస్తుందని పేర్కొన్నారు.

అయితే ఇలా తాను ట్వీట్ చేసిన వెంటనే తనకు ఓదార్పు దొరికిందని చెప్పారు ఆనంద్ మహీంద్రా.  ఈ వీడియోను ఒక స్నేహితుడు తనకు పంపినట్లు పేర్కొన్నారు. ఈ వీడియో న్యూయార్క్‌లోని ఒక క్యాబ్ డ్రైవర్ మాట్లాడుతున్నాడు. ఆ డ్రైవర్ మన దేశం ఒక బ్రాండ్ లా ఎలా రూపాంతరం చెందుతుంది.. రోజు రోజుకీ భారత దేశం ఒక బ్రాండ్ గా మారి ప్రపంచ వ్యాప్తంగా ఎలా విస్తరిస్తుందో చెప్పాడు.  ప్రపంచాన్ని నడుపుతున్న భారతీయులందరికీ” అంటూ ఆ డ్రైవర్ భారతీయులు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.  ప్రపంచవ్యాప్తంగా కార్యనిర్వాహక, రాజకీయ పదవులను ఆక్రమిస్తున్న భారతీయుల గురించి స్పష్టమైన సూచన చేశారు. ఇది తనకు (టీ20 ప్రపంచకప్‌ను ‘రూల్’ చేయక పోయినా ఈ వీడియో తనకు కొంత ఓదార్పునిచ్చిందని ఆనంద్ మహీంద్రా వీడియోకి క్యాప్షన్ జత చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది.

ఇవి కూడా చదవండి

న్యూయార్క్‌లోని ఒక క్యాబ్ డ్రైవర్ మాటల్లో భారత్ గొప్పదనం:

ఇంగ్లండ్‌ నిర్ధేశించిన స్కోర్ ను భారత్ ఛేదించడంలో ఆది నుంచి తడబడుతూనే ఉంది. ఇంగ్లండ్‌ అన్ని విభాగాల్లో భారత్‌ కంటే మెరుగైన ప్రదర్శన కనబరిచిందని కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మ్యాచ్‌ అనంతరం విలేకరుల సమావేశంలో తెలిపారు. సెమీ ఫైనల్ లో భారత్ గెలవకపోయినా ఈ టోర్నీలో భారత్ జట్టు అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిందని..  ఐదు మ్యాచ్‌లలో నాలుగు గెలిచి గ్రూప్ 2లో అగ్రస్థానంలో నిలిచిందని ద్రావిడ్ చెప్పారు. టీ20 ప్రపంచకప్‌ టైటిల్ కోసం ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో ఇంగ్లాడ్ తలపడనుంది.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..