టెట్ హాల్ టికెట్ పై సన్నీ లియోన్ ఫొటో !! అభ్యర్థి షాక్ !!
కర్ణాటకలో నవంబర్ 6న జరిగిన టెట్ పరీక్ష సందర్భంగా వింత ఘటన చోటుచేసుకుంది. పరీక్ష రాసేందుకు వచ్చిన ఓ అభ్యర్థిని హాల్ టికెట్ చూసి అధికారులు అవాక్కయ్యారు.
కర్ణాటకలో నవంబర్ 6న జరిగిన టెట్ పరీక్ష సందర్భంగా వింత ఘటన చోటుచేసుకుంది. పరీక్ష రాసేందుకు వచ్చిన ఓ అభ్యర్థిని హాల్ టికెట్ చూసి అధికారులు అవాక్కయ్యారు. ఆపై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు అభ్యర్థిని హాల్ టికెట్ పై బాలీవుడ్ నటి సన్నీలియోన్ ఫొటో ఉండడమే ఇందుకు కారణం. దీంతో సీరియస్ అయిన విద్యాశాఖ విచారణకు ఆదేశించింది. కర్ణాటక టీచర్ ఎలిజిబిలిటి టెస్ట్ టెట్ 2022కు రాష్ట్రవ్యాప్తంగా పలు కేంద్రాల్లో అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. శివమొగ్గలోని రుద్రప్ప కాలేజీలో పరీక్ష రాసేందుకు వచ్చిన ఓ అభ్యర్థిని హాల్ టికెట్ పై ఇన్విజిలేటర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ హాల్ టికెట్‌లో అభ్యర్థి ఫొటో ఉండాల్సిన చోట సన్నీలియోన్ ఫొటో ఉండడంతో లోపలికి అనుమతించలేదు. కాలేజ్ ప్రిన్సిపాల్ ను కలిసి విజ్ఞప్తి చేయడంతో పరీక్షకు అనుమతించారు. హాల్ టికెట్ పై సన్నీలియోన్ ఫొటో వ్యవహారంపై రుద్రప్ప కాలేజీ ప్రిన్సిపాల్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అధికారుల విచారణంలో యువతి ఆన్‌లైన్‌లో దరఖాస్తును పూర్తి చేయలేదని ఇతరుల చేత దరఖాస్తు చేయించినట్లు గుర్తించారు. అభ్యర్థి నేరుగా అప్లై చేసుకోవాలి కాబట్టి విద్యాశాఖ పాత్ర ఉండదని తేల్చి చెప్పింది. ఈ ఘటనపై సత్వరమే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా పబ్లిక్ ఇన్‌స్ట్రక్షన్ డిపార్ట్‌మెంట్ పోలీసులను కోరింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
19 ఏళ్ల నాటి రికార్డును తిరగరాసిన 50 ఏళ్ల మహిళ !!
కారులో వచ్చి కరెంట్ బల్బుల చోరి.. ఇది పెద్ద స్కెచ్చే !!
కొట్టేశా.. అని ఆనందంతో పరిగెత్తి… బొక్క బోర్లాపడ్డ దొంగ !! చివరికి ఏమైందంటే ??
‘మా అమ్మా సమంత’.. మనోడి మాటలు వింటే నవ్వలేక చస్తారు !!
Samantha: సినిమా హిట్ టాక్ రావడంతో.. సమంత భావోద్వేగ పోస్ట్..
రూ. 60 వేల విలువైన కెమెరా ఆర్డర్ పెడితే.. ఆన్లైన్ మోసం..
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డ్రైవర్ టెస్ట్, దాని ప్రయోజనాలు
18 లక్షల సార్లు స్కిప్పింగ్ చేస్తాడా ?? నెట్టింట జోరుగా చర్చ
పండ్లపై ఎలుకల మందు పూసి అమ్ముతున్న వ్యాపారులు
ఫ్రెంచ్ అబ్బాయి..యానాం అమ్మాయి పెళ్లి.. గుర్రపు బండిపై ఊరేగుతూ..
అర్ధరాత్రి టపాసుల మోత.. హడలెత్తిపోతున్న జనం
నెరవేరిన కల.. అంతలోనే చిదిమేసిన మృత్యువు..

