కారులో వచ్చి కరెంట్ బల్బుల చోరి.. ఇది పెద్ద స్కెచ్చే !!
దొంగతనం చేసేందుకు చోరశిఖామణులు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. తమ బుద్ధికి పదును పెడుతున్నారు. దర్జాగా వచ్చి దోచుకెళ్తున్నారు. ఎవరి కంట పడకుండా, దొంగతనం చేయాలని నిర్ణయించుకుంది ఓ దొంగ ముఠా.
దొంగతనం చేసేందుకు చోరశిఖామణులు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. తమ బుద్ధికి పదును పెడుతున్నారు. దర్జాగా వచ్చి దోచుకెళ్తున్నారు. ఎవరి కంట పడకుండా, దొంగతనం చేయాలని నిర్ణయించుకుంది ఓ దొంగ ముఠా. ఈ నేపథ్యంలోనే రాజస్థాన్ లో దొంగలు కరెంట్ బల్బులను ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత చీకటి పడటంతో దొంగతనం చేసేందుకు సులువుగా ఉంటుందనుకున్నారు. ఫ్లాన్ వర్కట్ కాకపోవడంతో పారిపోయారు. నవాల్ గర్హ్ పోలీసు స్టేషన్ పరిధిలోని కోల్సియా గ్రామంలోకి అర్ధరాత్రి సమయంలో మారుతి ఆల్టో కారులో వచ్చారు దొంగలు. అయితే అక్కడంత కరెంట్ బల్బులతో వెలుతురుగా ఉండటంతో మెదడుకు పదును పెట్టారు. ఓ షాపు వద్ద కారును ఆపి అక్కడున్న బల్బును దొంగిలించాలనుకున్నారు. కానీ సాధ్యం కాలేదు. మరో షాపు వద్దకు వచ్చి కుర్చీ సాయంతో.. కరెంట్ బల్బును దొంగిలించారు. అనంతరం దుకాణం దోపిడీకి యత్నించారు. అయితే దొంగలు షట్టర్‌ను తెరిచేందుకు ప్రయత్నిస్తుండగా.. ఓ దుకాణదారుడికి మెలకువ వచ్చింది. ఆ షాపు యజమానిని గమనించిన దొంగలు అక్కడ్నుంచి పలాయనం చిత్తగించారు. అయితే షాపుల ముందు ఉన్న బల్బులను దొంగిలించి, చీకట్లో దోపిడీ చేసేందుకు దొంగలు ప్లాన్ చేసి ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కొట్టేశా.. అని ఆనందంతో పరిగెత్తి… బొక్క బోర్లాపడ్డ దొంగ !! చివరికి ఏమైందంటే ??
‘మా అమ్మా సమంత’.. మనోడి మాటలు వింటే నవ్వలేక చస్తారు !!
Samantha: సినిమా హిట్ టాక్ రావడంతో.. సమంత భావోద్వేగ పోస్ట్..
Allu Arjun: బన్నీ చేసిన సాయానికి మలయాళీలు ఫిదా..
Digital TOP 9 NEWS: దివ్యాంగురాలైన కుమార్తెకు శ్రీకృష్ణుడితో పెళ్లి !! | బిచ్చగాడైన బిలియనీర్ !!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

