Allu Arjun: బన్నీ చేసిన సాయానికి మలయాళీలు ఫిదా..
కుడి చేత్తో చేసిన సాయం ఎడమ చేతికి తెలియకూడదని మన పెద్దలు అంటారు. అయితే ఇప్పుడిదే సేయింగ్ ను తూచా తప్పకుండా పాటించారు మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.
కుడి చేత్తో చేసిన సాయం ఎడమ చేతికి తెలియకూడదని మన పెద్దలు అంటారు. అయితే ఇప్పుడిదే సేయింగ్ ను తూచా తప్పకుండా పాటించారు మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఓ కేరళ అమ్మాయి చదువు కోసం తాను చేసిన సాయాన్ని ఎవరికీ తెలియకూడదని అనుకున్నారు. కాని ఆ విషయం ఆ జిల్లా కలెక్టర్ త్రూ బయటికి రావడంతో.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. సేవాగుణంలోనూ స్టారే అని నెట్టింట అనిపించుకుంటున్నారు. కేరళలో ఒక పేద విద్యార్థిని మీద అల్లు అర్జున్ చూపిన సేవాగుణం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. 92 శాతం మార్కులొచ్చినా పై చదువులు చదవలేక ఇబ్బంది పడుతున్న ఒక మలయాళీ అమ్మాయిని ఆదుకున్నారు బన్నీ. ఆమె రిక్వెస్టు విన్న వెంటనే అలెప్పీ కలెక్టర్ కృష్ణతేజ… అల్లు అర్జున్‌కి ఫోన్ చేసి ఆయన దృష్టికి తీసుకెళ్లారు. నర్సింగ్ కాలేజ్‌లో మేనేజ్‌మెంట్ కోటాలో సీటుకయ్యే ఖర్చు తాను భరిస్తానంటూ బన్నీ మాటిచ్చారు. సాయం అందుకున్న ఆ అమ్మాయి గురించిన వివరాల్ని కూడా గోప్యంగా ఉంచారు. కనీసం అమ్మాయి ఫోటోను కూడా బైటపెట్టలేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Digital TOP 9 NEWS: దివ్యాంగురాలైన కుమార్తెకు శ్రీకృష్ణుడితో పెళ్లి !! | బిచ్చగాడైన బిలియనీర్ !!
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

