19 ఏళ్ల నాటి రికార్డును తిరగరాసిన 50 ఏళ్ల మహిళ !!
లిండా పాట్గియేటర్ అనే మహిళ కేవలం 59 నిమిషాల్లో 23 బంగీ జంప్స్ పూర్తి చేసి గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. 19 ఏళ్ల క్రితం దక్షిణాఫ్రికా మహిళ పేరిట ఉన్న రికార్డును ఆమె బద్దలుకొట్టారు.
లిండా పాట్గియేటర్ అనే మహిళ కేవలం 59 నిమిషాల్లో 23 బంగీ జంప్స్ పూర్తి చేసి గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. 19 ఏళ్ల క్రితం దక్షిణాఫ్రికా మహిళ పేరిట ఉన్న రికార్డును ఆమె బద్దలుకొట్టారు. గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించాలంటే అంత సులువు కాదు.. ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. అది కూడా ఓ సాహస క్రీడలో 50 ఏళ్ల ఓ మహిళ నెలకొల్పారంటే అద్భుతమే కదా. ఇంగ్లాండ్‌కు చెందిన లిండా పాట్గియేటర్ అనే యాభై ఏళ్ల మహిళ కేవలం 59 నిమిషాల్లో 23 ‘బంగీజంప్స్’ పూర్తి చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. 19 ఏళ్ల కిత్రం దక్షిణాఫ్రికా మహిళ వెరోనికా పేరిట ఉన్న రికార్డును తిరగరాశారు. వెరోనికా గంటలో 19 బంగీ జంప్స్ చేసి చరిత్ర సృష్టించారు. అయితే తాజాగా దక్షిణాఫ్రికాలోని బ్లౌక్రన్స్ వంతెన ఈ అరుదైన ఘట్టానికి వేదికైంది. బ్లౌక్రన్ నదిపై 216 మీటర్ల ఎత్తులో ఈ వంతెనను నిర్మించారు. దక్షిణాఫ్రికాలో అత్యంత ఎత్తయిన వంతెన ఇదేనట. పాట్గియేటర్ ఈ రికార్డు నెలకొల్పడం అంత సులువుగా జరగలేదు. దీని కోసం ఆమె కఠోర సాధన చేశారు. ఎయుజీన్ ఎలాఫ్ అనే ట్రైనర్ వద్ద మెలకువలు నేర్చుకున్నారు. 50 ఏళ్ల వయస్సులో ఇలాంటి సాహసాలు చేయడానికి.. ఆమె పూర్తి స్థాయిలో తర్ఫీదు పొందారు. కాగా, ఈ ఘనత సాధించడానికి తనకు సహకరించిన భర్త, పిల్లలకు కృతజ్ఞతలు తెలిపారు లిండా పాట్గియేటర్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కారులో వచ్చి కరెంట్ బల్బుల చోరి.. ఇది పెద్ద స్కెచ్చే !!
కొట్టేశా.. అని ఆనందంతో పరిగెత్తి… బొక్క బోర్లాపడ్డ దొంగ !! చివరికి ఏమైందంటే ??
‘మా అమ్మా సమంత’.. మనోడి మాటలు వింటే నవ్వలేక చస్తారు !!
Samantha: సినిమా హిట్ టాక్ రావడంతో.. సమంత భావోద్వేగ పోస్ట్..
Allu Arjun: బన్నీ చేసిన సాయానికి మలయాళీలు ఫిదా..
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
రూ. 60 వేల విలువైన కెమెరా ఆర్డర్ పెడితే.. ఆన్లైన్ మోసం..
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డ్రైవర్ టెస్ట్, దాని ప్రయోజనాలు
18 లక్షల సార్లు స్కిప్పింగ్ చేస్తాడా ?? నెట్టింట జోరుగా చర్చ
పండ్లపై ఎలుకల మందు పూసి అమ్ముతున్న వ్యాపారులు
ఫ్రెంచ్ అబ్బాయి..యానాం అమ్మాయి పెళ్లి.. గుర్రపు బండిపై ఊరేగుతూ..
అర్ధరాత్రి టపాసుల మోత.. హడలెత్తిపోతున్న జనం

