Man dead in Pali: పెళ్లింట విషాదం.. డ్యాన్స్ చేస్తూ అకస్మాత్తుగా మరణించిన వధువు మేనమామ.. వీడియో వైరల్
వ్యక్తి పెళ్లి వేడుకలో సంతోషంగా డ్యాన్స్ చేస్తూ.. అకస్మాత్తుగా మరణించాడు. దీంతో ఆనందంతో ఉన్న ఆ కుటుంబం క్షణ కాలంలో శోకసంద్రంగా మారింది. ఈ విషాద ఘటన రాజస్థాన్‌లోని పాలిలో చోటు చేసుకుంది.
గత కొంతకాలంగా వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో అకస్మాత్తుగా మరణిస్తున్నవారి గురించి వింటూనే ఉన్నాం.. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ ఇలా మరణిస్తున్నవారి లిస్ట్ లో ఉన్నారు. తాజాగా ఓ వ్యక్తి పెళ్లి వేడుకలో సంతోషంగా డ్యాన్స్ చేస్తూ.. అకస్మాత్తుగా మరణించాడు. దీంతో ఆనందంతో ఉన్న ఆ కుటుంబం క్షణ కాలంలో శోకసంద్రంగా మారింది. ఈ విషాద ఘటన రాజస్థాన్‌లోని పాలిలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
శుక్రవారం రాత్రి పాలి నగరంలోని మహాత్మా గాంధీ కాలనీలో డ్యాన్స్ చేస్తూ ఓ వ్యక్తి కిందపడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాస్తవానికి, పాలిలోని రణవాస్ స్టేషన్‌లో నివసిస్తున్న 42 ఏళ్ల అబ్దుల్ సలీం పఠాన్ ప్రభుత్వ పాఠశాలలో ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. అబ్దుల్ తన భార్య, ఇద్దరు పిల్లలు తన అత్తమామలతో కలిసి మేన కోడలి వివాహ వేడెక్కి హాజరయ్యాడు. శనివారం అబ్దుల్ మేనకోడలి వివాహం జరగాల్సి ఉంది.
పెళ్లికి ఒక రోజు ముందు.. అబ్దుల్ మ్యూజిక్ నైట్ వేదికపై డ్యాన్స్ చేస్తున్నాడు. అయితే డ్యాన్స్ చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా కింద పడిపోయాడు. కొన్ని క్షణాల్లో మరణించాడు. డ్యాన్స్ చేస్తున్న సమయంలో గుండెపోటు వచ్చి.. అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది.
పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ స్టేజిపై ఓ వ్యక్తి మృతి
#Rajasthan#Dance#death साली की शादी में नाचते हुए जीजा की स्टेज पर गिरकर मौत… pic.twitter.com/kixpBnNb3w
— Sweta Gupta (@swetaguptag) November 13, 2022
అబ్దుల్ సలీం పఠాన్ ప్రభుత్వ పాఠశాలలో పిటిఐ గా పని చేస్తున్నాడు. అతను తన మేన కోడలు పెళ్లిలో డ్యాన్స్ చేస్తుండగా ఈ విషాద ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అబ్దుల్ నృత్యం చేస్తున్న సమయంలో అతనితో పాటు మిగిలిన కుటుంబ సభ్యులు కూడా వేదికపై డ్యాన్స్ చేస్తున్నారు. పెళ్లి సందడితో చుట్టూ ఆనంద వాతావరణం నెలకొంది. బంధువులతో కలిసి డ్యాన్స్ చేస్తుండగా అబ్దుల్ ఒక్కసారిగా కిందపడి మృతి చెందాడు. మృతుడు అబ్దుల్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
డ్యాన్స్ చేస్తూ అబ్దుల్ సలీం కిందపడిపోవడంతో ఒక్కసారిగా గందరగోళ వాతావరణం నెలకొంది. బంధువులు అతడిని పైకి లేపేందుకు ప్రయత్నించినా అతని శరీరంలో ఎలాంటి కదలిక కనిపించలేదు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. గుండెపోటుతో అబ్దుల్ మృతి చెందినట్లు తెలిసింది. అయితే పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి గల కారణాలు తెలియనున్నాయి.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..