Viral: నడుం నొప్పి కోసం పెట్టుకునే బెల్ట్ అనుకోకండి.. అసలు విషయం తెలిస్తే నివ్వెరపోతారు..
శుక్రవారం ముంబై ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్ రూ. 32 కోట్ల విలువైన 61 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. రెండు వేర్వేరు కేసుల్లో ఇద్దరు మహిళలతో సహా ఏడుగురు ప్రయాణికులను అరెస్టు చేసింది.
ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 61కేజీల గోల్డ్..ఎస్..ముంబై ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. 61 కేజీల బంగారాన్ని సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. ఏడుగురిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. దాని విలువ 32 కోట్ల రూపాయలుంటుందని అంచనా వేస్తున్నారు.
రెండు వేర్వేరు ఘటనల్లో ఈ బంగారం సీజ్ చేశారు. నడుముకు పెట్టుకున్న బెల్ట్‌లో గోల్డ్ బిస్కెట్స్‌ను దాచి సీక్రెట్‌గా తరలిస్తుండగా పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. UAE నుంచి వచ్చిన నలుగురిని..దుబాయ్ నుంచి వచ్చిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. ఒకేరోజు ఇంత పెద్ద మొత్తంలో బంగారం పట్టుబడటం ఇదే తొలిసారని తెలిపారు కస్టమ్స్ అధికారులు. UAEలో స్పెషల్‌గా బెల్ట్‌లను తయారు చేయించి..అధికారుల కళ్లుగప్పి బంగారం తరలించేందుకు యత్నించారు స్మగ్లర్లు. ఐతే చాకచక్యంగా వ్యవహరించిన కస్టమ్స్ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఆఫ్రికా దేశం టాంజానియా నుంచి దోహా మీదుగా ముంబైకి వచ్చారు స్మగ్లర్లు. ఐతే దోహా ఎయిర్‌పోర్టులో వారికి గోల్డ్ బిస్కెట్స్ ఉన్న బెల్ట్‌ను సూడాన్ జాతీయుడు అప్పగించినట్టు తెలుస్తోంది. వారిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు..ఎక్కడి నుంచి బంగారం తరలిస్తున్నారు..? ఎవరి కోసం తీసుకొచ్చారు..? అన్న అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఇటీవలి విదేశీ కరెన్సీ స్వాధీనం నేపథ్యంలో, అధికారులు ఆఫ్రికా, మధ్యప్రాచ్యంలోని కొన్ని ప్రదేశాల నుంచి విమానాల ద్వారా వచ్చే ప్రయాణీకులను నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో భారీ ఎత్తున బంగారం పట్టుబడుతుంది.
On 11.11.2022, Mumbai Airport Customs foiled attempts to smuggle 61 Kg gold valued @ Rs 32 Crore. This was the highest ever seizure in a single day. 7 passengers were arrested. @cbic_india @nsitharamanoffc pic.twitter.com/nN2Y3ys9Ci
— Mumbai Customs-III (@mumbaicus3) November 13, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..