Mongrel Menace: ప్రేమిస్తే సరిపోదు బాధ్యత కూడా ఉండాలి.. పెంపుడు కుక్క కరిస్తే పదివేలు ఫైన్.. ఎక్కడంటే

నగర వాసులు తమ పెంపుడు జంతువుల వివరాలు ప్రభుత్వ కార్యాలయంలో రిజిస్టర్ చేయించుకోవాలని సూచించింది. లేని పక్షంలో 2 వేలు జరిమానా కట్టాల్సి ఉంటుందని హెచ్చరించింది. అలాగే మీ పెంపుడు కుక్కను బయటకు తీసుకెళ్లినపుడు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

Mongrel Menace: ప్రేమిస్తే సరిపోదు బాధ్యత కూడా ఉండాలి.. పెంపుడు కుక్క కరిస్తే పదివేలు ఫైన్.. ఎక్కడంటే
Animal Welfare Board Of India
Follow us
Surya Kala

|

Updated on: Nov 13, 2022 | 2:28 PM

మీరు కుక్కను పెంచుతున్నారా. అయితే ఈ వార్త మీకోసమే. కుక్కలను ప్రేమగా పెంచడమే కాదు వాటిపట్ల బాధ్యతగా ఉండాలి. వాటినుంచి ఇతరులకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా చూసుకోవాలి. పెంపుడు జంతువుల విషయంలో బాధ్యతగా ఉండాలని నోయిడా అధికార యంత్రాంగం పేర్కొంది. ఇందులో భాగంగా నగర వాసులు తమ పెంపుడు జంతువుల వివరాలు ప్రభుత్వ కార్యాలయంలో రిజిస్టర్ చేయించుకోవాలని సూచించింది. లేని పక్షంలో 2 వేలు జరిమానా కట్టాల్సి ఉంటుందని హెచ్చరించింది. అలాగే మీ పెంపుడు కుక్కను బయటకు తీసుకెళ్లినపుడు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఒకవేళ మీ కుక్క ఎవరినైనా కరిచి గాయపరిస్తే పదివేల జరిమానా కట్టాల్సి ఉంటుందని నోయిడా అథారిటీ సీఈవో పేరుతో ఆదేశాలు జారీ చేశారు. పెంపుడు జంతువులకు సంబంధించి యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా సూచనలు అమలుచేయాలని ట్వీట్ లో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

వచ్చే ఏడాది జనవరి 31 వరకు పెంపుడు జంతువుల రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని నోయిడా అధికారులు తెలిపారు. పెంపుడు జంతువులకు స్టెరిలైజేషన్, యాంటీబయాటిక్ వ్యాక్సినేషన్ చేయించాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో పెంపుడు జంతువు మలమూత్రాలు చేస్తే దానిని యజమానులే శుభ్రం చేయాలని తెలిపారు. ఎవరినైనా గాయపరిచితే.. వారి చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తం భరించడంతో పాటు పదివేల రూపాయలు జరిమానా కూడా కట్టాల్సి ఉంటుందని అధికారులు హెచ్చరించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..