Jammu Kashmir: కశ్మీర్ లో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హతం.. నకిలీ ఎన్జీవో గుట్టురట్టు

ఉత్తర కాశ్మీర్​కు చెందిన  మరో ఐదుగురితో కలిసి పేదలకు ఆర్థిక సాయం పేరుతో ‘ఇస్లాహి ఫలాహి రిలీఫ్‌‌‌‌ ట్రస్ట్‌‌‌‌ (ఐఎఫ్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌టీ) ఎన్జీవో నడుపుతున్నట్లు గుర్తించారు. ఈ సంస్థకు వచ్చే ఫండ్స్ ను ఉగ్రవాదులకు చేరుస్తున్నట్లు.. పేద యువకులను టెర్రర్‌‌‌‌‌‌‌‌ సంస్థల్లో రిక్రూట్‌‌‌‌మెంట్‌‌‌‌ చేస్తున్నారని తాము గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

Jammu Kashmir: కశ్మీర్ లో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హతం.. నకిలీ ఎన్జీవో గుట్టురట్టు
Module Busted In Kupwara
Follow us
Surya Kala

|

Updated on: Nov 11, 2022 | 9:37 AM

జమ్మూకశ్మీర్ లోని షోపియాన్‌లో మరోసారి ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.  ఈ కాల్పుల్లో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాది హతమయ్యాడు. హతమైన ఉగ్రవాదిని కమ్రాన్ భాయ్ అలియాస్ హనీస్‌గా గుర్తించామని. అతడు కుల్గామ్-షోపియాన్ ప్రాంతంలో చాలా చురుకుగా ఉండేవాడని కశ్మీర్ పోలీసులు తెలిపారు. సమాచారం ప్రకారం..  షోపియాన్‌లోని కప్రీన్ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఉగ్రవాదుల కదలికలపై అందిన సమాచారంతో పోలీసులు, భద్రతా బలగాల సంయుక్త చర్యను చేపట్టాయి. ఎదురుకాల్పుల్లో జైషే ఉగ్రవాది హతమయ్యాడు. మరికొందరు ఉగ్రవాదులు ఉండే అవకాశం ఉందని భావిస్తున్న పోలీసులు, భద్రతాదళాలు ఆ ప్రాంతంలో ఇంకా సోదాలు కొనసాగిస్తున్నారు.

అంతకుముందు నవంబర్ 9 న, జైష్-ఎ-మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ముగ్గురు అనుమానిత సభ్యులను జమ్మూలో అరెస్టు చేశారు. వారి నుండి భారీ  మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. జైషే మహ్మద్ ఉగ్రవాద ఎన్జీవో ను ఛేదించినట్లు పోలీసులు తెలిపారు. జమ్మూలోని నార్వాల్ ప్రాంతంలో ఓ ఆయిల్ ట్యాంకర్ నుంచి మూడు ఏకే రైఫిళ్లు, ఒక పిస్టల్, ఆరు గ్రెనేడ్‌లతో సహా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఒక పాకిస్తానీకి చెందిన వ్యక్తి.. సరిహద్దు నుంచి కాశ్మీర్‌కు పంపిన ఆయుధాలను మోసుకెళ్లే పనిని చేపట్టినట్లు తాము గుర్తించామని పోలీసులు చెప్పారు.

కుప్వారాలో ఓ నకిలీ ఎన్జీవో గుట్టురట్టు గురువారం కుప్వారా జిల్లాలో ఉగ్రవాద ఫైనాన్సింగ్, రిక్రూట్‌మెంట్ చేస్తున్న నకిలీ ఎన్జీవో సంస్థకు చెందిన 6 మంది నిందితులను అరెస్టు చేశారు. ఆర్మీకి చెందిన ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఐఈడీ మెటీరియల్‌‌‌‌, 5 పిస్టల్స్‌‌‌‌, 2 గ్రనేడ్లను స్వాధీనం చేసుకున్నారు. ఉత్తర కాశ్మీర్‌లో పనిచేస్తున్న టెర్రర్ ఫండింగ్ , రిక్రూట్‌మెంట్ మాడ్యూల్‌ను కుప్వారా పోలీసులు ఛేదించారని కుప్వారా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్‌ఎస్‌పి) యుగల్ మన్హాస్ తెలిపారు. జిల్లాలోని చిర్కోట్ ప్రాంతానికి చెందిన బిలాల్ అహ్మద్ దార్ గురించి సమాచారం అందుకున్న తరువాత, అతనిని పట్టుకోవడానికి భద్రతాదళాలు. పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టింది.

ఇవి కూడా చదవండి

ఎన్జీవోల ముసుగులో ‘టెర్రర్ ఫండింగ్’   ఉత్తర కాశ్మీర్​కు చెందిన  మరో ఐదుగురితో కలిసి పేదలకు ఆర్థిక సాయం పేరుతో ‘ఇస్లాహి ఫలాహి రిలీఫ్‌‌‌‌ ట్రస్ట్‌‌‌‌ (ఐఎఫ్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌టీ) పేరుతో ఎన్జీవో నడుపుతున్నట్లు గుర్తించారు. ఈ సంస్థ పేద, నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించే పేరుతో వచ్చే ఫండ్స్ ను ఉగ్రవాదులకు చేరుస్తున్నట్లు.. పేద యువకులను టెర్రర్‌‌‌‌‌‌‌‌ సంస్థల్లో రిక్రూట్‌‌‌‌మెంట్‌‌‌‌ చేస్తున్నారని తాము గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంస్థకు చెందిన మరో ఐదుగురిని అరెస్టు చేశారు. పాకిస్తాన్‌‌‌‌ నుంచి వచ్చే ఆదేశాల ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తాము గుర్తించినట్లు పేర్కొన్నారు. ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్‌‌‌‌ షా బారాముల్లా పర్యటన సందర్భంగా దేశ వ్యతిరేక పోస్టర్లు అంటించింది కూడా ఈ  బృందమేనని యుగల్ మన్హాస్ తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అయ్యప్ప స్వాములకు ఒకొక్క ఏడాదికి ఒకొక్క పేరు 18 సార్లు తీసుకుంటే
అయ్యప్ప స్వాములకు ఒకొక్క ఏడాదికి ఒకొక్క పేరు 18 సార్లు తీసుకుంటే
ట్రెండింగ్‌లో ఉన్న సైబర్‌ నేరాలు ఇవే.. జాగ్రత్తగా లేకుంటే..
ట్రెండింగ్‌లో ఉన్న సైబర్‌ నేరాలు ఇవే.. జాగ్రత్తగా లేకుంటే..
Money Astrology: ఆ రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం!
Money Astrology: ఆ రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం!
అఫీషియల్.. అప్పుడే ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం 'క'.. ఎప్పుడంటే?
అఫీషియల్.. అప్పుడే ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం 'క'.. ఎప్పుడంటే?
బీజేపీ విషయంలో వైసీపీ వ్యూహం మారుతుందా..?
బీజేపీ విషయంలో వైసీపీ వ్యూహం మారుతుందా..?
కేవలం రూ.90 వేలకే ఎలక్ట్రిక్‌ బైక్‌.. 175 కిలోమీటర్ల మైలేజీ..!
కేవలం రూ.90 వేలకే ఎలక్ట్రిక్‌ బైక్‌.. 175 కిలోమీటర్ల మైలేజీ..!
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
కంగువా ఎఫెక్ట్.. కోలీవుడ్‌లో కొత్త వివాదం..టాలీవుడ్‌లో ప్రకంపనలు
కంగువా ఎఫెక్ట్.. కోలీవుడ్‌లో కొత్త వివాదం..టాలీవుడ్‌లో ప్రకంపనలు
ఈ ఆలయంలో దేవుళ్ళకు కాదు రాయల్ ఎన్‌ఫీల్డ్ కి పూజలు.. ఎందుకంటే..
ఈ ఆలయంలో దేవుళ్ళకు కాదు రాయల్ ఎన్‌ఫీల్డ్ కి పూజలు.. ఎందుకంటే..
గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ..
గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!