AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ravindra Jadeja: ఇరకాటంలో పడ్డ జడ్డూ.. బీజేపీ నుంచి భార్య.. కాంగ్రెస్‌ నుంచి సోదరి.. ఏం చేస్తాడో మరి..

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్ పొందినందుకు తన భార్యకు అభినందనలు తెలిపన జడేజా ఆమె కష్టపడుతున్న తీరును చూసి గర్వపడుతున్నానన్నాడు.

Ravindra Jadeja: ఇరకాటంలో పడ్డ జడ్డూ.. బీజేపీ నుంచి భార్య.. కాంగ్రెస్‌ నుంచి సోదరి.. ఏం చేస్తాడో మరి..
Ravindra Jadeja
Basha Shek
|

Updated on: Nov 11, 2022 | 10:03 AM

Share

రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 182 స్థానాలకు గానూ గురువారం 160 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను విడుదల చేసింది. ఇందులో టీమిండియా స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా పేరు కూడా ఉంది. ఆమె జామ్‌ నగర్‌ నార్త్‌ స్థానం నుంచి బరిలోకి దిగనుంది. ఈ విషయాన్ని జడ్డూనే సోషల్‌ మీడియా ద్వారా తెలిపాడు. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్ పొందినందుకు తన భార్యకు అభినందనలు తెలిపన జడేజా ఆమె కష్టపడుతున్న తీరును చూసి గర్వపడుతున్నానన్నాడు. సమాజాభివృద్ధికి ఇలాంటి కృషి చేస్తూనే ఉండాలని ఆకాంక్షించాడు. అదేవిధంగా తమకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపాడీ  జడేజా. కాగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు మొత్తం రెండు విడతలుగా జరగనున్నాయి. డిసెంబర్ 1న 89 నియోజకవర్గాలకు, 5న 93 నియోజకవర్గాలకు ఎన్నిక జరగనుంది. డిసెబర్ 8వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది.

కాగా రివాబా జడేజా మెకానికల్ ఇంజనీరింగ్ పట్టభద్రురాలు. కాంగ్రెస్ సీనియర్ నేత హరి సింగ్ సోలంకికి సమీప బంధువు. 2016లో రవీంద్ర జడేజాతో కలిసి ఆమె ఏడుడుగులు నడిచింది. రాజ్ పుత్ కుటుంబానికి చెందిన రివాబాకు జామ్ నగర్-సౌరాష్ట్ర ఏరియాల్లో మంచి పట్టు ఉంది. తాను స్థాపించిన శ్రీ మాతృశక్తి చారిటబుల్‌ ట్రస్ట్‌ పేరిట ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు అవసరమైన సేవలను అందిస్తున్నారు. ముఖ్యంగా బాలికల సంక్షేమం, విద్యతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యంపైనా అవగాహన కల్పిస్తున్నారు. ఇక 2019లో బీజేపీలో చేరి రాజకీయాల్లోకి అరంగేట్రం చేసింది. గత రెండేళ్లలో ఆమె జామ్‌నగర్‌ జిల్లాలో దాదాపు 135 గ్రామాలను సందర్శించడం గమనార్హం. మరోవైపు ఇదే స్థానం నుంచి జడేజా సోదరి నైనా జడేజాను కాంగ్రెస్ బరిలోకి దింపే అవకాశం కనిపిస్తోంది. 2019 ఏప్రిల్‌లో కాంగ్రెస్‌లో చేరిన ఆమె.. అప్పటి నుంచి రాజకీయంగా పలుకుబడి సంపాదించారు. ప్రస్తుతం జామ్‌నగర్ కాంగ్రెస్ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. ఇక్కడి నుంచి రివాబా జడేజాకు టికెట్ కన్ఫార్మ్ కావడంతో.. నైనా జడేజా కూడా పోటీ చేయడం ఖాయమని చర్చ జరుగుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..