Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bride Video: వధువుని నెలకు తక్కువతే పుట్టింటికి పంపనున్న వరుడు.. ఎవరి పర్మిషన్ ఎవరు తీసుకుంటారో చూద్దామన్న నెటిజన్లు

ఒక వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఇందులో వరుడు వివాహం జరిపిస్తున్న పండితుడు చెబుతున్న ఒక విషయానికి ఇచ్చిన సమాధానంతో ..  వధువుతో సహా అందరూ నవ్వడం ప్రారంభించారు. 

Bride Video: వధువుని నెలకు తక్కువతే పుట్టింటికి పంపనున్న వరుడు.. ఎవరి పర్మిషన్ ఎవరు తీసుకుంటారో చూద్దామన్న నెటిజన్లు
Funny Wedding Video Viral
Follow us
Surya Kala

|

Updated on: Nov 13, 2022 | 9:35 PM

భారతీయ వివాహం సంప్రదాయంగా ఆచారం ప్రకారం నిర్వహిస్తారు. పెళ్లి వేడుకల్లో బంధువులు, స్నేహితులు వధూవరుల నవ్వులతో సందడిగా ఉంటుంది.  వివాహ వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. దీంతో పెళ్ళికి సంబంధించిన అనేక వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. అలాంటి ఒక వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఇందులో వరుడు వివాహం జరిపిస్తున్న పండితుడు చెబుతున్న ఒక విషయానికి ఇచ్చిన సమాధానంతో ..  వధువుతో సహా అందరూ నవ్వడం ప్రారంభించారు.

వివాహ సమయంలో కొన్ని క్షణాలు జీవితాంతం గుర్తుండే జ్ఞాపకాలని.. వాటిని ఎవరూ మిస్ చేయకూడదనుకుంటారు. ఊరేగింపులో నృత్యం, వేదికపై వధూవరుల జయమాల వేడుక, మండపంలో సప్త పది, వధువు అప్పగింతలు ఇవన్నీ వధూవరులతో కలిసి ఆహుతులు కూడా ఆనందించాలనుకునే క్షణాలు. పెళ్లి చేస్తున్న పండితుడి మాటలు విని వరుడు చెప్పిన మాటలను ఇప్పుడు ఈ వీడియోనే చూడండి. అతని హాస్యం నిజంగా అద్భుతంగా ఉందని నెటిజన్లు వరుడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియోలో పండితుడు మండపంలో కూర్చొని వధూవరులకు పెళ్ళికి అర్ధం.. సప్త పది వంటి వాటికీ అర్ధం చెబుతూ.. మీరు మీ నాన్నగారి ఇంటికి వెళ్లాలనుకున్నా.. అయితే మీరు భర్త అనుమతి తీసుకోవాలి అని వధువుతో చెప్పినట్లు మీరు చూడవచ్చు. అది విని పెళ్లికూతురు సేపు మౌనం వహించింది. అయితే వరుడు జోక్ వేయడానికి సమయం తీసుకోలేదు. వరుడు.. వధువుతో నువ్వు ఎప్పుడైనా పుట్టింటికి వెళ్ళు.. నేను అసలు వద్దు అనను.. అయితే నేను ఒక షరత్తు మీద నిన్ను మీ పుట్టింటికి పంపిస్తాను.. ఒకటి రెండు రోజుల కోసం కాదు.. నువ్వు పుట్టింటికి వెళ్తే.. నెల రోజులు ఉండాలి.. అంతకంటే తక్కువ అయితే పుట్టింటి వెళ్లొద్దు అని సరదాగా అన్నాడు.. దీంతో వివాహ వేదిక నవ్వుల వేదికగా మారింది.

View this post on Instagram

A post shared by Weddingz.in (@weddingz.in)

ఈ ఫన్నీ వెడ్డింగ్ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.ఈ వీడియోను weddingz.in అనే Instagram ఖాతాలో షేర్ చేశారు. ఇప్పటి వరకు పదమూడు వేల మందికి పైగా వీడియోను లైక్ చేసారు. చాలా మంది వీడియోపై ఫన్నీ కామెంట్స్ కూడా చేస్తున్నారు. ప్రేమ వివాహంలో మాత్రమే ఎవరైనా చాలా నవ్వు,  వినోదాన్ని చూడగలరని ఒకరు కామెంట్ చేశారు. మరొకరు ‘వధువు ముఖం కోపంతో ఎర్రగా మారినట్లు కనిపిస్తుంది’ అని మరొరు..  ఇంకొకరు.. ‘ పెళ్లి అయి కాపురం మొదలు పెట్టండి.. ఎవరి అనుమతి ఎవరు తీసుకోవాలో అప్పుడు తెలుస్తుంది’ అని ఫన్నీ కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..