Expensive Beer: చరిత్రలోనే అత్యంత ఖరీదైన ‘బీరు’.. ధర తెలిస్తే కళ్లు తేలేయడం పక్కా.. వందో, వెయ్యో కాదండోయ్.. ఏకంగా..
బీరు ధర ఎంత? అని ప్రశ్నిస్తే.. తెలంగాణ వాసులందరూ 140, 150 అని చెబుతారు. అదే ఏపీలో అయితే రూ. 200 అని టకీమని చెబుతారు. ఇక ఆయా రాష్ట్రాల్లో ఆయా..

బీరు ధర ఎంత? అని ప్రశ్నిస్తే.. తెలంగాణ వాసులందరూ 140, 150 అని చెబుతారు. అదే ఏపీలో అయితే రూ. 200 అని టకీమని చెబుతారు. ఇక ఆయా రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు నిర్దేశించి ప్రకారం ధరలు ఉంటాయి. మొత్తానికి వంద, రెండొందలు ధర ఉంటుంది. కానీ, ఇప్పుడు మనం చెప్పబోయే బీరు ధర తెలిస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. అవును, ఆ బీరు ధర వందో, వెయ్యో కాదు.. లక్షలు అంతకన్నా కాదు.. ఏకంగా కోట్లలో ఉంది దాని ధర. ఈ బీరు ధర అక్షరాలా రూ. 4.05 కోట్లు. నమ్మశక్యం కాకపోయినా ఇది నిజంగా నిజం. ఇంకా నమ్మడం లేదా? అయితే, పూర్తి మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే.
వైన్, షాంపైన్ మాత్రమే ప్రీమియం అని చాలా మంది భావిస్తారు. అయితే, వీటికి మించిన ధర ఈ బీరుది. మరి ఈ బీరు కు ఎందుకంత ధర అనేది ఇప్పుడు తెలుసుకుందాం. బీర్ కూడా హై ఎండ్ మార్కెట్‌లో ఉంది. ఆ బాటిల్ ధర 503,300 అమెరికన్ డాలర్లు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బీర్‌గా నిలిచింది. దీని పేరు ‘ఆల్‌సోస్స్ ఆర్కిటిక్ ఆలె’. ఇది 140 ఏళ్ల క్రితం నాటిది. అత్యంత పురానమైన, చారిత్మాత్మకమైనదిగా గుర్తింపు పొందింది. దీనికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. అత్యంత ఖరీదైన ఈ బీర్ కథ eBay లో ప్రారంభమైంది. 2007లో ఓక్లహోమాకు చెందిన ఓ వ్యక్తి 304 డాలర్లకు ఆల్‌సోప్ ఆర్కిటిక్ ఆలె బాటిల్‌ను కొనుగోలు చేశాడు. దీనిపై 1919 నాటి బాటిల్ తనకు తిరిగివచ్చిందని పేర్కొంటూ పెర్సీ జి. బోల్‌స్టర్ సంతకం చేసిన పాత, లామినేట్ చేతితో రాసిన నోట్‌తో ఆ బాటిల్ వచ్చింది.
అయితే, ఈ బీర్‌ను 1852లో ధ్రువ యాత్ర కోసం ప్రత్యేకంగా తయారు చేశారట. సర్ జాన్ ఫ్రాంక్లిన్, అతని సిబ్బంది కోసం వెతుకుతున్న సమయంలో సర్ ఎడ్వర్డ్ బెల్చర్ 1852లో ఆర్కిటిక్‌కు తీసుకెళ్లిన వస్తువులలో ఈ బీర్ కూడా ఒక భాగమట. ఆర్కిటిక్ సముద్రం గుండా అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాల మధ్య ఉన్న నార్త్ వెస్ట్ పాసేజ్‌లో రెండు నౌకల ద్వారా భయానకమైన సముద్ర ప్రయాణం జరిగింది. HMS Erebus, HMS Terror ఓడలు సముద్ర యానానికి బలుదేరాయి. కానీ, నావికులు ఆ ఓడలను విడిచిపెట్టాల్సి రావడంతో.. అవి తిరిగి రాలేదు. దురదృష్టావశాత్తు, ఇద్దరు సిబ్బంది కూడా కనిపించకుండా పోయారు. అయితే, రెండు ఓడలు, మిస్ అయిన సిబ్బంది కోసం రెస్క్యూటీమ్‌ని పంపిన సందర్భంలో బీర్ బాటిల్ వారికి దొరికింది.




ఈ బీర్ ఎందుకు ప్రత్యేకమైనది?
గడ్డకట్టే చల్లని ఆర్కిటిక్ వాతావరణానికి అనువుగా ఉండే ప్రత్యేక బ్యాచ్ బీర్‌ను రూపొందించమని ఆల్‌సోప్స్ బ్రూవరీని బెల్చర్ కోరాడు. అతని కోరిక మేరకు ఆర్కిటెక్ ఆలే పేరుతో కాటన్ల కొద్ది బీర్ బాటిళ్లను తయారు చేసి సరఫరా చేశారు. ఇందులో ఆల్కాహాల్ కంటెంట్.. మిగతా వాటిలో కంటే ఎక్కువగా ఉంటుంది. ఇది బీర్ గడ్డకట్టకుండా చేస్తుంది. అయితే, కొంతకాలం క్రితం eBayలో ఈ బీర్ బాటిల్‌ను అమ్మకానికి పెట్టారు. ఆ తరువాత తెలిసింది. ఇది 1852లో తయారు చేసిన బీర్ బాటిళ్లలో తొలి బ్యాచ్‌కి చెందినదని. ఇది ప్రపంచంలోనే అరుదైన బీర్‌గా నిలిచింది. eBayలో ఈ బాటిల్ కోసం 157 కంటే ఎక్కువ మంది బిడ్లు దాఖలు చేశారు. ఇది చివరకు 5,03,300 డాలర్లకు గుర్తు తెలియని వ్యక్తి కొనుగోలు చేశాడు. మరి అతను ఆ బాటిల్‌ను ఏం చేశాడనేది ప్రశ్నార్థకం.
మరిన్ని హ్యూమన్‌ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..