AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Illegal Affair: తల్లితో అఫైర్.. కూతురితో పెళ్లి.. కట్ చేస్తే అదిరిపోయే ట్విస్ట్.. బాలిక తల్లే దగ్గరుండి మరీ..

ఆమె వయసు 36, అతని వయసు 28.. ఇద్దరి మధ్య అఫైర్ నడుస్తోంది. అయితే, ఆమెకు అప్పటికే వివాహమై.. 15 ఏళ్ల కూతురుకు కూడా ఉంది. ఈ అఫైర్ నడుస్తుండగానే..

Illegal Affair: తల్లితో అఫైర్.. కూతురితో పెళ్లి.. కట్ చేస్తే అదిరిపోయే ట్విస్ట్.. బాలిక తల్లే దగ్గరుండి మరీ..
Arrest
Shiva Prajapati
|

Updated on: Nov 12, 2022 | 8:19 PM

Share

ఆమె వయసు 36, అతని వయసు 28.. ఇద్దరి మధ్య అఫైర్ నడుస్తోంది. అయితే, ఆమెకు అప్పటికే వివాహమై.. 15 ఏళ్ల కూతురుకు కూడా ఉంది. ఈ అఫైర్ నడుస్తుండగానే.. అతని కన్ను ఆ మైనర్ బాలిక పైడింది. ఇంకేముంది.. ఆ అమ్మాయిని తనికిచ్చి పెళ్లి చేయాలని తన ప్రియురాలిని కోరాడు. అలా చేస్తే.. తమ అఫైర్‌కు ఎలాంటి ఆటంకం ఉండదని ముచ్చట్లు చెప్పుకొచ్చాడు. ఇంకేముంది.. ఆ మహాతల్లి కూడా అందుకే ఓకే చెప్పింది. తన ప్రియుడిని పెళ్లి చేసుకోవాలంటూ కన్న కూతురుని బలవంతపెట్టింది. పెళ్లి చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించింది. దాంతో దిక్కుతోచని ఆ బాలిక.. ఆ దుర్మార్గుడి ముందు తలవంచింది. అతన్ని పెళ్లి చేసుకుంది. మహారాష్ట్రంలోని పూణెలో చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనం సృష్టిస్తోంది.

పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పూణెకు చెందిన ఓ మహిళ తాను అక్రమ సంబంధం నెరుపుతున్న యువకుడికే తన మైనర్ కూతురుని ఇచ్చి వివాహం చేసింది. అతన్ని పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిన ఆ బాలికను బ్లాక్ మెయిల్ చేసింది. పెళ్లి చేసుకోకపోతే చనిపోతానంటూ బెదిరించింది. దాంతో ఆ బాలిక పెళ్లికి అంగీకరించింది. ఇదే ఛాన్స్‌గా భావించిన ఆ కీచకుడు.. ఓ గుడిలో బాలికను పెళ్లి చేసుకున్నాడు. అనంతరం బాలికపై బలత్కారానికి పాల్పడ్డాడు. అయితే, బాధిత బాలిక తన బాధను సహ విద్యార్థులతో పంచుకోగా.. వారు ఓ సామాజిక కార్యకర్త దృష్టికి తీసుకెళ్లారు. అతను వెంటనే విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. బాలికను కలిసిన పోలీసులు ఆమె నుంచి ఫిర్యాదు స్వీకరించారు. ఆ ఫిర్యాదు మేరకు బాలిక తల్లి, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు.

మహిళ, ఆమె ప్రియుడిని ఇద్దరినీ అరెస్ట్ చేసిన చందన్‌నగర్ పోలీసులు.. వారిపై పోక్సో చట్టం, బాల్య వివాహాల నిషేధ చట్టం కింద కేసులు నమోదు చేశారు. నిందితుడు మహిళకు దూరపు బంధువు అని గుర్తించారు. మహిళ తన భర్తను వీడి కూతురుతో కలిసి జీవిస్తుంది. ఈ క్రమంలో సమీప బంధువైన యువకుడితో అఫైర్ నడుపుతోందని పోలీసులు తెలిపారు. వీరిద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..