AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Funny Video: మనిషైనా, జంతువైనా పిల్లల అల్లరికి టాప్ లేచిపోవాల్సిందే.. కంత్రీ ఏనుగు పిల్ల.. కంటింగ్స్ మామూలుగా లేవండోయ్..

ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటారు. పిల్లలు చేసే అల్లరిని భరిస్తూ.. వారిని వారిస్తూ కంట్రోల్ చేస్తుంటారు. ఒక్కోసారి పిల్లలు గుర్తు తెలియని,

Funny Video: మనిషైనా, జంతువైనా పిల్లల అల్లరికి టాప్ లేచిపోవాల్సిందే.. కంత్రీ ఏనుగు పిల్ల.. కంటింగ్స్ మామూలుగా లేవండోయ్..
Elephants
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 11, 2022 | 10:30 PM

ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటారు. పిల్లలు చేసే అల్లరిని భరిస్తూ.. వారిని వారిస్తూ కంట్రోల్ చేస్తుంటారు. ఒక్కోసారి పిల్లలు గుర్తు తెలియని, కొత్త వ్యక్తుల వద్దకు వెళ్తుంటారు. ఆ సమయంలోనూ వారిని కంట్రోల్ చేస్తారు. అయితే, మనుషుల్లోనే కాదు.. జంతువుల పిల్లలూ ఇలాగే ప్రవర్తిస్తాయి. మనుషులకు మించి చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తాయి. రచ్చ రచ్చ చేస్తాయి. ఇక వాటిని కంట్రోల్ చేసేందుకు తల్లి జంతువులు ఆపసోపాలు పడుతాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. సాధారణంగానే ఏనుగు పిల్లల అల్లరి మామూలుగా ఉండదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోనూ గున్న ఏనుగు మస్త్ ఖుషీ చేసింది.

ఓ తల్లి ఏనుగు, దాని పిల్ల ఏనుగు రెండూ అడవి మధ్యలో ఉన్న రోడ్డు దాటుతున్నాయి. వాటి రాకను గమనించిన ప్రయాణికులు దూరంగానే తమ వాహనాలను నిలిపివేశారు. ముందుగా తల్లి ఏనుగు రోడ్డు మీదకు రాగా, ఆ తరువాత అటూ ఇటూ చూసుకుంటూ గున్న ఏనుగు బయటకు వచ్చింది. అయితే, రోడ్డుపై కొందరు ప్రయాణికులు నిల్చుని తమ ఫోన్లలో వీడియో తీయడం మొదలు పెట్టారు. వారిని గమనించి పిల్ల ఏనుగు.. వారి పరుగెత్తుకుంటూ వచ్చే ప్రయత్నం చేసింది. వెంటనే అలర్ట్ అయిన తల్లి ఏనుగు.. అరేయ్ బుడ్డోడా.. అటు వెళ్లొద్దు అన్నట్లుగా తన తొండంతో ఆ గున్న ఏనుగును కంట్రోల్ చేసింది. తనవైపు లాక్కుని తీసుకెళ్లింది. ఈ బ్యూటీఫుల్ సీన్‌ని ప్రయాణికులు తమ కెమెరాల్లో బంధించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో @Yoda4ever ఐడీ పేరుతో పోస్ట్ చేశారు. దాంతో వీడియో కాస్తా వైరల్‌గా మారింది. గున్న ఏనుగు అల్లరి చూసి ఫిదా అయిపోతున్నారు జనాలు. మరెందుకు ఆలస్యం ఈ క్యూట్, ఫన్నీ వీడియోపై మీరూ ఓ లుక్కేసుకోండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..