AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: మీరంతా ఎక్కడినుంచి వస్తారమ్మా..! దేశీ స్టైల్‌లో స్కూటీని ఆపబోయిన అమ్మాయి.. కట్ చేస్తే..

సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. వీటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. తాజాగా, ఓ యువతికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Watch Video: మీరంతా ఎక్కడినుంచి వస్తారమ్మా..! దేశీ స్టైల్‌లో స్కూటీని ఆపబోయిన అమ్మాయి.. కట్ చేస్తే..
Viral Video
Shaik Madar Saheb
|

Updated on: Nov 12, 2022 | 6:45 AM

Share

సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. వీటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. తాజాగా, ఓ యువతికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీనిలో స్కూటీ నడుపుతున్న యువతి.. కాళ్లతో బైక్‌ను ఆపేందుకు ప్రయత్నం చేస్తుంది. చివరకు ఊహించని ప్రమాదానికి గురవుతుంది. వాస్తవానికి రోజూ వేలల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్ని ప్రమాదాలు ప్రమాదకరమైనవిగా ఉంటాయి. ముఖ్యంగా డ్రైవింగ్ రాకపోవడం, నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం, నిబంధనలు పాటించకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతుంటాయి. అయితే కొన్ని సంఘటనలు అందరికీ నవ్వు తెప్పిస్తుంటాయి. తాజగా.. ఓ అమ్మాయి రోడ్డుపై స్కూటీ నడుపుతూ.. కాళ్లతో బైక్‌ను ఆపేందుకు ప్రయత్నిస్తున్న వైరల్ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.

అయితే.. యువతి స్కూటీ నడపటం కొత్త అనుకుంటా.. అందుకే ఇలా జరిగిందంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు. అమ్మాయి స్కూటీని కాలుతో ఆపేందుకు ప్రయత్నించి.. చివరకు కారును ఢీకొడుతుంది. అదృష్టం ఏంటంటే.. అమ్మాయి సురక్షితంగా బయటపడుతుంది. చిన్నగా వెళ్తుండటం.. అదే విధంగా కారు స్పీడుగా లేకపోవడంతో ఆ యువతి ప్రమాదం నుంచి బయటపడింది. అయితే, వైరల్ అవుతున్న ఈ వీడియోను నెటిజన్లకు నవ్వు తెప్పిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వీడియో చూడండి..

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

View this post on Instagram

A post shared by Asif Khan (@mr.khansab06)

వీడియోలో అమ్మాయి స్కూటీ నడుపుతూ కనిపిస్తుంది. అయితే స్కూటీని ఆపేందుకు ఆ అమ్మాయి బ్రేక్‌కు బదులు తన పాదాలను ఉపయోగిస్తుంది. రోడ్డుపై పాదాలను ఈడ్చూతూ కనిపిస్తుంది. ఆమె కూడలికి చేరుకోగానే పాదాలతో స్కూటీని ఆపడానికి ప్రయత్నించి.. కారును ఢీకొడుతుంది. అయితే.. వెనుక నుంచి బైక్‌పై వస్తున్న కుర్రాళ్లు ఈ వీడియోను రికార్డ్ చేయగా.. అది ఇప్పుడు వైరల్‌గా మారింది.

వీడియో క్లిప్‌ను mr.khansab06 అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేయగా.. లక్షలాది మంది చూసి.. ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. తప్పు ఆమెది కాదని.. కారు అతనిదే తప్పు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. డ్రైవింగ్ రాకుండా రోడ్డుపైకి ఎలాగొస్తారమ్మా అంటూ ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..