AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dating Apps: ప్రొఫైల్ ఫొటోలతో మాకేం పని..! అదే కావాలంటున్న డేటర్స్.. అధ్యయనంలో షాకింగ్ విషయాలు..

ఆన్‌లైన్ డేటింగ్ యాప్ వినియోగదారులు ఇప్పుడు ప్రొఫైల్ ఫోటోల కంటే పరస్పర చర్యలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. వారి ప్రొఫైల్ ఫోటో బాగుందో..? లేదో..? అని చూడటం లేదని అధ్యయనం పేర్కొంది.

Dating Apps: ప్రొఫైల్ ఫొటోలతో మాకేం పని..! అదే కావాలంటున్న డేటర్స్.. అధ్యయనంలో షాకింగ్ విషయాలు..
Dating Apps
Shaik Madar Saheb
|

Updated on: Nov 11, 2022 | 5:59 AM

Share

ప్రస్తుత కాలంలో డేటింగ్ యాప్‌ల ట్రెండ్ పెరిగింది. అయితే ఆన్‌లైన్ డేటింగ్ యాప్ ప్రొఫైల్ ఫోటోలను చూడటం.. ద్వారా వ్యక్తులు అవతలివారి వైపు ఆకర్షితులవుతున్నారని ఎన్నో అధ్యయనాలు వెల్లడించాయి. అయితే.. అది ఒకప్పటి కాలం.. ఇప్పుడు ట్రెండ్ మారింది.. ఫొటోలు చూడకుండానే చాటింగ్‌పై ఎక్కువగా ఆధారపడుతున్నారని మరొ కొత్త అధ్యయనం పేర్కొంది. ది గార్డియన్‌లోని ఒక నివేదిక ప్రకారం.. ఎక్కువ మంది ఆన్‌లైన్ డేటర్‌లు ఒకరి ప్రొఫైల్ ఫోటోలను మరొకరు తనిఖీ చేయకుండా సంభాషణలను (చాటింగ్) ప్రారంభించడానికి ఇష్టపడుతున్నారని తేలింది. నివేదిక ప్రకారం.. డేటింగ్ యాప్ లో భాగస్వామి ఎంపిక విషయంలో కూడా ఇదే నిజమని రుజువైందని తెలిపింది.

చాటింగ్‌పై పెరిగిన నమ్మకం..

ఆన్‌లైన్ డేటింగ్ యాప్ వినియోగదారులు ఇప్పుడు ప్రొఫైల్ ఫోటోల కంటే పరస్పర చర్యలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. వారి ప్రొఫైల్ ఫోటో బాగుందో..? లేదో..? అని చూడటం లేదని అధ్యయనం పేర్కొంది. డేటింగ్ యాప్‌ని ఉపయోగిస్తున్న ఒక మహిళ ప్రకారం.. తాను ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌లో మాట్లాడుతున్న వ్యక్తి లుక్‌లో చాలా అందంగా ఉన్నప్పటికీ, చాటింగ్‌లో వారిద్దరి మధ్య ఎలాంటి సంభాషణ ఉంటుందనే దానిపై ఆధారపడి ఉంటుందని తెలిపింది. అంటే.. చాటింగ్ మోజు ఎలా పెరిగిందో అంచనా వేయవచ్చు..

పెరుతున్న వీడియో కాల్స్..

బ్లైండ్లీ అనేది బ్లైండ్ డేటింగ్ యాప్.. ఇది ఒకరి ప్రమాణాలకు సరిపోయే వినియోగదారుల మధ్య మూడు నిమిషాల బ్లర్రీ వీడియో కాల్‌లను హోస్ట్ చేస్తుంది. సమయం గడిచే కొద్దీ, అన్‌బ్లర్ ఎంపిక.. యాప్‌లో కనిపించడం ప్రారంభమవుతుంది. మూడు నిమిషాల తర్వాత.. ఈ యాప్‌ వినియోగదారులిద్దరినీ సంభాషణను కొనసాగించమని అడుగుతుంది. వారిద్దరికీ మ్యాచ్‌లు కావాలంటే.. ఈ యాప్ అది కూడా సృష్టిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరొక పరిశోధన ప్రకారం.. నిజమైన ఫోటో బహిర్గతం అయిన తర్వాత కూడా 70% సంభాషణ కొనసాగుతుందని తేలింది. ఫొటో ట్రెండ్ నుంచి చాటింగ్ ట్రెండ్ ఎక్కువ అయిందని తెలిపింది.

నిపుణులు ఏమంటున్నారు..?

డేటింగ్, రిలేషన్షిప్ కన్సల్టెంట్ డా. కేథరీన్ దీనిపై మాట్లాడుతూ.. వ్యక్తులు తమ డేటింగ్ భాగస్వాములను ఎంచుకునే విధానంలో ఆశావాద దృక్పథం పెరిగిందని పేర్కొన్నారు. బ్లైండ్ డేటింగ్ యాప్‌లు అంటే.. ముందుగా ఎవరికి వారు.. వారి ఆలోచనలకు తగినట్లు ఉండటానికి ఇష్టపడతారు. అదేవిధంగా అలాంటి అవకాశం కావాలని నమ్ముతారు. కొన్నిసార్లు, మనం ఎవరితోనైనా శారీరకంగా ఆకర్షితులవ్వము.. కానీ మనం వారి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత, వారి పట్ల మన వైఖరి మారుతుంది.. అని కేథరీన్ వెల్లడించారు. అయినప్పటికీ బ్లైండీ డేటింగ్ యాప్‌లతో జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..