Telugu News » Health » Fig And Milk Benefits: anjeer for anemia and stomach problems Telugu Health Tips
Fig Benefits: అలాంటి వారికి వరం అంజీర్.. దీనితో కలిపి తీసుకుంటే ఆ సమస్యలన్నీ హాంఫట్..
Shaik Madarsaheb |
Updated on: Nov 10, 2022 | 6:33 AM
అంజీర్ పండ్లలో మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం వంటి ప్రయోజనకరమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది కాకుండా, ఫైబర్, ప్రోటీన్, యాంటీ-ఆక్సిడెంట్లు, విటమిన్లు A, B కాంప్లెక్స్ కూడా ఇందులో ఉంటాయి.
Anjeer Benefits
డ్రై ఫ్రూట్స్‌లో ఎన్నో పోషకాలు దాగున్నాయి. వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇంకా అనేక వ్యాధులను దూరం చేసుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, డ్రై ఫ్రూట్స్ ధర కారణంగా చాలామంది వీటిని తీసుకోరు. మీరు కూడా వీటిని కొనలేకపోతే అందుబాటు ధరలో ఉండే అత్తి పండ్లను తినవచ్చు.. డ్రై ఫ్రూట్స్‌లని పోషకాలన్నీ ఈ అంజీర్‌లో లభిస్తాయి. అంజీర్ పండ్లలో మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం వంటి ప్రయోజనకరమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది కాకుండా, ఫైబర్, ప్రోటీన్, యాంటీ-ఆక్సిడెంట్లు, విటమిన్లు A, B కాంప్లెక్స్ కూడా ఇందులో ఉంటాయి. అందుకే ప్రతిరోజూ ఉదయాన్నే లేదా రాత్రి నిద్రపోయే ముందు అంజీర్ (అత్తి పండు) ను తీసుకోవచ్చు. ఇంకా అంజీర్‌ను పాలలో కలిపి తీసుకుంటే.. దీనిలోని పోషకాలు డబుల్ అవుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. కావున అంజీర్ తినడం వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
అంజీర్ ఆరోగ్య ప్రయోజనాలు..
ఎవరైనా వ్యక్తి రక్తహీనతతో బాధపడుతుంటే పాలతో అంజీర్ పండ్లను తీసుకోవడం అతనికి ప్రయోజనకరంగా ఉంటుంది. అంజీర్ రక్తం నుంచి అనవసరమైన మూలకాలను ఫిల్టర్ చేయడానికి కూడా పని చేస్తుంది. ఇంకా రక్తాన్ని తయారు చేయడంలో బాగా సహాయపడుతుంది.
డయాబెటిస్‌తో బాధపడే రోగులకు అంజీర్‌పండ్లు వరం కంటే తక్కువ కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీని వినియోగం మధుమేహ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఎముకలు, దంతాలను బలోపేతం చేయడంతోపాటు శరీరంలో కాల్షియం లోపాన్ని అంజీర్ తీరుస్తుందని పేర్కొంటున్నారు.
అత్తి పండ్లలో ఉండే పొటాషియం, మెగ్నీషియం గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇంకా (రక్తపోటు) బిపిని మెయింటెయిన్ చేయడానికి పని చేస్తుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.
అత్తిపండ్లు ఫైబర్‌కి మంచి మూలం. ఎండిన అంజీర పండ్లను తినడం వల్ల పొట్టకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. మలబద్ధకం సమస్యకు అంజీర్ దివ్యౌషధం. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.. అజీర్తి, కడుపు ఉబ్బరం లాంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
నోట్: పైన తెలిపిన వివరాలు ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యం విషయంలో వైద్య నిపుణుల సూచనలు పాటించడమే ఉత్తమం.