Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Butterfly: సీతాకోక చిలుకలు కన్నీళ్లు తాగుతాయట.. కారణం ఏంటో తెలుసా..?

మొసలి, తాబేలు, జంతువుల కన్నీళ్లను కూడా తాగుతాయట. సాధారణంగా సీతాకోక చిలుకలు ఏమి తింటాయి..? అంటే.. పువ్వుల్లోని మకరందాన్ని తాగుతాయని ఠక్కున జవాబు ఇస్తాం.

Butterfly: సీతాకోక చిలుకలు కన్నీళ్లు తాగుతాయట.. కారణం ఏంటో తెలుసా..?
Butterflies
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 10, 2022 | 9:00 PM

ఏంటీ.. సీతాకోక కన్నీళ్లు తాగడమేంటని ఆలోచిస్తున్నారా..? అవును.. ఒక్క సీతాకోక చిలుకే కాదు.. మకరందాన్ని పీల్చే తేనెటీగలు కూడా ఇలానే చేస్తాయట. మొసలి, తాబేలు, జంతువుల కన్నీళ్లను కూడా తాగుతాయట. సాధారణంగా సీతాకోక చిలుకలు ఏమి తింటాయి..? అంటే.. పువ్వుల్లోని మకరందాన్ని తాగుతాయని ఠక్కున జవాబు ఇస్తాం. కానీ.. అమెజాన్ అడవుల్లోని ఉన్న సీతాకోక చిలుకలు మకరందాన్ని తినవట. అవి కన్నీళ్లను ఆహారంగా తాగతాయట. నమ్మశక్యంగా లేదు కదూ..! అయితే ఈ కింది వాటిని చదవండి..! మీకే తెలుస్తుంది.

ఓసారి అమెజాన్ అడవుల్లో ఒక శాస్త్రవేత్త పర్యటిస్తుండగా.. అతను కొన్ని సీతాకోక చిలుకలను పరిశీలించాడట. అవి మొసలి.. తాబేళ్ల కళ్ల నుంచి కన్నీళ్లను పీల్చడం గమనించాడట. ఇలా ఎందుకు పీలుస్తున్నాయని.. అనుమానంతో కొన్ని రోజుల పాటు పరిశోధన చేశాడట. ఎప్పుడూ మకరందాన్ని తాగే వీటికి లవణాలు అవసరం. ఉప్పులో ఉండే పోషక పదార్థాలతో ఇవి గుడ్లు పెట్టి.. వాటి జీవిత చక్రాన్ని సాఫీగా చేయగలవు.

కన్నీళ్లు ఉప్పగా ఉంటాయన్న పదం విన్నారా.. అవును.. నిజం.. మన కన్నీళ్లు కూడా ఉప్పగా ఉంటాయి. అందుకే అవి జంతువుల కన్నీళ్లు మాత్రమే కాదు.. వాటి మూత్రం, చెమట ఎక్కడ లవణాలుంటే అక్కడ ఈ మకరంద జీవులు వాలిపోతాయట. కేవలం సీతాకోక చిలుకలే కాదు.. తేనెటీగలు కూడా ఇలానే చేస్తాయట. మీకు ఒకవేళ డౌట్.. ఉంటే.. మీ చుట్టుపక్కల సీతాకోక చిలుకలను ఒకసారి గమనించండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..