Teaching: మనకూ ఇలాంటి టీచర్ ఉంటే ఎంత బాగుండు.. ఆ టాపిక్ కోసం ఏకంగా..

టీచింగ్ అనేది ఓ ఆర్ట్.. విద్యార్థులకు అర్థమయ్యేలా పాఠాలు చెప్పడం అంత ఈజీ కాదు. వారు అడిగే డౌట్స్ క్లారిఫై చేస్తూ విషయం అర్థమయ్యేలా చేయాలి. ఇందుకోసం టీచర్లు ర‌క‌ర‌కాలుగా ప్రయ‌త్నిస్తుంటారు. ఇక సైన్స్, సోషల్...

Teaching: మనకూ ఇలాంటి టీచర్ ఉంటే ఎంత బాగుండు.. ఆ టాపిక్ కోసం ఏకంగా..
Physics Teacher
Follow us
Ganesh Mudavath

|

Updated on: Nov 10, 2022 | 9:52 PM

టీచింగ్ అనేది ఓ ఆర్ట్.. విద్యార్థులకు అర్థమయ్యేలా పాఠాలు చెప్పడం అంత ఈజీ కాదు. వారు అడిగే డౌట్స్ క్లారిఫై చేస్తూ విషయం అర్థమయ్యేలా చేయాలి. ఇందుకోసం టీచర్లు ర‌క‌ర‌కాలుగా ప్రయ‌త్నిస్తుంటారు. ఇక సైన్స్, సోషల్ బోధించే సమయంలో ప్రయోగాలు చేయాల్సిన అవసరం వస్తుంది. అందుకోసం కొంద‌రు టీచ‌ర్లు త‌ర‌గ‌తినే ప్రయోగ‌శాల‌గా మార్చేస్తారు. పిల్లల ముందే ప్రయోగం చేసి.. పాఠం అర్థమయ్యేలా టీచ్ చేస్తారు. ఇలాంటి టీచర్లు చాలా మందే ఉన్నారు. వారి కోవకు చెందిన వారే ఈ ఫిజిక్స్ టీచ‌ర్. వ‌క్రీభ‌వ‌నం టాపిక్ గురించి విద్యార్థులకు చిన్న ప్రయోగం ద్వారా వివ‌రించారు. అందుకు క్లాస్ రూమ్ నే ల్యాబ్ గా మార్చేశారు. గాలి, గ్లాస్‌ ఈ రెండింటి వ‌క్రీభ‌వ‌నం గుణ‌కం వేరుగా ఉంటుంద‌ని చెప్పేందుకు కొన్ని పరికరాలను ఏర్పాటు చేసుకున్నారు. రెండు గాజు గ్లాస్‌లు, వంట‌నూనె డ‌బ్బా తీసుకొని క్లాస్‌రూమ్‌కి వెళ్లారు.

బ్లాక్ బోర్డ్ పై ప్రయోగానికి సంబంధించిన చిత్రాలు వేశారు. విద్యార్థులకు వ‌క్రీభ‌వ‌నం పాఠం చెప్పారు. ఆ త‌ర్వాత ఒక గ్లాస్‌లో ముప్పావు వంతు వ‌ర‌కు వంట‌నూనె పోశారు. గ్లాస్‌ను చేతితో ప‌ట్టుకుని పిల్లల‌కు చూపించారు. నూనె ఉన్న గ్లాస్ భాగం క‌నిపిస్తుందా? అని అడిగారు. పిల్లలు లేదని చెప్పారు. గ్లాస్‌, వంట‌నూనె వ‌క్రీభ‌వ‌న గుణ‌కం స‌మానంగా ఉండటం వల్ల గ్లాస్ పై భాగం కనిపించడం లేదని చెప్పారు.

ఇవి కూడా చదవండి

సాధారణంగా గాలి, గ్లాస్‌ వ‌క్రీభ‌వ‌న గుణ‌కం ఒకేలా ఉండ‌దు. అందుకే గాలితో నిండిన గ్లాస్ భాగం క‌నిపించిందని ఉపాధ్యాయుడు చెప్పారు. ఈ వీడియోను దీప‌క్ ప్రభు అనే యూజ‌ర్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను ట్విట్టర్‌లో 80 వేల మందికి పైగా చూశారు. వీడియో చూసిన నెటిజన్లు టీచర్ పాఠం చెప్పిన విధానాన్ని ప్రశంసిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!