Tummala Nageswara Rao: తుమ్మల పార్టీ మార్పుపై ఉహాగానాలు.. పార్టీలకు అతీతంగా కీలక సమావేశం

మాజీ మంత్రి, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కీలక నేత తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ అడుగులు ఎన్నో ఊహాగానాలకు, మరెన్నో ప్రచారాలకు తావిస్తోంది. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో ఉన్న ఆయన ఇటీవల సత్తుపల్లిలో టీడీపీ నేతలతో కలిసి ర్యాలీ, సభలో పాల్గొనడం కొత్త చర్చకు దారితీస్తోంది.

Tummala Nageswara Rao: తుమ్మల పార్టీ మార్పుపై ఉహాగానాలు.. పార్టీలకు అతీతంగా కీలక సమావేశం
Thummala Nageswara Rao
Follow us

|

Updated on: Nov 10, 2022 | 1:50 PM

పొలిటికల్‌గా ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఇవాళ ములుగు జిల్లా వాజేడులో తుమ్మల కీలక సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీతో సంబంధం లేకుండా అనుచరులతో మీటింగ్‌ పెట్టారు. దీంతో తుమ్మల ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు? రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకుంటారా? అనే చర్చ నడుస్తోంది. అవును మాజీ మంత్రి, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కీలక నేత తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ అడుగులు ఎన్నో ఊహాగానాలకు, మరెన్నో ప్రచారాలకు తావిస్తోంది. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో ఉన్న ఆయన ఇటీవల సత్తుపల్లిలో టీడీపీ నేతలతో కలిసి ర్యాలీ, సభలో పాల్గొనడం కొత్త చర్చకు దారితీస్తోంది. తాజాగా ములుగు జిల్లా వాజేడులో తుమ్మల ఆత్మీయ సమ్మేళనం పెట్టడం ఆసక్తిగా మారింది.

పార్టీతో సంబంధం లేకుండా తన అనుచరులతో ఆత్మీయ సమ్మేళనం పెట్టారు తుమ్మల నాగేశ్వరరావు. దీంతో రాజకీయ భవిష్యత్తుపై ఏమైనా చర్చలు జరుపుతున్నారా అనే చర్చ జరుగుతోంది. తనకు ప్రాధాన్యత లేదని ఎప్పటి నుంచో అసంతృప్తితో ఉన్నారు తుమ్మల. పైగా పార్టీలో గ్రూపుల గోల మరింత రచ్చకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలో వరుసగా తుమ్మల వేస్తున్న రాజకీయ అడుగులు కొత్త కొత్త ఊహాగానాలకు తావిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరోవైపు వాజేడులో తుమ్మల పర్యటన ఉత్కంఠ రేపుతోంది. నిన్న వాజేడు ప్రాంతంలో ఇన్‌ఫార్మర్‌ పేరుతో గోపాల్‌ అనే వ్యక్తిని మావోయిస్టులు హత్య చేశారు. ఆ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉండటంతో మాజీ మంత్రి పర్యటనకు పోలీసులు అనుమతి ఇస్తారా? లేదా? అనేది ఆసక్తిగా మారింది. నిన్నటి ఘటన నేపథ్యంలో వాజేడులో భారీ భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..