AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: ఏపీ, తెలంగాణలో పీఎం మోదీ టూర్ షెడ్యూల్ ఇదే.. రెండు రాష్ట్రాల్లో మొదలైన నిరసన సెగలు..

తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన రాజకీయ రచ్చకు దారి తీసింది. ఈ నెల 11,12 తేదీల్లో విశాఖలో పలు కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్నారు ప్రధాని. 12వ తేదీన రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించేందుకు తెలంగాణకు వస్తున్నారు

PM Modi: ఏపీ, తెలంగాణలో పీఎం మోదీ టూర్ షెడ్యూల్ ఇదే.. రెండు రాష్ట్రాల్లో మొదలైన నిరసన సెగలు..
PM Modi
Sanjay Kasula
|

Updated on: Nov 10, 2022 | 8:57 AM

Share

తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన రాజకీయ రచ్చకు దారి తీసింది. ఈ నెల 11,12 తేదీల్లో విశాఖలో పలు కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్నారు ప్రధాని. 12వ తేదీన రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించేందుకు తెలంగాణకు వస్తున్నారు. తెలంగాణకు వస్తున్న పీఎం మోదీకి 8 డిమాండ్లతో బహిరంగ లేఖ రాశారు తెలంగాణ మేధావులు. విభజన చట్టంలో హామీలను నెరవేర్చాలని, తెలంగాణ పట్ల వివక్ష పూరిత ధోరణి విడనాడాలని కోరారు. మతతత్వ ధోరణి వీడి, దేశ ఐక్యతను కాపాడేలా పాలించాలన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

తెలంగాణలో నిరసనలు..

శనివారం ప్రధాని రాక సందర్భంగా రామగుండంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికితోడు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం కోసం ప్రధాని పర్యటనను వ్యతికేకిస్తోంది టీఆర్‌ఎస్‌. మోదీ పర్యటనకు నిరసనగా సింగరేణి కార్మికుల ఆందోళన నిర్వహిస్తున్నారు. మోదీ గో బ్యాక్‌ అంటూ నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపేందుకు రెడీ అవుతున్నారు. శుక్రారం, శనివారం సింగరేణిలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రామగుండం, శ్రీరాంపూర్‌, మందమర్రిలో నిరసనలు చేస్తున్నారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణపై కార్మికులు ఆందోళన బాట పట్టనున్నారు. మరోవైపు ఈనెల 12 ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా నిరసన తెలపాలని తెలంగాణ యూనివర్సిటీస్‌ జేఏసీ తీర్మానించింది. ఆ రోజు అన్ని విశ్వవిద్యాలయాల్లో నల్లజెండాలతో ఆందోళన చేపట్టనున్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీని నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణలో ఎలా అడుగుపెడుతారని టీఆర్ఎస్ విద్యార్థి విభాగం ప్రశ్నించింది.

పోలీస్‌ వలయంలో విశాఖ నగరం

మరో వైపు పోలీస్‌ వలయంలా మారింది విశాఖ నగరం. ప్రధాని మోదీ పర్యటన నేపధ్యంలో నిరసనలు తీవ్ర రూపం దాల్చడంతో.. విశాఖ నగరంలో హై టెన్షన్‌ నెలకొంది. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉక్కు కార్మికులు, వామపక్ష పార్టీలు చేపట్టిన ర్యాలీపై పోలీసులు ఆంక్షలు విధించారు.. అయితే అనుమతి లేదంటూ కార్మికులను అదుపులోకి తీసుకొని పోలీస్‌ స్టేషన్లకు తరలిస్తున్నారు.

ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాల పర్యటన షెడ్యూల్ ఇలా..

ఈ నెల 12న ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు బుధవారం ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) అధికారికంగా వివరాలు వెల్లడించింది. 12న ఏపీలోని విశాఖపట్నంలో పలు కార్యక్రమాల్లో పాల్గొని రామగుండానికి ప్రధాని చేరుకుంటారు. మధ్యాహ్నం 3.30 గంటలకు రామగుండం ఎరువులు, రసాయనాల పరిశ్రమ (ఆర్‌ఎ్‌ఫసీఎల్‌)ను ప్రారంభిస్తారని పీఎంఓ తెలిపింది. ఆ తర్వాత సాయంత్రం 4.15 గంటలకు పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారని పేర్కొంది. రామగుండంలో ఆర్‌ఎ్‌ఫసీఎల్‌తో సహా మొత్తం రూ.9,500 కోట్ల విలువైన ప్రాజెక్టులను జాతికి అంకితం, శంకుస్థాపనలు చేస్తారని తెలిపింది. ఇందులో భాగంగా రూ.వెయ్యి కోట్లతో నిర్మించిన భద్రాచలం రోడ్డు-సత్తుపల్లి రైల్వే లైనును జాతికి అంకితం చేస్తారని పేర్కొంది. రూ.2,200 కోట్లతో చేపట్టనున్న జాతీయ రహదారి 765డీజీపై మెదక్‌-సిద్దిపేట-ఎల్కతుర్తి సెక్షన్‌, ఎన్‌హెచ్‌-161బీబీపై బోధన్‌-బాసర-భైంసా సెక్షన్‌, ఎన్‌హెచ్‌-353సీపై సిరొంచా-మహదేవ్‌పూర్‌ సెక్షన్‌ రోడ్డు పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారని పేర్కొంది. ఈ జాతీయ రహదారుల విస్తరణకు పనుల శంకుస్థాపనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన విజ్ఞప్తికి పీఎంఓ ఆమోదం తెలిపింది. శంకుస్థాపన అనంతరం బీజేపీ నిర్వహించే బహిరంగ సభలో మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు. ఇదిలావుంటే.. కాగా 2016 ఆగస్టు 7న ఆర్‌ఎ్‌ఫసీఎల్‌ పునరుద్ధరణకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేసినట్లు పీఎంఓ గుర్తు చేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

Follow Us
కర్ణాటక కాంగ్రెస్‌లో ముసలం.. మంత్రి పదవికి రామలింగారెడ్డి రాజీనామా
కర్ణాటక కాంగ్రెస్‌లో ముసలం.. మంత్రి పదవికి రామలింగారెడ్డి రాజీనామా
సీబీఎస్ఈ రీవాల్యుయేషన్‌కు వెల్లువలా దరఖాస్తులు! బిగ్ సైబర్ దాడి..
సీబీఎస్ఈ రీవాల్యుయేషన్‌కు వెల్లువలా దరఖాస్తులు! బిగ్ సైబర్ దాడి..
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ‘బాంబ్రోలిస్తాన్’.. అసలు స్టోరీ ఇదే..!
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ‘బాంబ్రోలిస్తాన్’.. అసలు స్టోరీ ఇదే..!
హైదరాబాద్‌లో ఎబోలా కలకలం.. రెండు అనుమానిత కేసులు!
హైదరాబాద్‌లో ఎబోలా కలకలం.. రెండు అనుమానిత కేసులు!
పైల్స్ తో బాధపడేవారికి ఇది దివ్య ఔషధం..
పైల్స్ తో బాధపడేవారికి ఇది దివ్య ఔషధం..
60 ఏళ్ల వయసులో మూడో పెళ్లి.. 14 ఏళ్ల చిన్న అమ్మాయితో స్టార్ హీరో
60 ఏళ్ల వయసులో మూడో పెళ్లి.. 14 ఏళ్ల చిన్న అమ్మాయితో స్టార్ హీరో
అందుకే కోహ్లీకి ఇండియాలో ఉండటం ఇష్టంలేదు: లివింగ్‌స్టోన్
అందుకే కోహ్లీకి ఇండియాలో ఉండటం ఇష్టంలేదు: లివింగ్‌స్టోన్
సింగపూర్ నుంచి కన్నవారిని చూసేందుకు వస్తే.. విధి ఆడిన వింత నాటకం
సింగపూర్ నుంచి కన్నవారిని చూసేందుకు వస్తే.. విధి ఆడిన వింత నాటకం
తుపాకీ వదిలి పుస్తకం పట్టి.. 60 ఏళ్ల వయసులో లాసెట్‌లో అదరగొట్టిన
తుపాకీ వదిలి పుస్తకం పట్టి.. 60 ఏళ్ల వయసులో లాసెట్‌లో అదరగొట్టిన
Viral Video: మద్యం మత్తులో ఫారెనర్ యవ్వారం మాములుగా లేదుగా..
Viral Video: మద్యం మత్తులో ఫారెనర్ యవ్వారం మాములుగా లేదుగా..