ED Raids: తెలంగాణలో దూకుడు పెంచిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. 30 ఈడీ బృందాలు 9 గ్రానైట్ కంపెనీలపై దాడులు
మంత్రి గంగుల కమలాకర్ ఇంటిపైనా, ఆయన సోదరుడు, బంధువుల ఇళ్ళపైనా నిన్న ఈడీ మెరుపుదాడులు నిర్వహించాయి. గ్రానైట్ ఎక్స్‌పోర్ట్‌లో అక్రమాలు, పన్నుల ఎగవేత, అక్రమ తవ్వకాలపై అందిన ఫిర్యాదుల మేరకు..
తెలంగాణలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు దడపుట్టిస్తున్నాయి. మైనింగ్‌లో అవినీతి, అక్రమాలపై ఆరోపణల నేపథ్యంలో మంత్రి గంగుల కమలాకర్ ఇంటిపైనా, ఆయన సోదరుడు, బంధువుల ఇళ్ళపైనా నిన్న ఈడీ మెరుపుదాడులు నిర్వహించాయి. గ్రానైట్ ఎక్స్‌పోర్ట్‌లో అక్రమాలు, పన్నుల ఎగవేత, అక్రమ తవ్వకాలపై అందిన ఫిర్యాదుల మేరకు ఐటీ శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎటాక్స్ తెలంగాణలో కలకలం రేపాయి. 2011-13 మధ్యకాలంలో గ్రానైట్ అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు వచ్చినట్టు ఈడీ వెల్లడించింది. ప్రభుత్వానికి 750 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఈడీకి కంప్లైంట్ అందింది. దీంతో తెలంగాణలో మోహరించిన 30 ఈడీ బృందాలు 9 గ్రానైట్ కంపెనీలపై నిన్న హఠాత్తుగా ఎటాక్ చేశాయి. విదేశాలకు అక్రమ ఎగుమతులు, పరిమితికి మించి మైనింగ్ తవ్వకాలే ఈ దాడులకు కారణంగా భావిస్తున్నారు.
30 ఈడీ బృందాలు 9 గ్రానైట్ కంపెనీలపై దాడులు
- శ్వేత ఏజెన్సీస్-కరీంనగర్
- ఏఎస్.షిప్పింగ్, కరీంనగర్
- జేఎం బాక్సిఅండ్ కంపెనీ, కరీంనగర్
- కెవికె ఎనర్జీ, కరీంనగర్
- అరవింద్ గ్రానైట్స్, కరీంనగర్
- సంధ్య ఏజెన్సీస్, కరీంనగర్
- పిఎస్‌ఆర్ ఏజెన్సీస్, కరీంనగర్
- శ్రీ వెంకటేశ్వర గ్రానైట్స్, వెంకటేశ్వర లాజిస్టిక్స్, కరీంనగర్
కరీంనగర్, హైదరాబాద్‌లలో జరిపిన ఈడీ దాడుల్లో శ్వేతా ఏజెన్సీ, AS UY షిప్పింగ్, JM బాక్సీ, మైథిలీ ఆదిత్య ట్రాన్స్‌పోర్ట్, అరవింద్ గ్రానైట్స్ లాంటి 9 కంపెనీలున్నాయి. మైనింగ్ శాఖ నుంచి పొందిన అనుమతులకు మించి తవ్వకాలు జరిపినట్టు ఈ గ్రానైట్ కంపెనీలపై ఆరోపణలు వచ్చాయి. మైనింగ్ అక్రమాలపై ఆరాతీసిన దర్యాప్తు సంస్ధలు.. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నాయి.
ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినట్లు సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేసింది. గ్రానైట్ విదేశీ అక్రమ రవాణాపై ఈడీ నిజాలు నిగ్గుతేల్చేందుకు సిద్ధమౌతోంది. పలు కంపెనీలకు ఈడీ, ఐటీ శాఖలు బుధవారం నోటీసులు జారీచేశాయి. అయితే ఈడీ దాడులపై స్పందించిన మంత్రి గంగుల కమలాకర్ ఈడీ అధికారులకు పూర్తిగా సహకరిస్తామన్నారు. సోదాల విషయం తెలియగానే దుబాయ్ నుంచి వచ్చానన్నారు. తొలి నుంచి గ్రానైట్ వ్యాపారంలో ఉన్నామని, అక్రమాలు జరిగి ఉంటే బయటపెట్టాలని సవాల్ చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం