Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Liver Health: రోజూ ఇలా చేస్తే లివర్ ప్రమాదంలో పడినట్లే.. ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోండి..

ప్రస్తుత కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు మనందరినీ చుట్టుముడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, మంచి జీవనశైలిని అవలంభించడం చాలా ముఖ్యం.

Liver Health: రోజూ ఇలా చేస్తే లివర్ ప్రమాదంలో పడినట్లే.. ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోండి..
Healthy Liver
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 11, 2022 | 6:32 AM

ప్రస్తుత కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు మనందరినీ చుట్టుముడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, మంచి జీవనశైలిని అవలంభించడం చాలా ముఖ్యం. లేకపోతే.. శరీరంలోని పలు కీలక భాగాలకు అనారోగ్య సమస్యలు చుట్టుముడుతాయని హెచ్చరిస్తున్నారు. అయితే, కాలేయం మన శరీరంలో చాలా ముఖ్యమైన భాగం. శరీరంలోని టాక్సిన్‌లను తొలగించి విటమిన్‌లను నిల్వ ఉంచడం ద్వారా మూలకాలను శక్తిగా మారుస్తుంది. అటువంటి పరిస్థితిలో ఏదైనా అసంపూర్ణ కార్యాచరణ పెరిగితే అది కాలేయ సమతుల్యతను దెబ్బతీస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ తమ కాలేయాన్ని బాగా చూసుకోవాలి.. మరోవైపు మీరు ఇప్పటికే కాలేయంలో అసమతుల్యతతో బాధపడుతున్నట్లయితే.. మీరు కొన్ని పదార్థాలకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఇలాంటిపరిస్థితుల్లో కాలేయాన్ని ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే.. వీటికి దూరంగా ఉండండి

ఉప్పుకు దూరంగా ఉండండి..

ఉప్పు ఎక్కువ తీసుకోవడం కాలేయానికి అస్సలు మంచిది కాదు. ఇలాంటి పరిస్థితుల్లో కాలేయం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకునే దాని కంటే.. చాలా తక్కువ ఉప్పు తినాలని సూచిస్తున్నారు.

సరిపడా నిద్ర పోకపోవడం..

ఈ రోజుల్లో చాలా మందికి రాత్రిపూట తగినంత నిద్రపోవడం లేదు. ఇంకా కొందరు నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఇలా చేయడం శరీరానికి మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఇది కాలేయంపై ప్రభావం చూపుతుందని పేర్కొంటున్నారు. తగినంత నిద్ర లేకపోతే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. మీకు తగినంత నిద్ర లేకపోతే అది కాలేయానికి ఆక్సీకరణ ఒత్తిడిని కలిగిస్తుంది. కావున కాలేయం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత నిద్ర పోవడం ముఖ్యమని పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

మద్యం తాగడం..

ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బతింటుంది. ఎందుకంటే అధిక మొత్తంలో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీరం నుంచి విషాన్ని తొలగించే కాలేయ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. కావున మెరుగైన ఆరోగ్యం కోసం మద్యపానానికి దూరంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించేముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం

మరిన్ని హెల్త్ వార్తల కోసం..