Winter Health Tips: చలికాలం వచ్చేసింది జాగ్రత్త సుమీ.. ఇలాంటి చిన్న పొరపాట్లు మరణానికి దారితీస్తాయట..

చలికాలంలో మనం ఆరోగ్యం విషయంలో ఎలాంటి అశ్రద్ధ చేయకపోయినా అనేక వ్యాధులు చుట్టుముడుతూనే ఉంటాయి. దీనికి ప్రధాన కారణం శీతలగాలులు, వాతావరణంలో మార్పులు..

Winter Health Tips: చలికాలం వచ్చేసింది జాగ్రత్త సుమీ.. ఇలాంటి చిన్న పొరపాట్లు మరణానికి దారితీస్తాయట..
Winter Health Tips
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 11, 2022 | 6:09 AM

చలికాలంలో మనం ఆరోగ్యం విషయంలో ఎలాంటి అశ్రద్ధ చేయకపోయినా అనేక వ్యాధులు చుట్టుముడుతూనే ఉంటాయి. దీనికి ప్రధాన కారణం శీతలగాలులు, వాతావరణంలో మార్పులు.. శీతాకాలంలో జలుబు-దగ్గు, ఫ్లూ వంటి అనేక వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. ఇంకా చలికాలంలో వచ్చే సమస్యల్లో అత్యంత ప్రమాదకరమైనది గుండెపోటు. చలికాలంలో గుండెపోటు వచ్చే ప్రమాదం చాలారేట్లు పెరుగుతుందని పలు అధ్యయనాల్లో తేలింది. అందువల్ల, గుండె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఈ రోజు మేము మీకు గుండెపోటును నివారించడానికి పలు మార్గాలను చెప్పబోతున్నాము. దీని ద్వారా గుండె ఆరోగ్యాన్ని బలోపేతం చేసుకోవచ్చు. ఇంకా గుండెపోటు ప్రమాదాన్ని కూడా నివారించవచ్చు. ఆ మార్గాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

గుండెపోటు ప్రమాదం..

గుండెపోటు ప్రమాదం ఎక్కువగా ఉన్న ఎవరైనా శీతాకాలంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.. యూరోపియన్ జర్నల్ ఆఫ్ ఎపిడెమియాలజీలో ప్రచురించిన పరిశోధన ప్రకారం.. అధిక బరువు లేదా ఊబకాయం, అధిక రక్తపోటు ఉన్నవారికి గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

రక్తపోటు..

చలికాలంలో మన రక్తనాళాలు కుంచించుకుపోవడం వల్ల ఒత్తిడి పెరిగి రక్తపోటు కూడా పెరగడం మొదలవుతుంది. బీపీ పెరిగే కొద్దీ గుండెపోటు కేసులు వెలుగులోకి రావడం మొదలవుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. శీతాకాలంలో ప్రజల శరీరంలో రక్తం గడ్డకట్టడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా గుండెపోటు అవకాశాలు కూడా పెరుగుతాయి.

ఇవి కూడా చదవండి

చల్లని వాతావరణంలో ఉదయం పూట గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. శీతాకాలంలో ఉదయం ఉష్ణోగ్రత తగ్గుదల కారణంగా, శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. దీని కారణంగా శరీర ఉష్ణోగ్రతను సమం చేస్తున్నప్పుడు శరీరంలో రక్తపోటు పెరిగి గుండెపోటుకు దారితీయవచ్చు.

గుండె ఆరోగ్యాన్ని ఇలా జాగ్రత్తగా చూసుకోండి..

  • చలికాలంలో ఉదయం 6 నుండి 7 గంటల మధ్య నడకకు వెళ్లవద్దు. ఉదయం 9 గంటల తర్వాత నడకకు వెళ్లండి.
  • ఉప్పు తక్కువగా తినండి.
  • ఎక్కువ సేపు ఎండలో (సూర్య కిరణాలు) గడపండి.
  • రోజూ కొంతసేపు వ్యాయామం చేయండి.
  • ఆహారంపై నియంత్రణ కలిగి ఉండండి. వేయించిన, తీపి ఆహారాన్ని నివారించండి.
  • వేచ్చగా ఉండే దుస్తులు ధరించండి. శీతాకాలంలో మిమ్మల్ని మీరు కవర్ చేసుకోవడం చాలా ముఖ్యం.
  • రక్తపోటును క్రమం తప్పకుండా తనిఖీ చేయడం ముఖ్యం. అధిక బీపీ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..