AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: అందరూ ప్రమాదం అనే భావించారు.. కట్ చేస్తే సీసీ కెమెరాలో షాకింగ్ సీన్స్.. అసలు నిజం బయటపడ్డ వైనం..

అప్పటి వరకు స్ట్రైట్‌గా వెళ్తున్న కంటెయినర్.. ఒక్కసారిగా పక్కకు తిరిగింది. పక్కనే వాహన తనిఖీలు చేస్తున్న అధికారుల మీదకు దూసుకెళ్లింది.

Andhra Pradesh: అందరూ ప్రమాదం అనే భావించారు.. కట్ చేస్తే సీసీ కెమెరాలో షాకింగ్ సీన్స్.. అసలు నిజం బయటపడ్డ వైనం..
Cc Camera
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 11, 2022 | 10:07 PM

అప్పటి వరకు స్ట్రైట్‌గా వెళ్తున్న కంటెయినర్.. ఒక్కసారిగా పక్కకు తిరిగింది. పక్కనే వాహన తనిఖీలు చేస్తున్న అధికారుల మీదకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో కీలక అధికారి తృటిలో ప్రాణాపాయం నుంచి బయట పడినా.. ఆ అధికారి పీఏ మాత్రం ప్రాణాలు కోల్పోయారు. అయితే, తొలుత ఇది ప్రమాదమనే భావించారు అందరు. కానీ, సీసీ కెమెరా ఫుటేజీని చూస్తే తెలిసింది అసలు నిజం.

ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మోటార్ వెహికిల్ ఇన్స్‌పెక్టర్ శ్రీనివాసరావు తన సిబ్బందితో కలిసి.. లక్ష్మీపురం టోల్‌గేట్ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఆసమయంలో ఓ అటుగా వచ్చిన కంటెయినర్.. ఒక్కసారిగా వాళ్ల మీదకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో శ్రీనివాసరావు తృటిలో తప్పించుకోగలిగారు. కానీ ఆయన వ్యక్తిగత సలహాదారు శ్యామలరావు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన వెంటనే అలర్ట్ అయిన పోలీసులు.. క౦టైనర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మద్యం మైక౦లో ప్రమాదం చేసి ఉండొచ్చని తొలుత అనుమానించారు.

అయితే, ప్రమాదానికి సంబంధించి సీసీకెమెరా విజువల్స్ చూస్తే అసలు నిజం బయటపడింది. సీసీఫుటేజీ చూసిన పోలీసులు.. ట్రక్కు డ్రైవర్ కావాలనే ఎంపీఐ, అతని సిబ్బందిపై ట్రక్కు పోనిచ్చాడని నిర్ధారించుకున్నాడు. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిపై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఇలా ఎందుకు చేశాడనే దానిపై ఆరా తీస్తున్నారు.

ఇవి కూడా చదవండి

చిత్తూరు జిల్లాలో మరో ప్రమాదం..

చిత్తూరు జిల్లా ఐరాల మండలం కాణిపాకంపట్నం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి – బెంగళూరు 6లేన్స్ రోడ్డులో పాల ట్యాంకర్‌ను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పాల ట్యాంకర్‌ను ఓవర్టేక్ చేయబోయి వెనుక వైపు నుంచి కారు ఢీకొట్టింది. కారు నుజ్జు నుజ్జయింది. మృతదేహాలు కారులోనే చిక్కుకుపోయి.. మాంసపు ముద్దలుగా మారాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సహాయక చర్యలను ప్రారంభించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..