One Side Love: కుక్క వన్‌సైడ్ లవ్.. ఆ పిల్లి చూడగానే తెగ సిగ్గుపడిపోయింది.. వీడియో చూస్తే ఫిదా అయిపోతారు..!

వన్ సైడ్ లవ్.. ఆ ఫీలింగే వేరప్ప. టూ సైడ్ లవ్ కంటే కూడా అద్భుతమైన ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. ప్రేమించిన ప్రేయసికి తెలియకుండానే..

One Side Love: కుక్క వన్‌సైడ్ లవ్.. ఆ పిల్లి చూడగానే తెగ సిగ్గుపడిపోయింది.. వీడియో చూస్తే ఫిదా అయిపోతారు..!
Dog Love
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 11, 2022 | 6:19 PM

వన్ సైడ్ లవ్.. ఆ ఫీలింగే వేరప్ప. టూ సైడ్ లవ్ కంటే కూడా అద్భుతమైన ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. ప్రేమించిన ప్రేయసికి తెలియకుండానే ఆమె చుట్టూ తిరుగుతూ ఉంటే కలిగే ఆనందమే వేరు అని అంటుంటారు వన్ సైడ్ ప్రేమికులు. ప్రియురాలిని ఫాలో అవుతుంటే.. ఆమె ఓరకంట ఓ లుక్కేస్తే.. అప్పుడు ఆ అబ్బాయి ఫీలింగ్ మాటల్లో చెప్పలేం. అయితే, ఈ లవ్ మనుషుల్లోనే కాదండోయ్.. జంతువుల్లోనూ పుడుతుంది. తాజాగా ఇందుకు సంబంధించిన ఓ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఓ పిల్లి రోడ్డుపై నడుచుకుంటూ తన దారిన తాను వెళ్తుంది. అయితే, జాతి బేదం మరిచి ఆ పిల్లిని ప్రేమించింది ఓ కుక్క. ఇంకేముంది. ఆ పిల్లిని రోజూ ఫాలో అవడం పనిగా పెట్టుకుంది కుక్క. పాపం ఆ కుక్క ఇప్పటికీ వన్ సైడ్ లవ్‌లో ఉన్నట్లుంది. పిల్లిని ఫాలో అవుతూ తెగ సంబరపడిపోతుంది. అయితే, కుక్క తనను ఫాలో అవుతున్న విషయం ఆ పిల్లికి కూడా తెలుసు. ఎలాగూ తెలిసిన ముచ్చటేగా అనుకుందో ఏమో గానీ.. ఆ కుక్క, పిల్లిని ఫాలో అవుతూనే ఉంది. అయితే, కొందరు వీటి ప్రేమాయణాన్ని వీడియో తీశారు. ఈ వీడియోలో కుక్క పిల్లిని ఫాలో అవుతుంది. అది గమనించిన పిల్లి వెంటనే వెనక్కి తిరిగి చూస్తుంది. ఇంకేముంది.. అచ్చం మనుషుల మాదిరిగా తనకేమీ తెలియదన్నట్లుగా కుక్క అమాయకపు మొహం పెట్టుకుని, అటూ ఇటూ బిత్తర చూపులు చూస్తోంది. మళ్లీ పిల్లి తనదారిన తాను వెళ్తుండగా.. కుక్క ఫాలో అవడం మొదలు పెడుతుంది. ఇలా సేమ్ సీన్‌ను ఆ వీడియోలో చూడొచ్చు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. కుక్క వన్ సైడ్ లవ్‌కు సపోర్ట్ చేస్తూ రకరకాల ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. మరెందుకు ఆలస్యం.. ఈ ఫన్నీ వీడియోను మీరూ చూసేయండి.

కుక్క వన్ సైడ్ లవ్ స్టోరీ ఈ వీడియోలో చూడొచ్చు..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?