Watch Video: మురుగు నీటి పైపులో నుంచి బిగ్గరగా అరుపులు.. రంగంలోకి దిగిన అధికారులకు..
సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. ఇలా ట్రెండింగ్‌లో నిలిచే కొన్ని వీడియోలు మనల్ని అబ్బురపరుస్తుంటే మరికొన్ని మాత్రం భయాందోళనకు గురి చేస్తుంటాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియోనే సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రష్యాలోని పీటర్స్‌బర్గ్‌లో..
సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. ఇలా ట్రెండింగ్‌లో నిలిచే కొన్ని వీడియోలు మనల్ని అబ్బురపరుస్తుంటే మరికొన్ని మాత్రం భయాందోళనకు గురి చేస్తుంటాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియోనే సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రష్యాలోని పీటర్స్‌బర్గ్‌లో జరిగిన ఓ సంఘటన తాలుకూ వైరల్ వీడియో నెటిజన్లు ఉలిక్కిపడేలా చేసింది. ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే..
రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ఉన్న పుల్కోవో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న మురుగు నీటి పైపును శుభ్రం చేయడానికి ఓ కార్మికుడు రంగంలోకి దిగాడు. అయితే యంత్రాలతో శుభ్రం చేయడం ఇబ్బంది అవుతుందన్న కారణంతో పైపులోకి నేరుగా తానే వెళ్లాడు. అయితే కొంత దూరం వెళ్లిన తర్వాత అందులోనే ఇరుక్కుపోయాడు. వెనక్కి రాలేని, ముందుకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. పైపులో ఇరుక్కుపోయిన వ్యక్తి ఒక్కసారిగా అరుపులు పెట్టడం ప్రారంభించాడు. దీంతో అధికారులు వెంటనే రంగంలోకి దిగారు.
?Russian fecal trap. Typical russia. In the temporarily russian-occupied St. Petersburg, a man tried to ferret through a sewage pipe.
This happened at Pulkovo airport. The man took off everything and climbed into the sewer pipe. I guess he was going home ?♂️ pic.twitter.com/EdqdLFpGXS
— NAFO Warrior ??? (@NAFOWarriorz) November 10, 2022
కార్మికుడిని పైపులో నుంచి సురక్షితంగా తీసుకురావడానికి అధికారులు ఏకంగా రోడ్డును తవ్వారు. పైపును నెమ్మదిగా కటర్స్‌తో కట్ చేసి ఓపెన్ చేశారు. అప్పటికే బతుకు జీవుడా అన్నట్లు సరిగ్గా గాలి అందక ఇబ్బంది పడుతున్న ఆ కార్మికుడిని బయటకు తీశారు. అధికారులు సమయానికి స్పందించి, సమయస్ఫూర్తిగా వ్యవహరించడంతో కార్మికుడికి ఎలాంటి ప్రమాదం జరగకుండా బయటపడగలిగాడు. కార్మికుడిని పైపులో నుంచి తీస్తున్న సమయంలో తీసిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..