Car Stunt: కదులుతున్న కారు పై హీరోయిన్ రేంజ్‌లో ఫోజులిచ్చింది.. కానీ అదే కొంపముంచింది..
అలా చేసి కొంతమంది ప్రాణాలమీదకు తెచ్చుకుంటే ఇంకొందరు పోలీసులకు చిక్కి చిక్కుల్లో పడ్డారు. తాజాగా ఓ యువతీ కూడా అదే పని చేసింది.
ఈ మధ్య చాలా మందికి సోషల్ మీడియాలో సెలబ్రెటీ అయ్యిపోవాలనే పిచ్చి పట్టింది. ఇన్స్టెంట్ గా పాపులర్ అవ్వాలని పిచ్చి పిచ్చి స్టంట్ చేస్తున్నారు. అలా చేసి కొంతమంది ప్రాణాలమీదకు తెచ్చుకుంటే.. ఇంకొందరు పోలీసులకు చిక్కి చిక్కుల్లో పడ్డారు. తాజాగా ఓ యువతి కూడా అదే పని చేసింది. సాహసాలు చేయడం కొన్ని సార్లు సరదాగా అనిపిస్తుంది. కానీ అది మితిమీరితే ఇదిగో ఇలానే ఉంటుంది. తాజాగా ఓ యువతి కదులుతున్న కారు పై హీరోయిన్ రేంజ్ లో ఫోజులిచ్చింది. అదే ఆమె కొంపముంచింది.
కదులుతున్న కారు బానెట్ పై వయ్యారంగా పడుకొని ఫోజులిచ్చింది ఓ యువతి. ఈ వీడియోను సోషల్ మీడియాలో కూడా షేర్ చేసిందట. అనుకున్నట్టే ఈవీడియో వైరల్ అయ్యింది. భారీగా లైకులు , కామెంట్లు కూడా వచ్చాయి. అలాగే పోలీసులు కూడా సీన్‌లోకి ఎంటర్ అయ్యారు.
ఈ సంఘటన నోయిడాలో జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు. ఆ యువతిని ఆమె స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు. కారును సీజ్ చేసి విచారణ జరుపుతున్నారు. ఈ విషయం పై పోలీసులు సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై నోయిడా పోలీసులు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
नोएडा में स्कॉर्पियो की बोनट पर बैठ कर स्टंट दिखा रही युवती का वीडियो वायरल हुआ है। वायरल वीडियो पर पुलिस ने एक्शन लेते हुए कार को जब्त कर लिया है।#Noida #Scorpio #viralvideo pic.twitter.com/foeWjfhiMo
— Akash Savita (@AkashSa57363793) November 9, 2022
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి