Bihar: బల్లి పడిందని చెప్పినా వినలేదు.. ఆ ఆహారాన్నే బలవంతంగా తినిపించారు.. కట్ చేస్తే..

సార్.. ఆ పదార్థాల్లో బల్లి పడింది. మేము తినలేమని చెప్పినా వారు వినలేదు. అదే ఆహారాన్ని తినాలని బలవంతం చేశారు. దీంతో చేసేదేమీ లేక ఆ స్టూడెంట్స్ అదే ఆహారాన్ని తిన్నారు. చివరకు 200మంది విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు....

Bihar: బల్లి పడిందని చెప్పినా వినలేదు.. ఆ ఆహారాన్నే బలవంతంగా తినిపించారు.. కట్ చేస్తే..
Mid Day Meal In Bihar
Follow us
Ganesh Mudavath

|

Updated on: Nov 11, 2022 | 5:26 PM

సార్.. ఆ పదార్థాల్లో బల్లి పడింది. మేము తినలేమని చెప్పినా వారు వినలేదు. అదే ఆహారాన్ని తినాలని బలవంతం చేశారు. దీంతో చేసేదేమీ లేక ఆ స్టూడెంట్స్ అదే ఆహారాన్ని తిన్నారు. చివరకు 200మంది విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. బిహార్ లో ఘోర దుర్ఘటన జరిగింది. భాగల్ పూర్ లోని ఓ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దాదాపు 200 మంది విద్యార్థులకు వాంతులు, విరేచనాలు కావడంతో అనారోగ్యానికి గురయ్యారు. అయితే ఈ భోజనంలో బల్లి పడినట్లు విద్యార్థులు చెబుతున్నారు. బల్లి పడిందని చెప్పినా.. వినకుండా ఇదే ఆహారాన్ని వడ్డించారని, దీంతో అస్వస్థతకు గురైనట్లు భోజనం చేసిన కొందరు విద్యార్థులు తెలిపారు. మధ్యాహ్నం భోజనం చేసిన స్టూడెంట్స్.. ట్యూషన్‌ క్లాసులకు వెళ్లగా అక్కడ ఒకరికి వాంతులయ్యాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే మిగిలిన విద్యార్థులూ అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే అలర్ట్ అయిన ఉపాధ్యాయుడు, సిబ్బంది పాఠశాల సమీపంలోని ఓ వైద్యకేంద్రానికి విద్యార్థులను తరలించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు.

పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థి ప్లేట్‌లో చనిపోయిన బల్లి కనిపించింది. ఈ విషయాన్ని విద్యార్థులు హెడ్ మాస్టర్ కు చెప్పారు. కానీ, ఆయన దానిని బల్లి కాదని, వంకాయ అని చెప్పాడు. అంతే కాకుండా అదే ఆహారాన్ని తినాలని చెప్పాడు. తినకుంటే పస్తులుండాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో స్టూడెంట్స్ ఏమీ చేయలేక అదే ఆహారాన్ని తిన్నారు. కాసేపటికే వాంతులతో ఆస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనను విద్యా శాఖ సీరియస్ గా తీసుకుంది. దర్యాప్తు చేపట్టి, వివరాలు సమర్పించాలని ఆదేశించింది. సిబ్బంది తప్పు చేసినట్లు తేలితే అరెస్టు చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. దీంతో విద్యార్థులు చికిత్స పొందుతున్న స్కూల్ వద్ద పరిస్థితిని పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పహారా కాస్తున్నారు.

కాగా.. విద్యార్థులకు సురక్షిత ఆహారాన్ని అందించాలనే ప్రభుత్వ లక్ష్యం ఇలాంటి ఘటనల కారణంగా నీరుగారుతోంది. పోషకాహార లోపాన్ని నివారించడం, స్కూళ్లల్లో డ్రాపవుట్ల సంఖ్యను తగ్గించడం కోసం ప్రభుత్వం పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అందిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారిలో అధికంగా పేద వారే కావడంతో కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వండి పెట్టిందే తినాలని చెబుతున్నారు. గట్టిగా మాట్లాడితే తిండి కూడా పెట్టకుండా మాడుస్తున్నారు. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..